Post: #1

జానుశిరాసనము


జానుశిరాసనముః


మోకాలిపై తలను ఆనించి వేసేది కనుక ఈ ఆసనానికి జానుశిరాసనమని పేరు కల్గింది.

చేయువిధానముః


నిటారుగా కూర్చుని ఎడమ కాలు చాపి రెండు చేతులతో కాలి బొటనవ్రేలుని పట్టుకోవాలి. కుడి పాదాన్ని ఎడమ తొడకు ఆనించాలి. శ్వాస బయటకు వదిలి, పొట్టను లోపలకు పీల్చి తలను తొడపై ఆనించ ప్రయత్నించాలి. అటు తరువాత మెల్లగా తలను పైకెత్తి శ్వాసను పీల్చాలి.

ఇదే విధంగా కుడికాలు చాపి తలను తొడపై ఆనించాలి. ఆ తర్వాత మెల్లగా తలపైకెత్తి శ్వాసను పీల్చాలి.

ఫలితాలుః


1. కాలేయం, Pancreas, Spleen మొదలగు అవయవములకు ఒత్తిడి కలిగించి ఉత్తేజపరుస్తుంది.

2. జీర్ణశక్తిని పెంచుతుంది.

*****నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనము వేయరాదు*****


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)