Post: #1

కపోతాసనము

కపోతాసనముః

కపోతమనగా పావురము. పావురము రెండు రెక్కలు కాళ్ళు వరకు క్రిందకు దించి ముడుచుకొని పరుంటూ ఉంటుంది. దానిని పోల్చి దీనికి కపోతాసనమని పేరు పెట్టుట జరిగినది.

చేయు విధానముః

వజ్రాసనముపై కూర్చుండి ఉష్ట్రాసనమువలే వెన్నుపామును వెనుకకు వంచి పక్కనున్న చేతులను మోచేతుల వరకు వంచి నడుమును పైకి లేపి మెడను వెనుకకు వంచి తలను అరికాళ్ళపై ఆనించి చేతులు చాచి పై ఫోటోలో ఉన్నట్లు మోకాళ్ళను పట్టుకొనుట వలన దీనిని కపోతాసనము అంటారు.

ఫలితములుః

1. శరీరము స్వాధీనమై లాఘవముగా ఉండును.

2. వెన్నుపూసలు, మెడ, నడ్డి బాగా వంచబడి మృదుత్వము చెందును.

3. నాడీ ప్రవాహములు బాగా జరుగును. మల దోషములు హరించును.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)