Post: #1

కూర్మాసనము - దాని వలన ఉపయోగములు చూడండి


కూర్మాసనముః


కూర్మము అనగా తాబేలు. మన దేహమును తాబేలు రూపములో రూపొందించునది కావున దీనిని కూర్మాసనము అనిరి.

చేయు విధానముః


మెత్తని పక్కపై కాళ్ళు బాగుగా వెడల్పుగా పంగ చాచి కూర్చుండ వలయును. అప్పుడు ముందుకు వంగి ఛాతిని నేలకు ఆనించి రెండు చేతులను వెనుకకు చాచి మోకాళ్ళు క్రిందుగా బారగా చాచి తలను ముఖమును నేలకు ఆనించి సమముగా పరుండుట కూర్మాసనము అనబడును. తాబేలు, ముందు, కాళ్ళవలె మన కాళ్ళు పాదములను, వెనుక కాళ్ళవలె మన చేతులు మణికట్లున్ను, తాబేలు తలవలె మన తలయున్ను, తాబేలు పై పెంకువలె మన వీపు భాగము ఎత్తుగాను ఉండును కనుక దీనిని కూర్మాసనమని అంటారు.

ఫలితములుః


కాళ్ళు చేతులలోని పెద్ద నరములు బాగుగా సాగదీయబడి, బలపడును. వెన్నుపూసలు, నడ్డిపూసలు, పృష్ఠభాగములోని పూసలు బాగుగా వంచబడి నాడీ ప్రవాహములు బాగుగా జరుగును. మెడ నరాలు సాగి బాగుపడును.

*****నడుమునొప్పి ఉన్నవారు ఈ ఆసనము వేయకూడదు*****


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)