Post: #1

చందమామ రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే...కోటి పూలు తేవే....

దయచేసి ఈ చిన్నారి పాటను పూర్తి చేయరూ????

మీ చిన్నతనము గుర్తు చేసుకోవాలంటారా???

అయితే గుర్తు చేసుకొని ఈ పాటను పూర్తి చేస్తారు కదూ!!!

ఇలాంటివి పోస్టు పెట్టానని అనుకోవద్దండి. ఇప్పటి తల్లి తండ్రులు ఇలాంటి ఆణి ముత్యాలను మర్చిపోతున్నారండి!!!

అందుకని మన ఫోరంలో ఈ ఆణి ముత్యాలను పొందు పరుద్దామని నా ఆశ అంతే!!!!

నా ఉద్ద్యేశ్వము ప్రకారము మహిగ్రాఫిక్స్ ఫోరం అంటే అన్నీ దొరికే ఏకైక ఫోరం అని, అందుకే ఈ ప్రయత్నము కూడా!!!!!

మీ అమూల్యమైన అభిప్రాయలను తప్పనిసరిగా తెలపగలరు.

ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post: #2

హయి చందు గారు,

ఈ పాట ఇంతే కావచ్చు ఎమో మరి నాకు తెలిసినంతవరకు వ్రాస్తున్నాను. తప్పులు వుంటే క్క్షమించగలరు.

చందమామ రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే...కోటి పూలు తేవే

బండెక్కి రావే..... బంతి పూలు తేవే, పల్లకిలో రావే....పాలు పెరుగు తేవే

అన్ని కలిపి తేవే మా అబ్బాయి / అమ్మాయి కి ఇవ్వవే....

ఇంతే అనుకొంటున్నాను, ఇంకా వుంటే ఎవ్వరైన పూర్తి చేయగలరు.

మీ .. శేఖర్ రేడ్డి

దుబాయి

Quote this message in a replyReply

Post: #3

శేఖర్ గారు,

ధన్యవాదములు.

మొదట మీ ప్రయత్నము అద్భుతము.

కానీ ఇదిగోనండీ మొత్తం పాట.

చందమామ రావే జాబిల్లి రావే


కొండెక్కి రావే కోటి పూలు తేవే


బండెక్కి రావే బంతిపూలు తేవే


తేరు మీద రావే తేనెపట్టు తేవే


పల్లకిలో రావే పాలు పెరుగు తేవే


పరుగెత్తి రావే పనసపండు తేవే


నా మాట వినవే నట్టింట బెట్టవే


అన్నీ తేవే అబ్బాయి/అమ్మాయి కియ్యవే......


అదండీ విషయము అర్థమయ్యింది కదూ!!!!

మళ్ళీ పాతరోజులలోకి వెళ్ళిపోయి అచ్చ తెలుగు పాటలను (Rhymes) మన భావి తరాలకు అందిద్దాం...

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)