Post: #1

పసి పిల్లలకు అన్నం తినిపించిన తరువాత తల్లి ఆ పసి పిల్లలు తిన్న ఆహారము అరుగుటకు పాడే ఈ పాట

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ పాడే పూర్తి పాటను తెలియపరచగలరు.

ముందస్తు ధన్యవాదములు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post: #2

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం,
గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై,
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై,
భీముడు తిన్న పిండి వంటలు జీర్ణమై,
అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై,
అబ్బాయి తిన్న ఉగ్గు జీర్ణమై,
కుందిలాగ కూర్చొని నందిలాగా పాకి
లేడిలాగ లేచి తాబేలు లాగ తారాడాలి.


ఇదండీ ఆ పూర్తి పాట.
పసి పిల్లలు తిన్న ఆహారము అడగటానికి మరియు దృష్ఠి దోషము తగులకుండా ఉండుటకు ఈ పాట పాడటము జరుగుతుంది.
మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.
మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)