Post: #1

హయ్ ఫ్రేండ్స్, నేను ఒక  సి.డి. ని కోరియర్ లో నా స్నేహఇతునికి పంపాలి. మన ఆంధ్రప్రదేశ్ లోపలే పంపితే ఎన్ని రూపాయల స్టాంప్స్ ఎన్ని,  కోరియర్ మీద పేస్ట్ చేయ్యాలో కాస్తా తెలియజేయండి ప్లీజ్.


Post: #2
cd లని పోస్ట్ / కొరియరు ద్వారా పంపటానికి ప్రత్యేకమైన కవరుని ఉపయోగించాలి . ఈ కవరుని స్టేషనరీ షాప్ /
కొరియరు ఆఫీసు లో కొనాలి . దీనికి 15 లేక 20 రూపాయలు మరియు మీరున్న ప్రాంతాన్ని బట్టి కొరియరు
చార్జిలు 25 లేక 30 రూపాయలు అవుతుంది . స్టాంపులని అతికించకుండా మీ సమీపంలోని కొరియరు ఆఫీసుకు
సిడి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది . [హోమ్ సర్వీసు ఉంటే ఫోను చేస్తే కొరియరు వాళ్లు వచ్చి కలెక్టు చేసుకుంటారు]

Post: #3
హోమ్ సర్వీసు అంటే?, అది ఎలాగో కాస్త తెలియజేయండి ప్లీజ్.

Post: #4
^ హోమ్ కలెక్షను సర్వీసు అని వ్రాసి ఉంటే మీకు స్పష్టంగా ఉండేది Smile ... కొరియరు సర్వీసు వారు
మనం ఉన్న ప్రదేశానికి ( ఇంటికి / ఆఫీసుకి ) వచ్చి పంపించవలసిన కవరుని / పాకెట్ ని కలెక్టు చేసుకోవడం

Post: #5

[హోమ్ సర్వీసు ఉంటే ఫోను చేస్తే కొరియరు వాళ్లు వచ్చి కలెక్టు చేసుకుంటారు]

హోమ్ సర్వీసు అంటే?, అది ఎలాగో కాస్త తెలియజేయండి ప్లీజ్.

^ హోమ్ కలెక్షను సర్వీసు అని వ్రాసి ఉంటే మీకు స్పష్టంగా ఉండేది.

--------------------------------------------------------------------

పై వాక్యాల సందర్భోచితానికి వివరణ :

sure మహాశయా....!!

గమనించండి.

డోర్ డెలివరీ అంటారు.

అంటే ఏమిటన్నమాట...ఇంటి తలుపులను డెలివరీ చేయరు కదా....!!

అదే విధంగా హోమ్ సర్వీస్ కూడానూ....!!

ఇందులో అర్థం కాకపోవటానికి వీలెక్కడున్నది మిత్రమా....!!

అలాగే మన శ్రేయోభిలాషులు యమ్మెన్ మహాశయులు ఇచ్చిన సమాధానాన్ని చూసిన తరువాత మరలా అడగాల్సిన అవసరం మీకు ఎందుకొచ్చిందో మిగతా సభ్యులకర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవటానికి వీలెక్కడుంది. కొరియర్ సర్వీస్ వారికి కేవలం మనీ ఇస్తే బట్వాడా చేస్తారు. పోస్ట్ ఆఫీసులోలాగా స్టాంపులు అతికించాల్సిన పనిలేదు.

మరలా ఇక్కడ ‘‘ బట్వాడా ’’ అంటే ఏమిటని అడుగుతారేమో మరి. ఎందుకయినా మంచిది చెప్పేస్తున్నాం. బట్వాడా అంటే పంపిణీ. అంటే డిస్ట్రిబ్యూషన్ అన్న మాట.

తర్కించిన మీకు మా ధన్యవాదాలు. అవును నిజంగా ప్రశంసిస్తున్నాం.

ఎందుకంటే....అలా తరచి తరచి అడిగే జ్ఞానమే సోపానంగా మారుతుంది......అన్నారు శ్రీ వివేకానంద స్వామి.

అలాగే మీరూ మీ వంతుగా ఈ ఫోరమ్ లో మంచి మంచి పోస్టులతో ముందు శ్రేణిలో నిలుస్తారని ఆశిస్తూ... ధన్యవాదాలు.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)