Post: #1

నా డ్రైవరు పారిపోయింది వెతికి (ప)పెట్టే విధానము చెప్పరూ...ప్లీజ్....

నేను DELL XPS M1530 ల్యాప్టాప్ ఉపయోగిస్తున్నాను.

ఈ మధ్యన ఒక నా ల్యాప్టాప్ ఒక వైరస్ బారిన పడి తీవ్ర జ్వరపడినది. ఆ సమయములో నా ల్యాప్టాప్ లోని భాగములలో ఒకటైన CD/DVD/R-RW DRIVE ను కబళించటము జరిగినది.

నా ల్యాప్టాప్ వైద్యుడు నార్టన్ ద్వారా పూర్తిగా స్కాన్ చేసాను. వైరస్ అయితే పోయినది కాని ల్యాప్టాప్లోని భాగము మాత్రము తిరిగి పొందలేకపోయాను. అప్పటికీ పూర్తి డయాగ్నోస్ ప్రయత్నించి చూసాను, డ్రైవరు మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూసాను. కానీ ఫలితములేకపోయినది.

నా ల్యాప్టాప్ కి పూర్తి ఆరోగ్యము చేకూర్చటానికి సహకారమందించమని విజ్ణులందరికీ నా విన్నపము.

DELL -XPS -M1530

WINDOWS VISTA HOME PREMIUM- SP2 32BIT O/S

ఇంకా ఏమైనా వివరములు కావలెనంటే తప్పనిసరిగా తెలియపరచగలరు.

ముందస్తు ధన్యవాదములు.

మీ...


Post: #2

సార్ ఈక్రింది లింక్ చూడడండి.You are not allowed to view links. Register or Login to view.


Post: #3

కిట్టు గారు,

అడిగినవెంటనే ఆపరేషన్ కి రెడీ అయినందుకు ధన్యవాదములు సార్.

నేను నా ల్యాప్టాప్ లో పై లింకులోని విధానములద్వారా డి.వి.డి డ్రైవ్ పొందుటకు ప్రయత్నిస్తాను.

ఒకవేళ ఇంకా సమస్య పరిష్కరింపబడని ఎడల నేను మరల మీ ముందుకు ఇలా లేదా  ఇలా వస్తాను.

దయచేసి సహాయంచేస్తారని ఆశిస్తూ....

ధన్యవాదములతో...

మీ...


Post: #4

కిట్టు గారు,

మీరు ఇచ్చిన లింకు ఆధారముగా నేను తిరిగి పారిపోయిన డివిడి డ్రైవరును పొందగలిగాను.

మంచి సూచన అందచేసినందుకు ధన్యవాదములు.

మీ నుంచి ఇలాంటి మరిన్ని కష్టనివారణోపాయములు పొందగలమని ఆశిస్తూ....

ధన్యవాదములతో....

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)