Post: #1
మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి విధానమునకు శాస్త్రప్రమాణమైన విషయము తప్పనిసరిగా వుంటుందండీ...
అందుకని తప్పక అమలుపరిస్తే మనకే మంచిది కదా.
కానీ అసలు దాని వెనుక వున్న అర్థమేమిటో ఆ శాస్త్ర ప్రమాణమేమిటో మనకి చేసే మేలేమిటో తెలుసుకోవాలి కదా!!!
అందుకే ఈ ప్రశ్నలు.

ప్రదక్షిణలు ఎన్ని రకములు?
అవి ఏవి?
ప్రదక్షిణలు ఎప్పుడెఎప్పుడు చేయాలి?
అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి?


భేతాళ ప్రశ్నలు కాదు సుమండీ!!!!
తెలుసుకోవల్సిన విషయాలని అడిగాను అంతే!!!
సమాధానము చెప్తారు కదూ!!!!
ముందస్తు ధన్యవాదములు.
మీ...
Quote this message in a replyReply

Post: #2

సర్,
ఇటువంటి విషయాలు  మికే తెలుసు ,సమాధానమా చెప్పి పుణ్యం కట్టుకోండి .తెలుసుకొని ఆనందిస్తాను .ఇటువంటి సందేహంలాన్న,  సమాధానాలన్న ,నాకు చాల ఇష్టం.

ధన్యవాధముల తో
రాఘవేంద్ర రావు
 

Quote this message in a replyReply

Post: #3

ప్రదక్షిణలు రెండు రకములు.

అవి

౧. ప్రాణశక్తినిచ్చే ప్రదక్షిణలు, ౨. ప్రాణోత్థ్హాన ప్రదక్షిణలు.

ఈ రెండు రకముల ప్రదక్షిణలు చేయుటకు అనువైన సమయము సూర్యోదయము నుండి రెండు గంటలు అలాగే సూర్యాస్తమయమునుండి రెండు గంటలు.

మన శరీరానికి శక్తిని చేకూర్చేవి ప్రదక్షిణలు.

గ్రహశాంతులు, జపాలు లాంటివి చేయించుకునేకంటే రోజు మొత్తములో సూర్యోదయము లేదా సూర్యాస్తమయములలో రెండు గంటల పాటు చేసే ప్రదక్షిణల వలన అన్ని గ్రహములకు శాంతి చేకూరటముతో పాటు వాటి వలన శక్తి చేకూరుతుంది. అంతేకాక ప్రదక్షిణలు చేసే సమయములో శరీరములోని నాడులలో, కండరములలో కదలికలు ముఖ్యము.  కనుక నిరంతరము దైవనామమును స్మరిస్తూ ప్రదక్షిణలు చేయ్యాలి. అలా చేయుట వలన శరీరములోని నాడులు, కండరములు ఉత్తేజితమై అనంత శక్తి వస్తుంది.

సూర్యోదయము మరియు సూర్యాస్తమయములనుండి రెండు గంటల పాటు ప్రదక్షిణలు ఎందుకు చేయాలంటే మన శరీరములో ఇడ మరియు పింగళ అనే నాడులుంటాయి. వీటినే సూర్యనాడి మరియు చంద్ర నాడి అని అంటాము.

సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో ప్రదక్షిణలు చేయుటవలన సూర్య శక్తి మరియు చంద్ర శక్తి ఆ రెండు నాడులకు పూర్తిగా అంది మనిషిని ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. అంతేగాక శరీరానికి ఎనలేని శక్తి నిస్తుంది.

Quote this message in a replyReply

Post: #4

సర్,
ప్రదక్షిణం లోని మర్మం చక్కగా వివరించారు.టెంపుల్ కి వెళ్లి ప్రదక్షిణం చేసి రావడం మాత్రమే తెలిసిన నాకు మీ వివరణ వలన ఉపయోగం అర్ధం అయింది

ధన్యవాదములతో
రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)