Post: #1

 *****శ్రీ దత్త శరణాష్టకము*****



*****శ్రీ దత్త శరణాష్టకము*****

***దత్తాత్రేయ తవ శరణం, దత్తనాధ తవ శరణమ్***

1. త్రిగుణాత్మక త్రిగుణాతీత త్రిభువనపాలక తవ శరణమ్
      శాశ్వతమూర్తే తవ శరణం శ్యామ సుందర తవ శరణమ్

2. శేషాభరణ శేషభూషణ శేషసాయి గురు తవ శరణమ్
      షడ్భుజమూర్తే తవ శరణం షడ్భుజ యతివర తవ శరణమ్

3. దండకమండలూ గదా పద్మాకరా శంఖచక్రధర తవ శరణమ్
      కరుణానిధే తవ శరణం కరుణాసాగర తవ శరణమ్

4. శ్రీపాద శ్రీ వల్లభ గురువర నృసింహ సరస్వతి తవ శరణమ్
      శ్రీ గురునాధా తవ శరణం సద్గురునాధా తవ శరణమ్

5. కృష్ణాసంగమ తరువర వాసీ భక్తవత్సల తవ శరణమ్
      కృపానిధే తవ శరణం కృపాసాగర తవ శరణమ్

6. కృపాకటాక్ష కృపావలోకన కృపానిధే ప్రభు తవ శరణమ్
       కాలాంతక తవ శరణం కాలనాశక తవ శరణమ్.

7. పూర్ణానంద పూర్ణ పరేశ పూర్ణ పురుష తవ శరణమ్
      జగదీశ తవ శరణం జగన్నాథ తవ శరణమ్.

8. జగత్పాలక జగదీశ జగదోద్ధార తవ శరణమ్
      అఖిలాంతక తవ శరణం అఖిలైశ్వర్య తవ శరణమ్

9. భక్తప్రియ వజ్ర పంజర ప్రసన్న వక్త్ర తవ శరణమ్
      దిగంబర తవ శరణం దీన దయాఘన తవ శరణమ్

10. దీననాధ దీన దయాళ దీనోద్ధార తవ శరణమ్
        తపోమూర్తే తవ శరణమ్ తేజోరాశే తవ శరణమ్

11. బ్రహ్మాండ బ్రహ్మ సనాతన బ్రహ్మ మోహన తవ శరణమ్
        విశ్వాత్మక తవ శరణం విశ్వ రక్షక తవ శరణమ్

12. విశ్వంభర విశ్వజీవన విశ్వపరాత్పర తవ శరణమ్
        విఘ్నాంతక తవ శరణం విఘ్ననాశక తవ శరణమ్

13. ప్రణవాతీత ప్రేమవర్ధన ప్రకాశమూర్తే తవ శరణమ్
        నిజానంద తవ శరణం నిజపదదాయక తవ శరణమ్

14. నిత్య నిరంజన నిరాకార నిరాధార తవ శరణమ్
        చిదాత్మరూప చిదానంద చిత్సుఖకంద తవ శరణమ్

15. అనాది మూర్తే తవ శరణం అఖిలావతార తవ శరణమ్
        అనంతకోటి బ్రహ్మాండ నాయక అఘాతీత ఘటన తవ శరణమ్

16. భక్తోద్ధార తవ శరణం భక్తరక్షక తవ శరణమ్
        భక్తానుగ్రహ గురు భక్తప్రియ పతితోద్ధార తవ శరణమ్

   *****శ్రీ దత్త శరణం మమ*****

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)