Post: #1

నా కీబోర్డ్ సడెన్ గా పనిచేయడం మానివేసింది.అంటే ఇది నా కీబోర్డ్ ప్రాబ్లం కాదు ఎందుకంటే ఇదే కీబోర్డ్ వేరే సిస్టంలో పనిచేస్తుంది.

కాని నా సిస్టంకి కనెక్ట్ చేసినప్పుడు పనిచేయట్లేదు.నా సిస్టంకి పాస్వర్డ్ పెట్టుకున్నాను.ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయడం రావట్లేదు.

వేరే కీబోర్డ్స్ కూడా పనిచేయట్లేదు.Bois సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే పనిచేస్తుంది.బూటింగ్ తర్వాత పనిచేయట్లేదు..

మార్నింగ్ సిస్టం ఆన్ చేసినప్పడినుండి ఇదే ప్రాబ్లం.దయచేసి ఎవరైనా సొల్యూషన్ చెప్పగలరు..వీలైనంత త్వరలో...

కొన్ని ముఖ్యమైన ఫైల్స్ నా సిస్టం నుండి పంపవలసి ఉంది..అందుకనే వీలైనంత త్వరలో అని అడిగాను..మరోలా భావించవద్దు.


Post: #2
ఇలాంటి సమస్యలకి ఆపరేటింగు సిస్టమ్ వివరాలని ఇవ్వడం చాలా ముఖ్యమైనది . అలాగే ఈ సమస్యకి ముందు ఇటీవల ఏవైనా
సాఫ్టువేర్లని / డివైజ్ డ్రైవర్లని ఇన్స్టాల్ చేసారా - సంబంధిత వివరాలతో తెలియచేస్తే సమాధానమిచ్చేవారికి సులువుగా ఉంటుంది

[info]Edit (@ 1520 IST) : కింద ఉన్న సూచనలు బయోస్ సిస్టమ్ పాస్ వర్డు కి సంబంధించినవి . అంటే ఆపరేటింగు సిస్టమ్ కి
సంబంధించిన పాస్ వర్డుకి సంబంధించిన పరిష్కారం కొరకు వేరే ప్రయత్నం చేయాలి . ఈ కింద ఉన్నది అసమగ్రమైన సమాధానం Sad [/info]

సిస్టమ్ లోని బయోస్ లో స్టోర్ అయిన పాస్ వర్డుని తొలగించే ప్రయత్నం :
మీ బయోస్ సెట్టింగులకి బ్యాకప్ ఉన్నా లేదా ఆ సెట్టింగులు డిఫాల్టుకి మారిపోయినా ఫరవాలేదనుకుంటే మీరు సిస్టమ్ లోని
CMOS battery ని తొలగించి ఓ 10 నిమిషాల తర్వాత సిస్టమ్ ని ఆన్ చేసి చూడండి . ఇలా బూట్ అవకుంటే మరల
సిమోస్ బాటరీని అమర్చి సిస్టమ్ ని ఆన్ చేసి చూడండి . ఇలా కనుక పాస్వర్డు తొలగిపోకుంటే BIOS ని జంపరు ద్వారా హార్డు
రీసెట్ చేయవలసి ఉంటుంది ; ఈ BIOS హార్డు రీసెట్ వివరాలు మీ సిస్టమ్ మాన్యువలులో లభిస్తాయి .

మీ సిస్టమ్ బూట్ అయితే కీబోర్డు పనిచేయకపోవడానికి కారణాన్ని కనుక్కునే ప్రయత్నం చేయవలసి ఉంది ...

Post: #3

(30-Jan-2010 01:10 PM)mn48 Wrote: You are not allowed to view links. Register or Login to view.ఇలాంటి సమస్యలకి ఆపరేటింగు సిస్టమ్ వివరాలని ఇవ్వడం చాలా ముఖ్యమైనది . అలాగే ఈ సమస్యకి ముందు ఇటీవల ఏవైనా సాఫ్టువేర్లని / డివైజ్ డ్రైవర్లని ఇన్స్టాల్ చేసారా - సంబంధిత వివరాలతో తెలియచేస్తే సమాధానమిచ్చేవారికి సులువుగా ఉంటుంది

నేను విండోస్ xp ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నాను.

కొత్తగా అంటే వారం ముందు 500GB Hard disk పెట్టాను.అది సరిగానే పనిచేస్తుంది.

సాఫ్ట్వేర్ అంటే ఒక రోజు ముందు నీరో 7 ఇన్ స్టాల్ చేసాను.

రాత్రంతా బాగానే పనిచేసింది..ఉదయం నుండి ప్రాబ్లం..


Post: #4

(30-Jan-2010 01:10 PM)mn48 Wrote: You are not allowed to view links. Register or Login to view.మీ సిస్టమ్ బూట్ అయితే కీబోర్డు పనిచేయకపోవడానికి కారణాన్ని కనుక్కునే ప్రయత్నం చేయవలసి ఉంది ...

నా మదర్ బోర్డ్ Gigabyte G31 Model.ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా మదర్ బోర్డ్ PS2 Type కీబోర్డ్ మరియు మౌస్ ను డిటెక్ట్ చేయట్లేదు.USB Type కీబోర్డ్ మరియు మౌస్ ను మాత్రమే సపోర్ట్ చేస్తున్నది.ఇది సడెన్ గా వచ్చింది కాబట్టి మొదట అర్థం కాలేదు.నా మదర్ బోర్డ్ ని Gigabyte కి పంపించాను.

Thanks for your Support..


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)