Post: #1
మిత్రులారా...!!

ఒక బావి లోతు 40 అడుగులు ఉంది. ఒక కప్ప పొరపాటున ఆ బావిలో పడిపోయింది. ఆ కప్పకు ఒక లక్షణం ఉంది. అది రోజుకు నాలుగడుగులు పైకి ఎగిరి మూడు అడుగులు కిందకు జర్రున జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే...ఆ బావి అంతా పాచి పట్టిపోయి ఉండటం వల్ల....మరియు కప్ప యొక్క అశక్తత వల్ల అయి ఉండొచ్చు. ఇలా రోజుకు నాలుగడుగులు పైకి ఎగురుతూ....మూడుఅడుగులు జర్రున కిందకు జారుతూ.....ఉంటే...
పూర్తిగా బావి నుంచి బైట పడటానికి ఎన్ని రోజులు పడుతుంది. బస్తీ మే సవాల్...!!
Quote this message in a replyReply

Post: #2
37 రోజుల్లో కప్ప బయటకు రాగలదు.

మొదటి రోజు 4 అడుగులు పైకు వెళ్తుంది. 3 అడుగులు దిగుతుంది. అంటే 1 అడుగు ఒక రోజుకి.

మొదటి రోజు - 1 అడుగు
రెండవ రోజు - 1 + 4 - 3 = 2 అడుగులు
--------
--------
--------
--------
--------
--------

36 వ రోజు - 36 అడుగులు
37 వ రోజు - 36 + 4= 40

40 అడుగులు ఎక్కి నూతి పైకి వస్తే ఇంక ఆ కప్ప ఆ మూడు అడుగులు కిందకు పడదేమో కదా సార్.

my Blog
You are not allowed to view links. Register or Login to view.


Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)