Post: #1
మిత్రులారా...!!

ఒకసారి మా మిత్రుడు ఆఫీసుకని హడావుడిగా బయలుదేరి....దారిలొ కొంతదూరం వెళ్ళిన తరువాత ఏదో అర్జంట్ ఆఫీస్ ఫైళ్ళు మరిచిపోయాడు. అది గుర్తొచ్చి...నాలుక కర్చుకొని....అర్రర్రే...అనుకుంటూ...వెనుదిరిగి వచ్చాడు. రాగానే అక్కడ గుమ్మంలో తన భార్య తలారబెట్టుకుంటూ....వయ్యారంగా నిలుచుని ఉంది. ఇంతలో మనోడు....కొంచెం ఫీలయ్యి....కనుబొమ్మలు ఎగురవేసి....విజిల్ వేసి....తన బుగ్గ మీద చిటికె వేసి....కొంచెం అనుమానాస్పదంగా....‘‘ఏంటోయ్...ఈ వేళప్పుడు...ఇక్కడ నిల్చున్నావ్....హ హ నేను ఆఫీసుకు వెళ్ళిన తరువాత నీవు చేసే పని ఇదా...ఈ సోగ్గాడు శోభనాద్రిని మరిచిపోతావా...? అంటూ...కొంచెం అనుమానం...కొంచెం అభిమానం ధ్వనించిన గొంతుతో గట్ఠిగా అడిగేసరికి.....

అసలే వయ్యారి....ఆ చిన్నది ఇచ్చిన షాక్ తగిలి దెబ్బకు ‘‘ఠా’’ అని పడిపోయాడు. ఇంతకీ ఆ సమాధానం ఏమిటో కనపడిన వారినందరినీ అడుగుతున్నాడు. నన్నూ అడిగాడు. మరి మిమ్మల్ని కూడా అడగొచ్చు. అదేమిటంటే...

‘‘అబ్బో...నాకు మీరొక్కరేంటి...???? నేను మీరూహించినట్టు ఒకరి కోసం ఇక్కడ నుంచొన్నానండీ....మనల్ని పుట్టించినవాడి ముని మనవడు ఒకావిడను ఎత్తుకెళ్ళాడండీ....ఆ ఎత్తుకెల్ళిన ఆవిడను వెతకడానికి ఒకతను బయలు దేరాడండీ....వారి తండ్రి కోసం ఇక్కడ నిల్చున్నానండీ....ఆఁ...’’

అంటూ వయ్యారాలు పోతూ చెప్పిందంట...మరి మనోడు బుర్ర బర్రు...బర్రు మంటూ గోక్కుంటూ....:huh::huh::huh::huh:

మరి మీకేమన్నా తెలిసిందా .... ఇందులోని మర్మం...!! సమాధానం తెలిసిన వారు చెప్పటం ధర్మం. చెప్పకపోవటం అధర్మం...!!
Quote this message in a replyReply

Post: #2
సాదారణంగా ఇటువంటి ప్రశ్నలకి సమాధానం భర్తే అని వస్తుంది.

కాని మరో సమాధానం వచ్చింది. నాది తప్పు అయి ఉండవచ్చు.

మీరు సమాధానాన్ని వివరించి ఇవ్వగలరు.

ధన్యవాదములు.
Quote this message in a replyReply

Post: #3
మీరు అడిగిన ప్రశ్నలోనే క్లూ ఉంది.."తల ఆరబెట్టుకోవడం"

మనల్ని పుట్టించినవాడు = బ్రహ్మ

ముని మనవడు = బ్రహ్మ కుమారుడు పులస్త్యుడు...పులస్త్యుని కుమారుడు విశ్రవసుడు....విశ్రవసుని కుమారుడు రావణాసురుడు..కాబట్టి బ్రహ్మ ముని మనవడు రావణాసురుడు

రావణాసురుడు ఎత్తుకెళ్లినది = సీత

సీతను వెతకడానికి వెళ్లినది = హనుమంతుడు

హనుమంతుని తండ్రి = వాయు దేవుడు (గాలి)

సో టోటల్ గా ఆమె తల గాలికి ఆర బెట్టుకోవడానికి బయట నిలబడింది.

100% రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
మహి గారు

అయ్య బాబోయ్, సుమణి వెంకట్ గారు అడిగిన ప్రశ్న కంటే మీ విశ్లేషణతో కూడిన సమాధానం ఒక్క క్షణం మాటరాకుండా చేసిందంటే నమ్మండి!

హాట్సాఫ్
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)