Post: #1

వేదములెన్ని?

అవి ఏవి?

వాటి ఉపవేదములేవి?

వాటి రూపలక్షణములేవి?

తెలిస్తే కొంచెము సవివరముగా తెలియపరచగలరు.

ముందస్తు ధన్యవాదములతో....

మీ...

Quote this message in a replyReply

Post: #2

వేదములను పురుషునితో పోలుస్తారు.

వేదములు నాలుగు. అవి

ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అథర్వణ వేదము.

ఒక్కొక్క వేదము యొక్క రూప లక్షణములు వాటి ఉపవేదముల గురించి తెలుసుకుందాము.

ఋగ్వేదముః

ఋగ్వేదమునకు ఉపవేదముః ఆయుర్వేదము

గోత్రముః ఆత్రేయస గోత్రము

ఛందస్సుః గాయత్రీఛందస్సు

అధిదేవతః బ్రహ్మ

వర్ణముః ఎరుపు

రూపముః తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాల జుట్టు, వంకరమీసము, రెండు మూరల పొడవైన దేహము.

భాగములుః చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము,క్రమపారము, జట, రధక్రమము మరియు దండక్రమము అనబడే భాగాలున్నాయి.

శాఖలుః అశ్వలాయని, సాంఖ్యాయని, శాకలా, భాష్కలా మరియు మాండుకేయులు అనబడే అయిదు శాఖలు.

యజుర్వేదముః

యజుర్వేదమునకు ఉపవేదముః ధనుర్వేదము

గోత్రముః భారద్వాజస గోత్రము

ఛందస్సుః త్రిష్ఠుప్ ఛందస్సు

అధిదేవతః రుద్రుడు

వర్ణముః తామ్రవర్ణము

రూపముః సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరలు పొడవు గలిగిన దేహము కలిగి వుంటాడు.

అంగములుః శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే ఆరు అంగములు.

ఉప అంగములుః ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అను ఎనిమిది ఉప అంగములు.

శాఖలుః మొత్తము 85 కానీ ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి.

సామవేదముః

సామవేదమునకు ఉపవేదముః గంధర్వము

గోత్రముః కాశ్యపస గోత్రము

ఛందస్సుః జగతీ ఛందస్సు

అధిదేవతః విష్ణువు

వర్ణముః తెలుపు

రూపముః మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి ఆరుమూరల పొడవు కలిగిన దేహము కలిగి ఉంటాడు. ఈయన శమము, దమము మొదలగు దైవీ సంపద కలవాడు.

సామవేదమునకు 1000 శాఖలు కలవు.

అధర్వణ వేదముః

అధర్వణ వేదమునకు ఉపవేదముః అస్త్రరూపము

గోత్రముః బైజానక గోత్రము

ఛందస్సుః త్రిష్ఠుప్ ఛందస్సు

అధిదేవతః ఇంద్రుడు

వర్ణముః నలుపు

రూపముః త్రీక్షణమైన ఆకారము కలిగి నల్లని వర్ణమాల కలిగిన కామరూపుడు, ఏకపత్నీవ్రతుడు, ఏడు మూరల పొడవు కలిగిన దేహమును కలిగియుంటాడు.

శాఖలు - తొమ్మిది

కల్పములు- ఐదు

అదండీ వేదములను గురించి పూర్తి వివరములు.

అర్ధమయ్యింది కదూ...

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)