Post: #1

చిన్నారి తన చిట్టి పాదాలతో

గుండెలపై ఆడిన క్షణాలు గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది...


తనకు తినిపించిన గోరుముద్దలలోని

ఎంగిలి మెతుకు తీయదనం గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది…


తన నునులేత నుదుటిపై

పెట్టిన ఆత్మీయ ముద్దు గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది…


బ్రాయిలర్ లోంచి డాడీ డాడీ అన్న

ఆర్తనాదం వినిపించి

ఒక నాన్న గుండె ఆగింది…

(వైష్ణవి, తండ్రి ప్రభాకర్ ల అకాల మరణానికి నివాళిగా)


ఈ కవితను నా సామాన్యుడి బ్లాగ్ లో కుడా చూడొచ్చు. You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2

మిత్రమా,

తల్లితండ్రుల నిష్కల్మషమైన ప్రేమకి ఇదొక మచ్చు తునక.

కర్కశ, పాషాణ హృదయులచేతిలో వసివాడిపోయిన పసి జీవితం కళ్ళెదుటలేదు అని జీర్ణించుకొనేలోపే విలవిలలాడిన తండ్రి హృదయము ఆగిపోయింది.

మానవత్వము పూర్తిగా కనుమరుగయిపోయింది....

మీరర్పించిన ఈ కవితతో పాటు మా అశ్రుపూరిత నివాళులు కూడా అర్పిస్తున్నాము.

వారిద్దరి ఆత్మలు మరి ఇక ఈ క్రూర ప్రపంచములోకి మరల రాకూడదని ముక్తి పొందాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తూ....

మీ...

Quote this message in a replyReply

Post: #3
Thanks for ur kind concern
Quote this message in a replyReply

Post: #4

గుండెను కలచివేసే ఈ వార్తకు, ఆ కుటుంబ సభ్యులు అనుభవించే మానసిక వేదనకు ఏ వివరణా సరిపోదు, ఏ మనసూ చలించక మానదు, మానవులకంటే మృగాలు నయం అనిపించే పైశాచిక ప్రవర్తనలకు పరాకాష్టే ఈ సంఘటన.

ఫొటో:సాక్షి దిన పత్రిక వారికి ధన్యవాదములతొ


కుమారి నాగ వైష్ణవి, శ్రీ పలగాని ప్రభాకర్ ల ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ


అశ్రుతప్త నయనాలతో

చిలకపాటి శివరామ ప్రసాద్

Quote this message in a replyReply

Post: #5
........................................... ???????

మాటలు రానప్పుడు అంతే.
ఈ ప్రపంచంలో స్పందించని హృదయం ఉంటుందా ????
రాకడ వింతే
పోకడ వింతే
ఏది ఏమైనా వారిరువురి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాము.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)