Post: #1
ఇది ఈనాడు దినపత్రిక నుండి సేకరించిన కథనం . అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండగలదని ఆకాంక్ష


[info]అతను ఎందరికో స్ఫూర్తి... ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం... ధైర్యానికి చిరునామా...
అతని ఆత్మవిశ్వాసం ముందు... విధి తల వంచింది... [/info]

[alert]( _____ ) తాము ఏమీ చేయలేమని... ఏమీ చేతకాదని నిరాశలో కూరుకుపోయే ఎందరికో ఇతను ఆదర్శమూర్తి అనడంలో సందేహం లేదు... సివిల్‌ ఇంజినీర్‌ పట్టభద్రుణ్ని విధి క్రూరంగా కాటేసింది... అయినా అతను చలించలేదు... 20 సంవత్సరాలుగా మంచానికి అతుక్కుపోయినా... అలాగే పడుకుని కేవలం చేతివేళ్ల సాయంతో కీబోర్డును చాకచక్యంగా కదిలిస్తూ యానిమేషన్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు... భారతదేశంలోనే మొట్టమొదటి ప్రోగ్రాంగా నిలిచిన గ్రాఫిక్‌ డిజైన్‌లో భాగం పంచుకున్నాడు...[/alert]

[info]దానవాయిపేటలో నివాసం ఉంటున్న అతని పేరు చిత్రపు సూర్యశ్రీనివాస్‌. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జరిగిన ఓ దుర్ఘటనలో శ్రీనివాస్‌ జీవచ్ఛవమయ్యాడు. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. చివరికి శరీరంలోని అవయవాలు కదిలించడమే కష్టమయ్యే పరిస్థితి. సివిల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు శ్రీనివాస్‌ గాలిపటం ఎగరవేస్తూ రెండస్తుల మేడపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఇతని జీవితానికి తిరుగులేని ఎదురు దెబ్బ తగిలింది. విధి... తానే గెలిచాననుకుంది కాని శ్రీనివాస్‌ ఆత్మవిశ్వాసం ముందు అన్ని పటాపంచలయ్యాయి. అవయవాలు సహకరించపోయిన పట్టుదలతో అందరూ ప్రశంసించే స్థాయికి గ్రాఫిక్‌ డిజైనర్‌గా యానిమేషన్స్‌ రూపకర్తగా రూపుదాల్చారు. 20 సంవత్సరాల నుంచి మంచంపైనే దైనందిన జీవితాన్ని సాగించే శ్రీనివాస్‌ ఇంతటి గ్రాఫిక్‌ పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం అతని పట్టుదలకు నిదర్శనం. ఎందరో దీన్ని అద్భుతంగా పరిగణిస్తున్నారు. [/info]

[alert]ఆతని బాల్యం... ఓ మధురానుభూతి..
అందరి పిల్లల్లాగే చిన్నప్పుడు చలాకీగా ఉండేవాడు. చదువులో, ఆటల్లో ఫస్టు వచ్చే వాడు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని బహుమతులు గెల్చుకొనేవాడు. ఆల్‌ ఇండియా రేడియోలో మూడు సార్లు పోటీలో పాల్గొని బహుమతి గెల్చుకున్నాడు. రాజమండ్రిలోని ఎ.పి. పేపర్‌మిల్‌ మోడల్‌స్కూల్‌లో 10వ తరగతి, గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, విజయవాడ కొనేరు లక్ష్మయ్య కాలేజిలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. స్టీఫెన్‌ హాకిన్స్‌ను శ్రీనివాస్‌ ఆదర్శంగా తీసుకొన్నారు. [/alert]

[info]రూపుదిద్దుకున్న ప్రాజెక్టులు
అతని ప్రతిభ ఈ రాష్ట్రం ఎల్లలు దాటింది. ఈస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే (బీహార్‌) దేశంలోనే ప్రప్రథమంగా రైల్వే డ్రైవర్ల శిక్షణకు ప్రవేశపెట్టిన ‘ట్రైన్‌- సిమిలేటర్స్‌’ రూపకల్పనలో ఇతని గ్రాఫిక్‌ భాగస్వామ్యం ఒక చరిత్రను సృష్టించింది. మొట్టమొదటిసారిగా భారత రైల్వే వ్యవస్థ డ్రైవర్ల శిక్షణకు సిమిలేటర్సును వినియోగించడం, దీనికి చిత్రపు శ్రీనివాస్ గ్రాఫిక్స్‌ రూపొందించడం రాష్ట్ర ప్రతిష్ఠను తీసుకువచ్చింది. అంతే కాకుండా స్థానికంగా ఉన్న రాష్ట్రంలో పలు టీవీ ఛానళ్ల వార్తల ముందు వచ్చే గ్రాఫిక్స్‌ ఇతని చేతిలో రూపుదిద్దుకున్నవే. కంప్యూటర్‌ విజ్ఞానం అనే పత్రిక ఎడిటోరియల్‌ బోర్డులో సభ్యుడిగా అనేక విషయాలు సమాజానికందిస్తున్నాడు. అనేక ఆలోచనలకు ఆయన గ్రాఫిక్‌ రూపం ఇచ్చి పొందుపర్చారు. ఇంతేకాక బి.ఇ.డి. సిలబస్‌లో ఉన్న కంప్యూటర్‌ పాఠాలను రూపొందించారు. ఎం.ఎస్‌. ఆఫీస్‌ (తెలుగు) ట్యుటోరియల్‌ పుస్తక రూపంలో రచించటమే కాకుండా సి.డి. రూపంలో రూపుదిద్దారు. అతను ఎంతో కష్టపడి సముపార్జించుకున్న విజ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు.

(_____) శ్రీనివాస్‌ తల్లిదండ్రులతో పాటు స్నేహితులు అతనికి అండగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు. [/info]
Quote this message in a replyReply

Post: #2

మంచి టాపిక్ ను అందించారు. ఇది అందరికి స్ఫూర్తిదాయకం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

Quote this message in a replyReply

Post: #3

Sir,

Good Post

Quote this message in a replyReply

Post: #4
Hats off.....to srinu garu.
Be confident ..Be a Legend.

Nijamga ilanti vallu desaniki entho upayogam.
Quote this message in a replyReply

Post: #5
good post sir

hats off to srinivas
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)