Post: #1

ఏ ఏ పాపాలు చేస్తే ఎటువంటి జన్మలు (అధోగతి) కలుగుతాయి.

దయచేసి చెప్పి పుణ్యంకట్టుకోండి

మరల మరల ఆ పాపాలను చేయకుండా అటువంటి జన్మలు ఎత్తకుండా ముందు జాగ్రత్తండీ!!!

ముందస్తు ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #2

[quote='chandu' pid='7792' dateline='1265217144']

ఏ ఏ పాపాలు చేస్తే ఎటువంటి జన్మలు (అధోగతి) కలుగుతాయి.

తెలుసుకోండి

తల్లి తండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు, ఆచారము పాటించని వారితో స్నేహము చేసేవారు, తల్లి తండ్రులను - బిడ్డలను, ఆవులను - దూడలను విడదీసినవారు, భగవంతునికి అర్పించకుండా భుజించువారు, అతిథులను సేవించనివారు, సద్బ్రాహ్మణులను దూషించేవారు, యోగ్యతలేనివారిని గౌరవించేవారు, ఇతరుల భూమిని దొంగిలించేవారు, తమ గురువును, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాదికర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేదమార్గం విడిచి మంత్ర ప్రయోగము చేసేవారు, గురువంటే మానవుడే అనిచెప్పి గురువు తప్పులెంచేవారు, గురునింద విని సంతోషించేవారు, శివ-కేశవులు వేరన్న బేధబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, అర్హతలేని వారినుండి మంత్రోపదేశం పొందేవారు - ఛండాల జన్మ పొందుతారు.

గురువును, కుటుంబమును విడిచిన వారికి - తరువాతి జన్మలో ఘోరమైన వ్యాధులు వస్తాయి.

ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి - మరుజన్మలో గుండె జబ్బులు వస్తాయి.

గర్భస్రావం చేయించుకున్న స్త్రీ - తరువాత జన్మలో గొడ్రాలవుతుంది లేదా ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు.

ధర్మశాస్త్రములు, పురాణములు వినని వారికి - మరుజన్మలో గ్రుడ్డితనము, చెవుడు వస్తాయి.

పతితులతో స్నేహము చేసిన స్త్రీ - మరుజన్మలో గాడిదగా జన్మిస్తుంది.

బ్రాహ్మణ హత్య వలన - మరుజన్మలో క్షయరోగము సంభవిస్తుంది.

ధర్మవిరుద్ధమైన రతి వలన - మరుజన్మలో కుష్టురోగము వస్తుంది.

నమ్మక ద్రోహము చేయుట వలన - మరుజన్మలో అన్నద్వేషము (అన్నము ఒంటబట్టని రోగము), అజీర్ణము కలుగుతాయి.

ఇతరుల సేవకుల మనసులు విరిచి తమసేవ చేయించుకునేవారికి - మరుజన్మలో చెరసాల ప్రాప్తిస్తుంది.

పుణ్యకర్మలను చేయకపోగా తప్పుబట్టేవారు, వారి మాటలను నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ణాలను ధ్వంసము చేసేవారు, ఏకాదశి మొదలగు వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మముననుసరించేవారు, తమ పుణ్యాలను, ఇతరుల పాపాలను ఏకరువుపెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మ భ్రష్టులు, ఇతరులకు సంతాపము కలిగించేవారు - మరణించాక సూక్ష్మ శరీరముతో శిక్షలననుభవించాక మరల భూమి మీద ఛండాల యోనుల యందు జన్మిస్తారు.

క్రోధము, పర స్త్రీలయందు కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలగు రసవస్తువులను అమ్ముట, వేదలను అమ్ముట, భగవదర్పితము కాని ఆవు పాలు త్రాగుట, తినకూడని అన్నమును తినుట, దుర్మార్గులనుండి దానమును స్వీకరించుట, ఇతరుల జీవనాధారమునపహరించుట, సాయం సంధ్య సమయములో నిద్రించుట వలన బ్రాహ్మణుడైనా సరే ఇలాంటి పనులు చేస్తే మరుజన్మలో ఛండాలుడుగా జన్మించవలసినదే...

ఇలాంటి వాడు యమలోకములో అనుభవించే శిక్షలు 8కోట్ల 40 నలభై లక్షలు. వీటిలో ప్రధానమైనవి 21.

ఇలా శిక్షలనుభవించాక వాడు భూమిపై జన్మించుట లేకపోతే వాసనాబలం వలన భూతముగనో, ప్రేతముగానో వుండి ఇంకనూ శిక్షను అనుభవించవలసి వుంటుంది.

గురుద్రోహి, బ్రాహ్మణులను అవమానించినవాదు - బ్రహ్మరాక్షస జన్మనెత్తుతారు.

అతిధిని విడచి తాను భుజిస్తే - కోడి జన్మ

ద్రవ్యమును అపహరిస్తే - ఒంటె జన్మ

ఫల పత్రాదులను దొంగిలిస్తే - కోతి జన్మ

తేనె దొంగిలిస్తే - పక్షి జన్మ

మాంసమపహరిస్తే - గ్రద్ద జన్మ

అన్నమపహరిస్తే - మిడత జన్మ

జలమపహరిస్తే - చాతక పక్షి జన్మ

ధాన్యమపహరిస్తే - మిడత జన్మ

విషమపహరిస్తే - తేలు జన్మ

బంగారమపహరిస్తే - క్రిమికీటకాదుల జన్మ లేదా పక్షి జన్మ

గడ్డి దొంగిలిస్తే - పశువు జన్మ

మంత్రరహితముగా భుజిస్తే - కాకి జన్మ

మిత్రద్రోహము చేస్తే - గ్రద్ద జన్మ

బ్రాహ్మణుని చంపితే - క్షయరోగిగా

గ్రంధములు దొంగిలిస్తే - గ్రుడ్డివానిగా

గణార్ధచోరుడు - గండరోగిగా

పరుల ద్రవ్యములను అపహరిస్తే - సంతాన హీనులుగా

వస్త్రములనపహరిస్తే - చర్మరోగిగా

అసత్యమాడేవారు, ఆహారమును దొంగిలించేవారు - గుల్మరోగులుగా

నూనె అపహరిస్తే - సుఖరోగములు

విశ్వాసఘాతకులకు - వాంతులు

దైవ ధనమపహరిస్తే - పాండురోగము వస్తాయి.

దీనిని బట్టి రోగములన్నీ పాప ఫలితములే అని అర్థమవుతున్నది కదూ!!!!

పరస్త్రీతో రతి వలన - నూరు జన్మలు కుక్కగా పుడతారు

పరస్త్రీ భగ దర్శనము వలన - గ్రుడ్డితనము

బంధువుల భార్యతో రతి వలన - గాడిద, పాము జన్మలు

పరస్త్రీ ఆలింగనము వలన - గుండె పోటు కలుగుతాయి.

కనుక ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తిన మనము సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారము చేయక తల్లి తండ్రులను, గురువులను, దైవమును ఎల్లవేళలా పూజిస్తూ, సమాజముకొరకు తనకు వీలైనంతలో పాటు పడుట శ్రేయస్కరము.

ఎవరి మనసునైనా నొప్పించిన ఎడల మనఃపూర్వకముగా క్షమించగలరు.

ఇది నా అభిప్రాయము మాత్రమే...

ధన్యవాదములతో...

మీ..

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)