Post: #1
తెలుగులో బ్లాగులని ప్రారంభించడం , నిర్వహించడం గురించి ఇక్కడ ఫోరంలలో తరుచూ చర్చించుకుంటూ
ఉన్నాము . బ్లాగులకి సంబంధించిన అనేక విషయాలకి ట్యుటోరియళ్లు , సందేహాలు - సమాధానాలు ...
మొదలైన అంశాలతో ఈ మహిగ్రాఫిక్సు ఫోరం అవసరమున్నవారికి ఎంతో ఉపయోగపడుతున్నది .

అలాగే బ్లాగింగు ప్రక్రియ గురించిన చక్కటి సమాచారంతో కంప్యూటరు విజ్ఞానం అనే తెలుగు మాసపత్రిక
ఒక ప్రత్యేక అనుబంధంని & తెలుగు సిడిని ఇటీవల వెలువరించింది . ఈ పత్రిక జనవరి నెల సంచికలో
బ్లాగులకి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి :
1. బ్లాగింగు పరిచయం 2. కంప్యూటరుని తెలుగుకోసం సిద్ధం చేయడం 3. బ్లాగింగు ఎలా
4. బ్లాగు అంశాలు 5. బ్లాగులకోసం అదనపు వనరులు

ఈ అంశాలని తగిన చిత్రాలతో వివరించడం తో పాటు ఒక సిడిలోనూ స్క్రీనుషాట్లు &
తెలుగు ఆడియో తో (సిడి నిడివి సుమారు 45 నిమిషాలు) అందించడం జరిగింది .

బ్లాగుల పట్ల ఆసక్తి ఉన్నవారికి తెలుగులో బ్లాగులకి సంబంధించిన ఈ ప్రత్యేక అనుబంధం &
సిడి చక్కగా ఉపయోగపడగలవు . ఈ మాసపత్రిక - విడి సంచిక వెల 60 రూపాయలు .

ప్రస్తుతం ఈ సంచిక మార్కెటులో లభిస్తుంది .

You are not allowed to view links. Register or Login to view. ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉంది .
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)