Post: #1

Hi Friends,


A Very Good Morning to U with a lot of happyness.


నేను లాప్ టాప్ కొందామనుకుంటున్నాను. ధర 30000 - 35000 ఉంటే ఒ.కె.
ఏ కంపెనీ మంచిదో చెప్పగలరు. కన్ఫిగరేషన్ సజెస్ట్ చేయగలరు.
ఆన్ లైన్ లో కొంటే మంచిదా ?? లేక డీలర్ దగ్గర కొంటే మంచిదా??
లాప్ టాప్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా??
నా సందేహాలకి వీలైనంత త్వరగా స్పందించగలరని ఆశిస్తున్నాను.
చాలా త్వరగా కొనవలసి ఉన్నది. దయచేసి సహాయమందించగలరు.



ముందస్తు ధన్యవాదములు



Quote this message in a replyReply

Post: #2
మరల ఒకసారి గతంలోని ఈ సిమిలరు టాపికుని చూడగలరు : You are not allowed to view links. Register or Login to view.

త్వరగా పొందాలంటే డీలరు వద్ద కొనాల్సి ఉంటుంది . మీ అవసరాలని నోటు చేసుకుని మీ దగ్గరలోని డీలరు వద్దకి
తీసుకుని వెళ్లండి . మీ బడ్జెటుని తెలియచేసి చక్కగా ఉపయోగపడగల లాప్ టాప్ ని సజెస్ట్ చేయమని కోరండి Smile

బ్రాండు ఏదైనా కాన్ఫిగరేషనుని బట్టి పనితనం ఉంటుంది . మరీ లేటెస్టు కాన్ఫిగరేషను ని తీసుకోవాలంటే అనవసరంగా
ఎక్కువ డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది . ఎంత డబ్బు పెట్టినా డెస్కుటాపు అంత పెర్ఫార్మెన్సు ఉండకపోవచ్చును .

You are not allowed to view links. Register or Login to view. => Intel Processor + windows 7 Home edition + 2GB DDR3 RAM +
250 GB hard disc + 14" LED display (1366 x 768 resolution ) ధర రూ. 34.900 /-
వ్యక్తిగతంగా నాకైతే ఈ మోడలు బాగుంది . దాదాపు ఇదే కాన్ఫిగరేషనుతో HP/Compaq & Acer బ్రాండులలో
విండోసు ఆపరేటింగు సిస్టం లేకుండా సుమారు 28 వేలకే లభించవచ్చును !!! ధరలో తేడా ఉన్నట్లే పనితనంలో
తేడా ఉంటుందని అంటూ ఉంటారు . అది సరైన సమాధానమని చెప్పలేను Smile

ఇటీవల ఏసరు కి చెందిన You are not allowed to view links. Register or Login to view. బ్రాండు లాప్ టాప్ లని చూసాను . తక్కువ ధరలతో కొన్ని మోడల్సు
ఉన్నాయి . అయితే లాప్ టాప్ నిర్మాణానికి ఉపయోగించిన ప్లాస్టికు / ఫైబరు చాలా పలుచగా అనిపించింది .
అలాగే లాప్ టాప్ లోపల ఉత్పన్నం అయ్యే వేడి ఎక్కువగా అనిపించింది ...

దీన్ని చూడగలరు : You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

Thank U MN Gaaru.

meerichina reference link lo meeru chesina post lo...

vaatavaranam loni vedi gurinchi cheppaaru kadaa...

mari Delhi laanti pattanaalalo -5 nundi 50 degreela varaku temprature vuntundi kadaa.

appudu etuvanti jaagrattalu teesukovaali.


Thanks in Advance

Quote this message in a replyReply

Post: #4
సాధారణంగా లాప్ టాప్ కంప్యూటర్లు 5 - 40 డిగ్రీల ఉష్ణోగ్రతని తట్టుకునేలా ఉంటాయి . మంచు కురుస్తున్న ప్రాంతంలో &
వేడి చాలా ఎక్కువ ఉన్న చోట లాప్ టాప్ ని ఉపయోగించడం మంచిది కాదు . లాప్ టాప్ ఉపయోగించే ప్రదేశంలో మామూలు
గది ఉష్ణోగ్రత ఉంటేనే సమర్ధవంతంగా ఉపయోగించగలము . మంచు తరుచూ కురిసే ప్రాంతాల్లో గదుల్లో హీటరుని వాడే విధానం
ఉంటుంది . అలాగే వేడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎయిర్ కూలింగు పద్ధతి / ఫాన్లు ఉపయోగిస్తాము కదా Smile

మనం కొనే లాప్ టాప్ నిర్మాణానికి ఉపయోగించిన కాబినెట్ ఫ్రేము మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి . ఉత్పన్నం
అయ్యే వేడిని తొలగించడానికి ప్రాసెసరు సమీపంలో ఉండే ఫానుతో పాటు అదనంగా హార్డు డిస్కు ప్రాంతంలో మరొకటి ఉంటే
మరీ మంచిది . అవసరముంటే cooling pad (with mini fans) వంటి అదనపు ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది ...
Quote this message in a replyReply

Post: #5

Thank U Very Much MN Garu

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)