Post: #1
శ్రీ రాముని భార్య - సీతమ్మ తల్లి, చంద్రుని భార్య - తార, రావణాసురుని భార్య - మండోదరి, అత్రి మహర్షి భార్య - అనసూయ, సావిత్రి వీరిని మహా పతివ్రతలు అంటారు.
అసలు వీరు మహా పతివ్రతలు అవటానికి వీరు ఎలాంటి ధర్మాచరణముచేసేవారు???
ఎలాంటి ధర్మాచరణము చేస్తే ఒక స్త్రీ మహా పతి వ్రత అని పిలవబడుతుంది???
దయచేసి చెప్పరూ!!!!!!!!!!!!!!!!


ముందస్తు ధన్యవాదములతో....
మీ
...
Quote this message in a replyReply

Post: #2
పతివ్రతా స్త్రీలు అనబడినవారు పాటించవలసిన ధర్మాలుః

స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి.
విసుగన్నది లేకుండా అతిధులను ఆదరించాలి.
భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు.
సాధ్యమైనంత వరకు పొరుగిళ్ళకు పోకుండా, తప్పనిసరి అయినప్పుడు మాత్రమే తలవంచుకుని వెళ్ళాలి.
దుశ్శీలురైన స్త్రీలతో సాంగత్యము చేయకూడదు.
ఉత్సవాలకనీ, యాత్రలకనీ ఒంటరిగా వెళ్ళకూడదు.
భర్త ఇంట్లోలేని సమయములో స్త్రీ అలంకరించుకోకూడదు.
గ్రామాంతరము వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషముతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి, తుడిచి, విసనకర్రతో వీచి సేద తీర్చాలి.తర్వాత ఆయనకు అలసట తీరేవరకు కాళ్ళు పిసికి, తర్వాత స్నానము చేయించి, ఆయన పాద తీర్థం తీసుకుని నమస్కరించాలి.
అటు తరువాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనము పెట్టి, అతని ఉచ్ఛిష్టాన్నే ప్రసాదముగా స్వీకరించాలి.
అటు తరువాత తాను అలంకరించుకుని భర్తను సంతోషపెట్టాలి.
భర్తను నిద్రపుచ్చిన తరువాతనే తాను నిద్ర పోవాలి.
మరల అతనికంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని, అతడు మేల్కొనగానే అతనికి అవసరమైన సేవలు చేయాలి.
భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయముగా సమకూర్చాలి.
ఇంటిని శుభ్రముగా ఉంచుకోవాలి.
భర్త సంతోషముగా ఉన్నప్పుడు తాను విచారముగాను, భర్త విచారముగా ఉన్నప్పుడు తాను సంతోషముగాను ఉండకూడదు.
భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్ధించాలి.
భర్తతో తగవులాడకూడదు.
అతడు కోపంతో అన్నమాటలను మనసులో ఉంచుకోకూడదు.
భర్త ఆజ్ణననుసరించే భార్య నడుచుకోవాలి.
భర్త ఆజ్ణలేనిదే వ్రతాలు, ఉపవాసాలు చేయకూడదు.
భర్తయొక్క ఆయుష్యాభివృద్ధికి గానూ పసుపు, కుంకుమ మరియు మంగళ సూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి.
భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి.
అత్తమామలను, ఆడుబిడ్డలను, బావమరుదులను విడచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు.
భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి.
ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించగూడదు.
యాత్రికులు యాత్రలకు పోతూంటే తానుకూడా పోవాలనుకోకూడదు.
పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి.
భర్త లోభియైనా, రోగియైనా, వికలాంగుడైనా అతనిని పరమేశ్వరునిగా భావించి అతనినే పూజించాలి.
అట్టి పతివ్రతలను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు.
ఇలా చేయక యధేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితోగాని ఆమె పాపంపోదు.
పతివ్రతల పాదధూళిని ధరించి దేవతలు కూడా ధన్యత పొందుతారు.


ఇవండీ పతివ్రతా ధర్మాలు.
ఇలాంటి ధర్మాచరణ చేసిన వారిని పతివ్రతలంటారు.
అర్థమయ్యింది కదూ!!!!!!!!!!!!!!!
ధన్యవాదములు.
మీ....
Quote this message in a replyReply

Post: #3

ee rojullo anni cheyadam kudaradu kadaaa

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)