Post: #1
రుద్రాక్షలు ధరించటం వలన ఉపయోగమేమిటి?
అసలు ప్రతి మనిషి ఎన్నిరుద్రాక్షలు ధరించాలి. శరీరములో ఎక్కడెక్కడ ఏఏ భాగాలకు రుద్రాక్షలు ధరించాలి.
రుద్రాక్షమాలలు వేటితో కలిపి ధరిస్తే వాటి వలన సత్ఫలితములుంటాయి?
తెలియచెప్పరూ!!!!!!!!!!!


ధన్యవాదములతో...
మీ...
Quote this message in a replyReply

Post: #2

ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు. ఎంతో పుణ్యము లభిస్తుంది అని శృతి మరియు స్మృతి పురాణములు చెపుతున్నాయి.

వేయి రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడే.

అన్ని దొరకనప్పుడు,

బాహువులకు - పదహారు

శిఖలో - ఒకటి

చేతులకు  - ఇరవైనాలుగు

మెడలో - ముప్ఫైరెండు

శిరస్సు - నలభై రెండు,

చెవులకు - పన్నెండు

కన్నులకు - ఒక్కొక్కటి

వక్షస్థలములో - నూట ఎనిమిది ఇలా ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానము.

వాటికి పగడాలు, స్ఫటికాలు  చేర్చి బంగారముతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకము ప్రాప్తిస్తుంది.

రుద్రాక్షమాలతో జపము చేస్తే అనంత ఫలమొస్తుంది.

భస్మము, రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థము.

అది ధరించి స్నానము చేస్తే గంగ స్నాన ఫలమొస్తుంది.

ఏకాదశ మహా మంత్రముతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్నర్చినంత ఫలితముంటుంది.

రుద్రాక్షలలో ఏకముఖి జన్మ రాహిత్యమే ప్రసాదిస్తుంది.

ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాల్గు పురుషార్థాలు సిద్ధిస్తాయి.

ఇదండీ రుద్రాక్ష మహిమ,

అర్థమయ్యింది కదూ.....

ధన్యవాదములతో....

మీ...

Quote this message in a replyReply

Post: #3
మంచిది మిత్రమా
మంచి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు
ఐహిక, ఆముష్మిక, పారమార్థిక సౌభాగ్యాలు కలిగించే
విషయాలను తెలియజేశారు.
శివరాత్రి సందర్భంగా మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)