Post: #1

మిత్రులారా...

ప్రతి మనిషి చెయ్యవలసిన తప్పని సరి కార్యక్రమము  వైశ్వదేవము.

అటువంటి వైశ్వదేవము అంటే ఏమిటో తెలిచేయరూ....

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #2

గృహస్థుల ఇండ్లలో - కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడము వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవటానికి వండుకున్న పదార్థాన్ని మొదటా దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలిన ఆహారాన్ని మహాప్రసాదమన్న భావనతో భుజించాలి. దీనిని వైశ్వదేవము అంటారు.

ఇక్కడా పాపము ఎలా కలుగుతుందంటే ఆయా వస్తువులు వాడుతున్నప్పుడు అనేక రకములైన సూక్ష్మ, అతి సూక్ష్మ జీవులు మరణించటము జరుగుతుంది. కనుక ఆ పాపము పోగొట్టుకొనుటకొరకు ఇలా చేయాలి.

మరొక విషయమేమంటే మనము తినే ప్రతి పదార్థము మొదటగా దేవునికి సమర్పించటము అలవాటు చేసుకోవాలి.

మూడవ విషయమేమంటే మనము నలుగురికి అన్నదానము చేసినా చేయలేకపోయినా ప్రతిరోజు వండుకున్న ఆహారములోని అన్ని పదార్థములతో ఒక పళ్ళెములో అన్ని కలిపి ఆరు బయట వుంచుట వలన అనేకానేక జీవరాశులు(పక్షులు, చీమలు మొదలైనవి) తినే అవకాశము వుంటుంది.

అందువలన సాటి జీవుల ఆకలి తీర్చి అన్నదానము చేసిన వారిగా అయ్యే అవకాశము కూడా వుంది.

ఆహారముతో పాటు నీరు చిన్న పాత్రలో పెట్టటము మర్చిపోకండి సుమా!!!

మీరు బయట వుంచిన ఆహారమును ఏదైనా జీవి తిన్న తరువాతనే మీరు ఆహారము తినుట నేర్చుకోండి.

భోజనము సమయములో వచ్చిన ఏజీవినైనా తరిమి వేయవద్దు, చీదరించుకోవద్దు. కనీసము ఎదోఒకటి పెట్టాటానికి ప్రయత్నించండి.

ఆకలిగొన్న ఏజీవి యొక్క కడుపు నింపినా లేక ఆకలి తీర్చినా ఆ జీవి సంతోషిస్తుంది దానివలన వచ్చేజన్మంటూ వుంటే నీకు ఆహారానికి కొదవ వుండదు.

ఇది నిజము అని నా అభిప్రాయము.

తప్పక ఆచరిస్తారని నా ఆశ.

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #3

mari hostel lo vunde vaallaki, udyoga reetyaa bayata vunde vaallaki ilaa veelu avvadu kadaa...

emainaa alternatives vunte cheppagalaru.


Thanks in Advance

Quote this message in a replyReply

Post: #4

జాహ్నవి గారు,

చాలా మంచి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదములు.

మీరు తినే ఏ పదార్థమునైనా అంటే సహజముగా వసతి గృహములయందు ఉండే వారు చిరుతిండ్లు తెచ్చుకోవటము సహజము. ఒకవేళ అలాంటి చిరుతిండ్లు లేని పక్షములో ప్రత్యేకముగా పక్షులకు, జీవులకొరకు ధాన్యపు గింజలు లాంటివి(బియ్యము మొదలగునవి) కూడా వేయవచ్చు.

పెండ్లికానంతవరకు పిల్లలు వైశ్వదేవము చేయకపోయినా ఫరవాలేదు. ఎందుకనగా తల్లి తండ్రుల సంరక్షణయందు ఉంటారు కనుక వారి తల్లి తండ్రులు చేస్తే ఆ పుణ్యము పిల్లలకు వస్తుంది.

పెండ్లి అయినవారు స్వతంత్రులు కనుక వారు తప్పని సరిగా వైశ్వదేవము చేయటము రోజువారి కార్యక్రమముల మాదిరిగా చేయుట మంచిది.

మీకు ఇంకనూ ఏమైనా సందేహములున్నఎడల తప్పనిసరిగా నన్ను అడుగ గలరు.

ధన్యవాదములతో....

మీ...

Quote this message in a replyReply

Post: #5

Thank U Very Much Chandu Garu.


Mari temples lo "Annadaanam" Scheme ki Money pay chestam kadaa... aa prakriyanu vaisva devamu ani sambodinchavachaa?? Telupagalaru.


Thanks in Advance.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)