Post: #1

ఫోరం మిత్రులందరికీ  'మహాశివరాత్రి'  శుభాకాంక్షలు

Quote this message in a replyReply

Post: #2
andareki sivaratri subakankshalu
Quote this message in a replyReply

Post: #3

మిత్రులారా....!! 
భారతీయుల పండుగలలో అతి ముఖ్యమైన పండుగ ‘మహా శివరాత్రి.   ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్థశిని ‘మహా శివరాత్రి’ పర్వదినంగా జరుపుకుంటున్నాము.  మాఘ కృష్ణ చతుర్థశి నాటి నిశి రాత్రి సమయంలో మహా శివుడు కోటి సూర్యకాంతితో లింగ రూపంలో అవతరిస్తాడు.  అందుచేత ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం.  శివార్చన చేయవలసిన పుణ్య దినం.  మరియు శివపార్వతుల కల్యాణం కూడా జరిగే సమయం కూడానూ.
దీనికి పెద్దలు నుడివిన విధానం ప్రకారం :
‘‘మాఘ కృష్ణ చతుర్ధశ్యా మాది దేవో మహానిశి శివలింగ తయోధ్భూత:
కోటి సూర్య సమప్రభ: తత్కాల వ్యాపినే గ్రామ్య శివరాత్రి వ్రతే భవేత్ ’’

అనగా సంవత్సరం పొగుడునా ప్రతి మాసంలోనూ ఒక శివరాత్రి వస్తుంది.  దానిని మాస శివరాత్రిగా గుర్తించి శివార్చనలు చేస్తున్నారు.  అయితే మహాశివరాత్రి నాడు చేసే శివారాధనకు అధిక ఫలం లభిస్తుంది.  ఏ గ్రామంలో అయితే శివాలయముండదో ఆ గ్రామంలో నివసించకూడదని శాస్త్రాలు చెపుతున్నాయి.
‘యస్మిన్ గ్రామే శివోనాస్తి యత్ర నాస్తి మహేశ్వర:’’
అందువల్ల సాధారణంగా గ్రామ నిర్మాణానికి పూర్వమే శివాలయ నిర్మాణం చేస్తారు.
‘‘బ్రహ్మ హత్యా శతం వాపి శివ పూజా వినాశయేత్ ’’
నూరు బ్రహ్మ హత్యా పాతకాలను సహితం శివపూజ నశింపజేస్తుంది.  
ప్రదోష కాల మందు శివార్చన చతుర్విధ పురుషార్థ ప్రసాధనము, దారిద్య్ర నాశనము, జ్ఞానైశ్వర్య లాభంతో శివసాన్నిధ్యం లభిస్తుంది.
ప్రదోష సమయంలో పరమ శివుడు ప్రతిదినం ఆనంద తాండవం చేస్తుంటాడు.  ఆ సమయంలో ఆ నటరాజును, వాణి వీణ వాయిస్తూ, దేవేంద్రుడు వేణు నాదం చేస్తూ, బ్రహ్మదేవుడు తాళం వేస్తూ, రమాదేవి గానం చేస్తూ, మధుసూదనుడు మృదంగం వాయిస్తూ, దేవతలందరూ సమీపంలో కూర్చుని సేవిస్తుంటారు.  ఆ సమయంలో శివార్చన చేసిన సర్వ దేవతలనూ సేవించినంత పుణ్యఫలం లభిస్తుంది.
ఒక్కసారి ఈ శ్లోకాన్ని బాగుగా చదవండి అర్థం చేసుకోండి.
‘‘ వాగ్ధేవీ ధృత వల్లకీ శత మఖో వేణుం దధత్పద్మజ
స్తాళో న్నిద్ర కరోరమా భగవతీ గేయ ప్రయోగాన్వితా
విష్ణు స్తుంగ మృదంగ తాడన పటుర్ధేవా న్సమంతా త్స్తితా:
సేవంతే తమను ప్రదోష సమయే దేవం మృడానీ పతిం’’

శనివారం నాడు ప్రదోష సమయంలో శివార్చన, అదీ కృష్ణ పక్షంలో చేస్తే ఎంతో యశస్కరం, శుభకరం, పాపనాశనం.  ఫలార్థులైన వారు త్రయోదశి తిథి నాడు ప్రదోష సమయంలో శివార్చన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
ప్రదోష సమయంలో కైలాస శిఖరం పైన శివుడు ఆనంద తాండవ నృత్యం చేస్తుంటాడు.  ఆ సమయంలో సర్వ దేవతలూ శివుని సాన్నిధ్యంలో ఉంటారు.  
అందుచేత పురుషార్థ కాములగు వారు ఆ సమయంలో శివార్చన, పూజ, జపం, అభిషేకం, హోమాదులు చేస్తే దు:ఖము, క్లేశము, శోకం నశిస్తుంది.
మానవులకు శివ పూజా ఫలం వల్ల వారి సమస్త పాపాలు నశిస్తాయి.
లింగోద్భవమైన రాత్రినే శివరాత్రి అంటారు.  మహాశివరాత్రి నాడు శివుని భక్తితో పూజించేవారు సకల పాపాల నుండి విముక్తి పొంది శివ సన్నిధిని పొందుతారు.
కైలాసంలో పార్వతీ దేవి ఒక రోజున శివునితో ‘‘నాథా ! లోకంలో ప్రజలకు ముక్తిని కల్గించే వ్రతం ఏదీ ?  అని అడిగితే ‘అన్ని వ్రతములలోనూ ఉత్తమమైన వ్రతం మహాశివరాత్రి వ్రతం.  మాఘ కృష్ణ చతుర్ధశినాడు ఆ వ్రతం చేస్తే ఎటువంటి వారికైనా మోక్షం లభిస్తుంది.  శివలోకం చేరుకుంటారు’ అని శివుడు శెలవిచ్చారు.
సమస్త దు:ఖములు తొలగి, శాంతి సౌభాగ్యము చేకూరుటకు, పాప విమోచన కొరకు, అష్టైశ్వర్య సిద్ది కొరకు, శివలోక ప్రాప్తికొరకు మహాశివరాత్రి నాడు శివార్చన చేయాలి.
పరమ శివుడు మాఘ కృష్ణ చతుర్ధశి రోజున మహానిశీధి సమయంలో కోటి సూర్యుల కాంతితో శివలింగ రూపంలో ఆవిర్భవిస్తాడు.  ఆ రాత్రి శివునికి చాలా ప్రియమైన రాత్రి కనుక ‘శివప్రియ’ అని కూడా ఆ రాత్రిని అంటారు.  సర్వే సర్వత్రా శివలింగాలన్నింటి లోనూ శివ ప్రియారూపమైన ఆ రాత్రికి పరమేశ్వరుని దివ్య తేజస్సు నిండిపోతుంది.
శివునికి ప్రియమైనటువంటిదై, ఆయన్ని ఉపాసించడానికి గాను ఉద్దేశిచబడినదైన రాత్రిని శివరాత్రి అంటారు.  మాఘమాసంలోని కృష్ణ చతుర్థశి రాత్రే వ్రత పూజాదికాలు జరుపబడతాయి కనుక ఆ రాత్రే శివునికి ప్రియమైనది.
‘‘శివరాత్రి’’ శబ్ధానికి మూడు రకాలు గా అర్ధం చెప్పుకోవచ్చు. ‘శివరాత్రీ వ్రతమనీ’, ‘మాఘ కృష్ణ చతుర్ధశీ తిథి’  అనీ, ‘మాఘ కృష్ణ చతుర్ధశి రాత్రి’ అనీ మూడు అర్థాలు వస్తున్నాయి.
శివరాత్రి రోజున ఉపవాసముండి, రాత్రి నాలుగు యామముల లోనూ పార్థివ లింగానికి పూజాభిషేకాలొనర్చి ఆయా జాముల్లో చెప్పబడిన రీతిలో శాకదాన ఫలములను నివేదించి పంచాక్షరీ మంత్రాన్ని క్రమవృద్దితో జపించి పార్థివ లింగాన్ని పూజించి శాస్త్రయుక్తంగా విసర్జించి, శివభక్తులకు దాన భోజన దక్షిణాదులను సమర్పించాలి.
శివుడు అభిషేక ప్రియుడు కనుక : వివరణ :
‘దుగ్ధేన ప్రధమే స్నానం దధ్నాచైవ ద్వితీయకే
తృతీయ యేచ తధాజ్యేన చతుర్ధే మధునా తథా’
అనగా....
రాత్రి మొదటి జాములో పాలతోనూ, రెండో జాములో పెరుగుతోనూ, మూడో జాములో నెయ్యితోనూ, నాలుగో జాములో తేనెతోనూ అభిషేకం జరపాలి.
ఇక ఉపవాస విషయానికొస్తే....
‘నస్నానేన నవస్తేణ నధూపేవ నచార్చయా, తుష్యామి న తథా పుష్పై: యథాతత్రోపవాసత:’
ఉపవాసానికి, శివరాత్రి వ్రతానికి గల సంబంధం విడదీయరానిది.  ఈ రోజున ఉపవాసానికున్న ప్రాముఖ్యత చాలా గొప్పది.  అలాగే జాగరణకూ అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది.
గమనించండి మిత్రులారా....
శివరాత్రి వ్రతాన్ని జరుపకపోయినా....భక్తి పూర్వకంగా జాగరణం ఎవరు చేసినా వారు రుద్ర సములు కాగలరని స్మృతి వచనం. ‘‘ కశ్చితృణ్య విశేషేణ వ్రతహీనాంప్రియా: పుమాన్, జాగరం కురుతే తత్ర నరుద్ర సమతాం వ్రజేత్’’
చాలా సంక్లిష్టమైన విషయాలను క్లుప్తీకరించి తెలియజేయటం జరిగింది.
కనుక మాన్యులు అందరూ సహృదయంతో స్వీకరించగలరు.
సందర్భానుసారంగా.....

లింగాష్టకమ్

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకరం లింగం
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వ సుగంధ సులేపిన లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ది సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కనక మహామణి భూషిత లింగం
ఫణి పరివేష్ఠిత శోభిత లింగం
దక్ష సుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వ సముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపతిం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

లింగాష్టకమిదం పుణ్యం య: పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

ఫలితము : ఈ శ్లోకమును నిత్యము పఠించుట వలన బాధా నివృత్తి, దారిద్ర్య నాశనం, సుఖ శాంతికరం, కీర్తికరము, అభయ రక్ష, ధనప్రాప్తి, మనోవాంఛా ప్రాప్తి, శివలోక ప్రాప్తి.


*****************
చివరిగా కొసమెరుపు : కుండలో నీరు ఒక్కొక్క బొట్టు పడుతూ ఉంటే అది నిండే విధంగా, మంచితనాన్ని కొంచెం, కొంచెంగా కూడబెట్టుకుంటే అది మానవుణ్ణి మాధుర్యంతో నిండేలా చేస్తుంది........> గౌతమ బుద్ధుడు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)