Post: #1

మొదటిసారిగా ఈ ఫోరంలో ఆర్టికల్ వ్రాస్తున్నాను. ఇది ఈ ఫోరం మెంబర్స్‌కి ఉపయోగపడుతుందని భావిస్తాను.

పలు రెడిమేడ్‌ ప్రోగ్రామింగ్‌ ఫంక్షన్ల సముదాయమే .Net framework. ఫోగ్రామర్లు తాము డెవలప్‌ చేసే అన్ని softwareలలోను పొందుపరచదలచుకున్న కీలకమైన functions ఈ frameworkలో రెడిమేడ్‌గా లబిస్తుంటాయి. .Net frameworkని ఉపయెగించి కేవలం విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అయ్యే softwareలని అభివృద్ది చెయ్యడమే కాకుండా ( WinForms ద్వారా ),  .Net framework  లో భాగమైన ASP.Net సహాయంతో websiteలని, web applicationలని డెవలప్‌ చేయడానికి వీలు పడుతుంది.

.Net framework పరిమాణంలో  చాలా పెద్దది.   ఎప్పటికప్పుడు అందులో సరికొత్త functions పొదుపరుస్తూ దాని పరిధిని మైక్రోసాప్ట్‌ సంస్థ విస్తరిస్తూ పొతోంది.  C++ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో లైబ్రరీ సెట్‌లు ఎలాగుంటాయె అదే విదంగా .Net framework ని గ్రూపులుగా విభజిస్తారు. ఈ గ్రూపులనే Namespace అని వ్యవహరిస్తుంటారు.   ఒకే కోవకు చెందిన functions, classes అన్నీ ఒకే Namespace లో పొందుపరచబడి ఉంటాయి. మనం ఏదైనా ప్రోగ్రామ్‌ని డెవలప్‌ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్‌లో ఒక Namespace ని ఉపయెగిస్తున్నామంటే ఆ Namespace లో అంతర్గతంగా ఉండే అన్ని ఫంక్షన్లు,  క్లాసులను యధేచ్చగా మన సాఫ్ట్‌వేర్‌లో వాడుకోవచ్చు.

ఇకపోతే .Net Framworkలో  ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌కి పరిమితమైంది కాదు. C#, VB.Net వంటి అనేక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు .Net framework ని సపోర్టు చెయ్యడంతో పాటు అందులోని  functions ని తమ ప్రోగ్రామింగ్ కోడ్‌లో call చెయ్యగలుగుతాయి.  Non-window ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు ఈ framework ని ఉపయెగించడం ఇంకా మొదలెట్టలేదు.

ఇప్పటివరకు Microsoft Windows ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే సాఫ్ట్వేర్ల రూపకల్పన విషయంలోనే .Net framework  ఉపయెగపడుతూ వచ్చింది. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లలోకీ ఈ frameworkని port చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇకపోతే .Net framework ఆధారంగా ASP.Net, C#, VB.Netలను ఉపయోగించి ఆకర్షణీయమైన వెబ్ అప్లికేషన్లని రూపొందించవచ్చు.

ఉదా : Orkut షోషల్ కమ్యూనిటీ సైట్ ఈ విధంగా రూపొదించబడిందే.

అందుకే .Net ఆధారంగా డెవలప్ చెయ్యబడిన సాఫ్ట్వేర్లని మన సిస్టమ్‌లో వాడాలంటే ఆ framework యొక్క తాజా వెర్షన్‌ని మన కంప్యూటర్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.

Quote this message in a replyReply

Post: #2

Dear Mr Ram Gopal

Thanks for informative post

be in always with E V E R G R E E N Posts

Keep it up

Quote this message in a replyReply

Post: #3

రాంగోపాల్ గారు

మొదటి సారిగా పోస్ట్ చేసేందుకు ఒక మంచి టాపిక్ ను ఎన్నుకుని మరింత అర్ధవంతంగా వివరించినందుకు ధన్యవాదములు.

మీ నుండి మరిన్ని విలువైన పోస్ట్ లు ఈ ఫోరం లో వస్తాయని ఆశిస్తున్నాను.

Quote this message in a replyReply

Post: #4

Thanks for this forum getting new article.

One doubt i had installed .netframework in one windows mobile, how to check wheather it installed correct or not.

Quote this message in a replyReply

Post: #5
hai,this is suresh.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)