Post: #1

TeamViewer అనేది ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానం పొందిన శక్తివంతమైన ఉచిత Remote Administration సాఫ్ట్ వేర్. ఈ కోవకు చెందిన అనేక Remote Admin సాఫ్ట్ వేర్ లను ప్రయత్నించిన తర్వాత ఇది ఉత్తమమైనది గా పరిగణించబడినది.

దీని ఉపయోగం ఏమిటంటే ఉదాహరణకు మీకు కంప్యూటర్ లొ తెలుగును ఇనస్టాల్ చేయటం లో ఒక సమస్య వచ్చింది అనుకోండి. దాని పరిష్కారం కొరకు ఎంత ప్రయత్నించినా మీకు తెలియటం లేదు.అపుడు మీరు  మహిగ్రాఫిక్స్ గారిని లేదా ఆ ప్రక్రియ తెలిసిన మరొక మెంబర్ని కాని మీ సమస్య పరిష్కరించమని అడిగితే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీ కంప్యూటర్ లో ప్రవేశించి చిటికెలో ఆ సమస్యను పరిష్కరించగలరు.

మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే మీరు అడోబ్ ఫొటోషాప్ లేదా ఏదైనా ప్రోగ్రాం లొ బాగా అనుభవం ఉన్నవారనుకోండి. ఫోరంలొ లేదా చాట్ లొ ఎవరైనా ఒక సభ్యుడు ఆ ప్రోగ్రాం లొ తనకు సమస్య ఉందని తెలియచేసినపుడు మీరు ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఆ సభ్యుని సిస్టం లొ కి ఎంటర్ అయి వారి సమస్యను పరిష్కరించవచ్చు లేదా  వారికి తగిన శిక్షణ ఇవ్వచ్చు కూడా.

ఇదేవిధంగా మీ సిస్టం లొ ఏర్పడిన సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సాంకేతిక లోపాలు సరిచేయటానికి టెక్ సపోర్ట్ టీం వారు ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీకు సహాయపడతారు. ను క్రింది బొమ్మ పై క్లిక్ చేసి వచ్చిన ఆ  వెబ్ పేజి నుండి ఈ ఉచిత సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

పై వెబ్ పేజి లో క్రింది బొమ్మలో చూపిన విధంగా ఉన్నచోట Start * - It's Free! అనేదానిని క్లిక్ చేయండి. అపుడు cnet వారి download.com పేజిలొ మీకు డౌన్ లోడ్ బటన్ వస్తుంది.

ఇక క్రింది బొమ్మలు, వాటిలో వ్రాసిన గైడెన్స్ ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయండి.

డౌన్ లొడ్ పూర్తయిన తర్వాత డబుల్ క్లిక్ చేసి ఇనస్టాలేషన్ ప్రక్రియను ప్రారంభించండి.

KNOWLEDGE SHARING IS THE MOTTO OF OUR FORUM. DONT HESITATE TO SHARE, PROMOTE IT.

Quote this message in a replyReply

Post: #2

Sir,

I also getting help from mahi

Quote this message in a replyReply

Post: #3
ఈ విషయం గురించి ఇంత వివరంగా తెలియజేసిన ప్రసాద్ గారికి నా ధన్యావాదాలు.
Quote this message in a replyReply

Post: #4
wonderful post
Quote this message in a replyReply

Post: #5

ఈ విషయం గురించి ఇంత వివరంగా తెలియజేసిన ప్రసాద్ గారికి నా ధన్యావాదాలు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)