Post: #1

చాలాచోట్ల చాలామంది గొప్పవారిని అనేక గురు అవతారములను అవధూతలుగా అనుట పరిపాటి.

మరి అసలు అవధూత అని వారిని ఎందుకు పిలుస్తున్నారు. అసలు అవధూత అని అంటే ఏమిటి?

ఎవరిని అవధూత అని పిలవవచ్చు?

సవివరముగా తెలియజేస్తారని ఆశిస్తూ....

ధన్యవాదములతో....

మీ...

Quote this message in a replyReply

Post: #2

(22-Feb-2010 08:08 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

చాలాచోట్ల చాలామంది గొప్పవారిని అనేక గురు అవతారములను అవధూతలుగా అనుట పరిపాటి.

మరి అసలు అవధూత అని వారిని ఎందుకు పిలుస్తున్నారు. అసలు అవధూత అని అంటే ఏమిటి?

ఎవరిని అవధూత అని పిలవవచ్చు?

సవివరముగా తెలియజేస్తారని ఆశిస్తూ....

ధన్యవాదములతో....

మీ...

అవధూత అనగా

                 The ultimate title of Avadhoota is an achievement of many life-times of spiritual progress.

                  Only a few rare souls merit such an exalted title. In any one epoch, only a handful of Avadhootas grace this Earth. So what is an Avadhoota? Let us consider this question by looking at the meaning of the name itself and seeing what are the essential characteristics of an Avadhoota.

"A" - He who has achieved complete liberation from the bonds of desires. He who is absolutely pure and is ever absorbed in total, inner, bliss.

"VA" - He who has eliminated all His desires and is infallible to the three kinds of problems, namely, (a) diseases of the body, (b) illness caused by poisons of such creatures as scorpion, snakes etc, © adverse effects of natural disasters, such as floods, earthquakes etc. An Avadhoota always lives in the present, forever happy in what this moment has to give.

"DHOO" - Through an Avadhoota's body may be smeared with dust or ashes, His mind is cleansed of all impurities. Having reached His goal, such an Avadhoota is beyond mere disciplines of concentration (Dharana) and meditation (Dhyana).

"TA" - He is ever eternally engrossed in the contemplation of the Absolute Truth. To this end, He has abandoned all worldly activities and even its thoughts. Such a
soul has erased His ego, merging completely with the universal spirit.
Main characteristic of an Avdhoota are:

    * He who is a sinless philosopher and has cast off the shackles of ignorance (ajnana).
    * He who lives in the stateless state and enjoys its experience all the time. He revels in this blissful state, unperturbed by the material world.
    * In this unique state, the Avadhoota is neither waking nor in deep sleep, there is neither any sign of life nor any death, It is a state defying all description.
    * It is the state of infinite bliss, which the finite language is incapable of describing. It can only be intuited purely by our intellect.
    * A state which is neither truth or non-truth, neither existence nor non-existence.
    * He who has realized his identity with the imperishable, who possesses incomparable excellence; who has shaken off the bonds of Samsara and never swerves from His goal. That thou Art (TATVAMASI), and other Upanishadic declarations, are ever present in the mind of such an enlightened soul.
    * That sage who is rooted in the plenary experience of "Verily, I am Brahman (Aham Brahmaasmi)", "All this is Brahman (Sarvam Chilvidam Brahman)", and that "...there is no plurality, Me and God are one and the same..."etc. Supported by personal experience of such Vedic statements, He moves freely in a state of total bliss. Such a person is a renunciate, liberated, Avadhoota, Yogi, Praramhamsa, Brahmana.

Quote this message in a replyReply

Post: #3

నికి గారు,

మీరు సమర్ధవంతమైన సరియైన సమాధానమును అందించినందుకు ధన్యవాదములు.

కానీ అవధూత అనుదానికి తెలుగులో సరియైన సమాధానమును అందించిన ఎడల మరింత మన ప్రయత్నములు మరింత అర్ధవంతముగా ఉండునని నా అభిలాష.

నేనుకూడా తెలుగులో అవధూత అనుపదమునకు పూర్తి అర్థము ఇచ్చుటకు ప్రయత్నిస్తాను.

అవధూతగీత ప్రకారముః

"అక్షరాత్, వరేణ్యాత్, ధూతసంసారబంధనాత్, తత్వమస్యాధిలక్ష్యత్వాత్, అవధూత ఇతీర్యతే".

అవధూతగీత అవధూత పదంలోని

పదానికి ఆశాపాశమునుండి విముక్తి పొందినవాడు, ఆదిమధ్యాంతములందు నిర్మలుడు, ఆనందాన్ని నిరంతరము పొందుతుండేవాడు అని

పదానికి వాసనలనుండి (పూర్వకర్మలనుండి) విడివడినవాడు, నిరామయమైన, పరబ్రహ్మగా పేర్కొనదగినవాడు, వర్తమానములోనే (భూతభవిష్యత్తుల గురించిన ఆలోచనలేక) ఉండేవాడు అని

ధూ పదానికి ధూళితో కూడిన శరీరము కలిగినవాడు, మనస్సును స్వాధీనము చేసుకొన్నవాడు, దోషరహితుడు, ధ్యాన ధారణలు లేనివాడు అని

పదానికి తత్వ చింతన కలిగినవాడు, తమోగుణమును, అహంకారమును విడచినవాడు అని

అర్ధము.

ఇక అవధూతోపనిషత్తు ప్రకారము

- అనగా అక్షరుడు, నాశములేనివాడు,

- అనగా వరేణ్యుడు (బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు),

ధూ - అనగా ధూత (విదిలించుకొన్న) సంసార బంధనములు కలవాడు,

- అనగా తత్వమస్యాది వాక్యములకు లక్ష్యమైనవాడు

ఇలాంటివారిని అవధూత అని పిలవబడుతున్నారని అవధూతగీత మరియు అవధూతోపనిషత్తు చెప్తున్నాయి.

అయితే అవధూతోపనిషత్తు మరియు అవధూత గీత రెండూ శ్రీ గురు దత్తాత్రేయులు చెప్పినవే.

అదండీ అవధూత అంటే అర్థమయ్యింది కదూ...

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)