Post: #1

సర్,

మనం శ్రీ వెంకటేశ్వరస్వామి కి లడ్డు అంటే ఇస్టమని,ఆంజనేయస్వామి కి అప్పాలు ఇష్టమని ఇలా ఒక్కొక్క దేవునునికి ఒక్కొక్క ప్రసాదం పెడుతుంటాము కదా !
ఈ విధానం మనం ఏర్పాటు చేసుకొన్నామా ?లేక  వారు నిజంగా కోరార ? దయచేసి వివరణ ఇవ్వగలరు.

ధన్యవాదములతో

రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post: #2

రాఘవేంద్రరావు గారు,

చాలా మంచి ప్రశ్న వేసినందుకు ధన్యవాదములు.

మన పూర్వీకులు ఇలాంటి ఆచారములను ఏర్పాటు చేయటములో ఎంతో ఆలోచన, సరియైన వుద్ద్యేశ్యము వున్నదని నా అభిప్రాయము.

ఇక విషయమునకు వస్తే...

ఇక్కడ ఆయా వారములలో ఆయా దేవతలకు ఇష్టమైన పదార్థములు అని నైవేద్యము పెట్టటము అనేది అనాదిగా జరుగుతున్న విషయము సమంజసమే....

అయితే ఇలా చేయటం వలన ఆయా దేవతలు వారికి ఇష్టమైనది వండుట వలన వారు వచ్చి తినుట అనేది జరగటము లేదు కదా....

అందుకే..

నైవేద్యము పెట్టటము అనేది ఎందుకంటే మనము తినే ప్రతి పదార్థము పరమాత్మ స్వరూపము కనుక అది పరమాత్మకే చెందినది కనుక ఆ పరమాత్మునికి నివేదించి మనము తినుట వలన ఏ పదార్ధము తిన్నప్పటికీ వాటి వలన వచ్చే గుణ దోషాలు శరీరానికి అంటవు అనే భావన మరియు అంతే కాక ఈ చరాచర సృష్టిలో ప్రతి వస్తువు ప్రతి పదార్థము పరమాత్ముని సొంతము. కనుక ముందుగా ఆయనకు అర్పించి మాత్రమే మనము దానిని భుజించాలి.

ఇంకొక విషయమేమంటే పరమాత్మకు నైవేద్యము పెట్టడము అనేది ఎందుకంటే మనకు (నాలాంటి అజ్ణులకు) పరమాత్మను మానసికముగా దర్శించలేము కనుక మనము ప్రతిమలను ఏర్పాటు చేసుకున్నాము. అందుకని ఆ ప్రతిమరూపములోని పరమాత్మునికి నివేదించి మానసికముగా మనలోని పరమాత్మునికి నివేదించిన రీతిన మనమే భుజిస్తున్నాము.

అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు పెద్దలు.

రెండవ విషయమునకు వస్తే ఆయా పదార్ధాలే ఆయావారములలో ఎందుకు నివేదించాలి. అంటే

మన పూర్వీకులు ఆయా వారములలో ఆయా గ్రహముల ప్రభావము మనపై అధికముగా వుంటుంది అని నమ్మేవారు. అందుకని ఆయా గ్రహప్రభావముల వలన ఆయా వారములలో మనశరీరములోని అనేక భాగముల పై పడే దోషములను నివారించుకొనుటకు ఇటువంటి పదార్ధములను ఆయా వారములలో భుజించుట వలన తొలగించుకొనవచ్చని లేదా దోషములు పడకుండా నివారించుకొనవచ్చునని ఇలాంటి ఏర్పాటు జరిగి వుండవచ్చు.

మామూలుగా తినుటకంటే ఆయా వారములలో ఆయా దేవతల పేర్లు చెప్పి వారికి నివేదించుటవలన అది పరమాత్మకు నివేదించిన వారము అవవచ్చు అంతే కాక మన శరీర దోషాలను నివారించుకొన్న వారము కూడా అవవచ్చు.

ఇది పెద్దల వుద్దేశ్యము అయివుండవచ్చు అని నా అభిప్రాయము.

వేరే కారణములు ఏవైనా వున్నచో తెలిసిన పెద్దలు దయచేసి నా తప్పును మన్నించి సరియైన సమాధానమును ఇవ్వగలరని ఆశిస్తూ...

ధన్యవాదములతో....

మీ...

Quote this message in a replyReply

Post: #3
చందు గారు,

తెలియని విషయాలు తెలుసుకోవాలి  తెలిసింది నలుగురికి చెప్పాలి .ఇది నా అభిమతం మీ లాంటి విజ్ఞుల  (వయసుతో పనిలేదు) వలన ఇలాంటి విషయాలు తెలుస్తుంటాయి .
మీరే చెప్పగలరని ఆసిస్తూ మరొక ప్రశ్న. <b style="color: rgb(255, 0, 0);"> దేవునికి తల నీలాలు ఇవ్వడం అనేది చేయవచ్చా ?
ధన్యవాదములతో
రాఘవేంద్ర రావు
Quote this message in a replyReply

Post: #4

రాఘవేంద్ర రావు గారు,

మీకు నా పై వున్న సదభిప్రాయమునకు ధన్యుడను. మీరు అన్న విషయము అక్షర సత్యము, తెలియని విషయములను తెలుసుకొనటము, తెలిసిన జ్ణానమును నలుగురికి పంచటము వలన జ్ణానము పెరుగుతుందేకానీ తగ్గదు. కనుక మీ అభిప్రాయముతో ఏకీభవిస్తూ.. నేను ఈ ప్రయత్నములు చేస్తున్నాను. ఎక్కడైనా నేను చెప్పేవిషయములలో తప్పులు వున్నచో నా ఎడల దయతో మన్నించి సహృదయులు ఎవరైనా సరిదిద్దగలరని నా విన్నపము.

ఇక మీరు అడిగిన తరువాత ప్రశ్న (దేవునికి తలనీలాలను ఎందుకు సమర్పించాలి?).

మీకు అభ్యంతరము లేని ఎడల నేను దీనిని ప్రత్యేక టపాగా వ్రాయదలిచాను. ఇదే పోస్టులో కంటే వేరే పోస్టులో అయితే మీరు అడిగిన విషయము అందరికీ అందుతుందని నా అభిప్రాయము.

ధన్యవాదములతో...

మీ....

Quote this message in a replyReply

Post: #5

(మీకు అభ్యంతరము లేని ఎడల నేను దీనిని ప్రత్యేక టపాగా వ్రాయదలిచాను. ఇదే పోస్టులో కంటే వేరే పోస్టులో అయితే మీరు అడిగిన విషయము అందరికీ అందుతుందని నా అభిప్రాయము.)

సర్,

మీరు చెప్పిన అభిప్రాయముతో నేను ఏకిభవిస్తున్నాను

ధన్యవాదములతో

రాఘవేంద్ర రావు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)