Post: #1
మిత్రులారా...!!
పూర్వము శ్రీశైలం లో హేమగుప్తుడనే వైశ్యుడుండేవాడు. అతను వ్యాపారం చేయుచుండేవాడు. ఒకసారి వ్యాపారమునకు దూరదేశమునకు పోయి వచ్చుచుండగా దారిలో కొంతమంది మనుష్యులు ఒక పిల్లవాడిని చంపబోతూంటే చూసి...ఎందుకు చంపుతున్నారు. కారణమేమిటి..???? అని అడిగితే...
ఆ మనుష్యులు వ్యాపారితో....ఇతని తండ్రి మాకు వేయి వరహాలు బాకీ. అతను చనిపోయాడు. ఆ బాకీ ఇతను చెల్లించవలసియున్ననూ చెల్లించుట లేదు. అందుకని ఇతనిని చంపుతున్నాము’’ అనగా.... ఆ వ్యాపారి ‘‘ఆ సొమ్ము నేనిస్తాను. ఇతనిని వదిలిపెట్టండి’’ అంటూ వారికి డబ్బిచ్చేసిన తరువాత.... ఆ కుర్రవాడికెవరూ లేరంటే....తన వెంట తీసుకొచ్చి ఆశ్రయం కలిగించాడు. అతని పేరు సుబుద్ధి గా నామకరణం చేసి పెంచుకుంటున్నాడు. కొన్నాళ్ళు తరువాత...ఆ వైశ్యుడికి కొడుకు పుట్టాడు. అతనికి సమబుద్ధి.
ఇక్కడొక చిన్న చిక్కు వచ్చిపడింది. కొన్నేళ్ళ క్రితం... శ్రీశైలం, పరిసర గ్రామాల మీద ఒక రాక్షసుడు పడి చిక్కిన వారందరినీ తినేస్తూంటే....ఆ వూరి గ్రామస్తులు అక్కడ పంచాయతీ జరిపి....రోజూ ఒక గ్రామం నుంచి ఒక మనిషిని పంపేందుకూ, రాక్షసుడు మిలిగిన వారి జోలికి రాకుండానూ ఒక ఒడంబడిక చేసుకున్నారు.
ఒకసారి రాక్షసుడికి ఆహారంగా మనిషిని పంపవలసిన వంతు హేమగుప్తునికి వచ్చింది. చేయగలిగేదేమీ లేక అతను తన కొడుకు సమబుద్ధిని వెళ్ళమన్నాడు రాక్షసునికాహారంగా. అయితే హేమగుప్తునికి తెలియకుండా...సమబుద్ధితో పాటు సుబుద్ధి కూడా వెళ్ళాడు.
అపుడు....ఆ రాక్షసుడు...’’ఏయ్...ఇద్దరెందుకు వచ్చారు..???? అని అడిగాడు రాక్షసుడు.
‘‘అయ్యా...! మేము వరుసకు సోదరులం. నేను తన తండ్రికి జన్మించకపోయినా...వీరు నాకొకప్పుడు ప్రాణదానం చేశారు. అంతేకాదు. నన్ను చేరదీసి కుటుంబ సభ్యుని చేసుకొని ఇన్నాళ్ళూ నన్ను చక్కగా పెంచుతూ పోషిస్తున్నారు. వారి ఋణం తీర్చుకునేందుకు నాకిది చక్కని అవకాశం. వారి కుటుంబాన్ని నిలపడానికి నా ప్రాణాన్నివ్వడం నాకు ధర్మమూ, విధి కూడా. కనుక తమరు సమబుద్ధిని విడిచిపెట్టి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’’ అని వినయంగా ప్రార్థించాడు.
అంతలో...సమబుద్ధి ముందుకొచ్చి.... - ‘‘అయ్యా..! ఏ సుముహూర్తాన సుబుద్ధి మా యింటికి వచ్చెనో మరి, మా తండ్రిగారికన్నియూ శుభములే జరిగినవి. పుత్రోదయం కూడా అయినది. మా తండ్రిగారికి ఇతడనిన అమితమయిన ప్రేమ. ఇతడు అన్నగా నేను తమ్ముడిగా ఎంతో అభిమానంతో పెరిగాము. అది అలా ఉంచండి. నా బదులు వీనిని మిమ్మల్ని తిననిచ్చినచో.... మా తండ్రిగారు రక్షించినవానిని - నేను భక్షించినట్లే అగును. అలా జరిగితే నేను మా తండ్రికింత ద్రోహం చేసినట్లే అవుతుంది. అందుచేత తమరటువంటి ప్రమాదమూ పొరపాటూ జరగనివ్వక - నన్నే భక్షించి సుబుద్ధిని వదలివేయుడు’’ అని కన్నీటితో వేడుకున్నాడు.
వారి మాటలకు రాక్షసుడి మనసు కరిగిపోయింది. వాళ్ళ మీద జాలితో పాటు అతని బుద్ధి కూడా వికసించింది. తన తప్పు తెలిసి వచ్చింది. మనసు మారిపోయింది. ‘‘మీలో ఒకరినే కాదు. ఇకపై నేనెవరినీ తినను’’ అన్నాడు. వాళ్ళనింటికి వెళ్ళిపొమ్మన్నారు. అందరూ సుఖంగా జీవించసాగారు. శుభం.
అయితే....ఇక్కడ మా కొక ధర్మ సందేహం...????
వీరిలో గొప్పవారు ఎవరు...??
సమ బుద్ధి యా...
సుబుద్ధియా...
తేలక బుఱ్ఱ బ్రద్దలు కొట్టుకుంటున్నాము. మరి హేమిటో....ధర్మ సందేహం తీర్చండి.
Quote this message in a replyReply

Post: #2
మంచి ప్రశ్న వేశారు సార్. ఇది మనస్తత్వ శాస్త్రంలోని ప్రశ్న కదా? మా మనస్తత్వాల మీద పరిశోధన చేస్తున్నారా??????

నా సమాధానం:
నా దృష్టిలో రాక్షసుడు గొప్పవాడు. ఎందుకంటే సుబుద్ది, సమబుద్దిల ప్రేమ,ఆప్యాయతలను చూసి జన్మతహ వచ్చిన అలవాటుని చెడ్డదని గ్రహించి వారిని వదిలేశాడు రాక్షసుడు. చిన్నప్పటి నుండి మంచి నీడలో పెరిగి మంచిగా వుండటం సాధారణ విషయం.

నిత్యం పూజలు చేసే పూజారి సారాయి తాగకపోవడంలో వింత లేదు.
కాని ఆ సారాయి కొట్లో పనిచేసే అబ్బాయి సారాయి తాగకపోవడమే గొప్పతనం.

ఇది అంతా నా అభిప్రాయం. ఎవరినీ భాధించదని ఆశిస్తూ.....
భాదిస్తే క్షమించండి.
Quote this message in a replyReply

Post: #3
నిస్సందేహం గా సమబుద్ది.
Quote this message in a replyReply

Post: #4
సుమణీవెంకట్ గారు,


నా దృష్టిలో సమబుద్ది,సుబుద్ధిలకన్నా హేమగుప్తుడు గొప్పవాడు.చంపబోతున్న పిల్లవాడిని కాపాడి పెంచుకోవడం,కొడుకు పుట్టినా ఇద్దరినీ సమానంగా చూడటం,రాక్షసుడికి ఆహారంగా సొంత కొడుకును త్యాగం చేయడం వలన నిస్సందేహం గా హేమగుప్తుడే గొప్పవాడు.
పెంచి పోషించినందుకు రుణం తీర్చుకోవాలనుకోవడం సుబుద్ది మానవ నైజం.
తండ్రి మాటను గౌరవించడం సమబుద్ది భాధ్యత.
ధన్యవాదములు...
Quote this message in a replyReply

Post: #5
సుమణి వెంకట్ గారు,

వైశ్యులెప్పుడు దయార్ద్ర హృదయాన్ని కలిగివుంటారు.ఏలాంటి గొడవలకు వెళ్ళరు. పిరికివారిగాను జనాలకు ప్రితీతి.
దయా ధర్మాలకు, పుజా పునస్కారలు అంటె వారికి చాల ఇష్టం. దేవుడంటె భక్తి మెండు. ఇక వ్యాపారమంటారా,
తన్ను మాలిన ధర్మం ఇంకోటి లేదు కదండి!. Work Is Worship. ఇక హేమ గుప్తుడు అలా
సహాయం చెయ్యటంలో పెద్దగా అతిశయోక్తిలేదు.

ఇక మీ ప్రశ్నకు సమాదానం హేమ గుప్తుడు, సమబుద్ది, సుబుద్ది ముగ్గురు గొప్పవారె. ఇక ఈ ముగ్గురి
మంచి తనం వల్ల చివరకు రాక్షసుడు కూడ గొప్పవాడుగా మారాడు మరి.
తులసి వనంలో గంజాయి మొక్కకు కూడ సువాసనే వుంటుంది అంటె ఇదే మరి.

M. Srinivas Gupta
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)