Post: #1
పూర్వం ఒక గ్రామంలో....ఒక రైతుండేవాడు. అతడు మిక్కిలి సహాయ స్వభావము కలవాడు. మంచివాడు. ఎవరికి ఏ ఆపద వచ్చిననూ ఆదుకొనేవాడు. అతనికొక్కడే కుమారుడు..
రైతు ఒకనాడు పొలములో సేద్యము చేయుచు పనులు వత్తిడి వలన మధ్యాహ్నం భోజనానికి రాలేదు. పొలమునకే భోజనము పంపమని తనవారికి కబురు చేసేను.
మధ్యాహ్నా సమయానికి అత్తాకోడండ్రిద్దరూ ఆహారమును తీసుకొని పొలమునకు పోయారు. తండ్రి కొడుకులు పనియందు నిమగ్నులై వారి రాకను గమనించి కాళ్ళు కడిగికొని వచ్చి కూర్చొన్నారు.
అత్తాకోడండ్రిద్దరూ ఎవరి తండ్రికి వారు ఆహారము పెట్టి వెళ్ళిపోయారు.
మిత్రులారా...సందేహం..ఏమిటంటే..
ఇక్కడ తండ్రి కొడుకులు....వీరిద్దరూ...అత్తాకోడండ్రు. వీరి బంధుత్వము ఇది. మరి వారు అన్న మాట ఏమిటి....???? ‘‘ఎవరి తండ్రికి వారు ఆహారము పెట్టాం’’ అని ఎందుకన్నారు....???? ఇదెలా సాథ్యం...????

సవాల్ స్వీకరించండి. బుద్ధికి పదును పెట్టండి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)