Post: #1

దేవునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి???

మిత్రులు రాఘవేంద్రరావు గారు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ పోస్టునుకూర్చటమైనది.
తల మీది జుట్టు మనిషిలోని అహంకారమునకు ప్రతీక. తలమీద జుట్టు వున్న ప్రతి మానవుడు తన అందమునకుప్రాధాన్యతనిస్తూ, పరమాత్మపై దృష్టి నిలుపక, ఆ అందము ద్వారా మోహము చెంది, వేరొకరికి ఆకర్షితుడై
సమాజమును నాశనము చేస్తూ, తనను తను భ్రష్టు పట్టించుకుంటారు. అధోగతి పాలవుతూ జీవితమును అంధకారమయము చేసుకుంటూ బ్రతుకును వెళ్ళదీస్తుంటారు.
అందుకే పరమాత్మ వద్దకు వెళ్ళినప్పుడు ప్రతిమనుజుడు తలనీలాలను (తన అహంకారమును) స్వామి పాదాల వద్ద వదలివేయమని చెప్పుటకు సూచనయే ఈ తలనీలాల పద్ధతి.
అంతేకాక మానవులంతా పరమాత్మ బిడ్డలమే. కనుక మనకున్న అందచందాలు తల్లితండ్రులయిన పరమాత్మనుంచి వచ్చినవియే కనుక మన శరీరము ఆయనకు చెందినదే. అందుకే పరమాత్మకు సమర్పించుకొని అహమును విడిచిపెట్టాలి.
అప్పుడే పరమాత్మ తత్వము మనకు అంది మనము పరమాత్మకు చేరువ అవుతాము.
అంతేకానీ అహంకార భూయిష్టమైన తలనీలాలను సమర్పించకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఫలితము శూన్యము.
రాఘవేంద్రరావుగారు అడిగిన ప్రశ్నకు సరియైన సమాధానము ఇచ్చానని ఆశిస్తూ...
తలనీలాలను ఇచ్చుటలో వేరే ఇతర అంతరార్థము ఉన్నఎడల తప్పనిసరిగా తెలియపరచగలరు.

ధన్యవాదములతో...
మీ...
Quote this message in a replyReply

Post: #2

చందు గారు ,

నేను అడిగిన ప్రశ్నకు చక్కని సమాధానం చెప్పారు చాలా సంతోషంగా వుంది. Reply లేటు అయింది క్షమించండి .

ధన్యవాదములతో

రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)