Post: #1

నమస్కారం,
నా మిత్రుడు ఒకరు 19" LCD Monitor ను తీసుకోవాలనుకుంటున్నారు.  అతడు తీసుకునే చోట Philips, Dell company Monitors ఉన్నాయట. ఈ రెండిటిలో ఏ Monitor తీసుకోవడం మంచిదంటారు? నేనేమో Dell తీసుకోమంటున్నాను. మరి మీరేమంటారు.  త్వరగా సమాధానమివ్వగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ముందస్తు ధన్యవాదములతో........................

Quote this message in a replyReply

Post: #2
కంపెనీ పేరు ప్రఖ్యాతులను బట్టి మాత్రమే కాకుండా - మోడళ్ల స్పెసిఫికేనులు , రివ్యూలని బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ...
Quote this message in a replyReply

Post: #3
mn గారు,
మీ సత్వర స్పందనకు ధన్యవాదములు. కంపెనీని బట్టి product యొక్క performance ఆధారపడి ఉంటుందనే వుధ్దేశ్యంతో నేను ఆలోచించాను. మీరు చెప్పినది కూడా సబబుగానే ఉంది. specifications ప్రక్కన పెడితే మీరు ఏ కంపెనీని ప్రిఫర్ చేస్తారు. రెండిటిలో ఏదైనా పర్వాలేదా! తెలియజేయగలరు.
Quote this message in a replyReply

Post: #4
మిత్రమా
మీరు Dell కంపెనీ కి సంబంధించిన 19" LCD Monitor తీసుకోమని సజెస్ట్ చేస్తున్నామన్నారు కానీ మేము ఇలా భావిస్తున్నాము. మీరు ఇతర స్పెసిఫికేషన్లను కంపేర్ చేసి చెప్పారని భావిస్తున్నాము. అయితే మీకు కూడా ఇంకా సందేహం ఉండబట్టి లేదా నిపుణుల సూచనల కోసం ఎదురు చూస్తున్నారని భావించడం జరుగుతుంది.
యమ్మెన్ 48 మహాశయులు చెప్పినట్లు కంపెనీ పేరును బట్టి కాకుండా పని తీరును బట్టి నిర్ణయించుకోమని సూచన.
నేనూ గతంలో ఇలాంటి సందిగ్థావస్థలో ఉన్న సమయంలో యమ్మెన్ 48 గారు, శ్రీయుతులు ప్రసాదు గారు సూచనల మేరకు నాలుగైదు కంపెనీల యొక్క స్పెషిఫికేసన్లను మరియు పనితీరును, మరియు వాటి పై ఆల్ రెడీ వాడుతున్న వినియోగదారుల యొక్క అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని నిర్ణయించుకోవడం జరిగింది. అంతా ఒకె.
వ్యక్తిగతంగా వస్తే viewsonic Monitor బెటర్ అని మెజార్టీ పీపుల్స్ అభిప్రాయం. కాబట్టి ఒకసారి పరిశీలించగలరు. ధన్యవాదాలు.

కొసమెరుపు : ఇది ఈరోజు ఉన్న నాటి పరిస్థితికి అనుగుణంగా చెప్పటం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ ఉపకరణాల విషయానికొస్తే....టెక్నాలజీ మయం అయిపోయిన ఈ సమయంలో ఒక మోడల్ స్టాండర్ట్ అయి నిలిచేసరికి మార్కెట్ లో చాలా వరకు కొత్త కొత్త, మంచి మంచి కాన్ఫిగరేషన్ లతో వచ్చేస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే మనకు సందేహం...ఒక వినియోగదారుడుగా....!
ఏది ఏమైనా ఒక వనరు ను పరిగణనలోకి తీసుకోకుండా అన్ని రకాల వనరులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవడం ఉత్తమం. మీ వరకు సజెస్ట్ చేసిన Dell Monitor కూడా ఒకె. బట్ viewsonic ఇంతకంటే మంచి పనితీరును ప్రదర్శిస్తుందని తెలియజేయడం జరుగుతున్నది.
Quote this message in a replyReply

Post: #5
వెంకట్ గారు,
నా మిత్రుడు నన్ను సంప్రదించడం వలన ఏదో ఒకటి తీసుకో అని చెప్పేయలేక మీ అందరి నిపుణుల సూచన ను అనుసరించి తనకి ఒక better monitor suggest చేద్దామనుకున్నాను. ఇక నాకు Monitors యొక్క models గురించి అవగాహన లేదు. అనేక రకాల technical features( contrast ratio మరియు video(HDMI, S-Video, Component) ఆధారంగా వివిధ models ఉండి ఉంటాయి. నేను మొదట నా మిత్రునికి suggest చేసింది Viewsonic Monitor నే కాకపోతే Viewsonic monitor అందుబాటులో లేకపోవడం వలన philips, Dell లలో ఏది తీసుకోవాలి అనేటటువంటి సాధారణమైన సందేహంలో భాగంగా నేను మీ అభిప్రాయాన్ని కోరాను. నా పోస్టుకు స్పందించి సరైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు.....................
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)