Post: #1

డియర్ ప్రెండ్స్

గత నెల రోజులుగా మేము నెట్ కనెక్షన్ నుండి సినిమాలు డౌన్ లోడ్ చేసుకునే సందర్భంలో ఈ విధమైన ప్రాబ్లమ్ వస్తోంది.  అలా ఎందుకు వస్తోందో...పరిష్కార మార్గమేమిటో తెలియజేయగలరు.  ముందస్తు ధన్యవాదాలు.  ఇదివరలో చాలా బాగా డౌన్ లోడ్ అయ్యేది.  సెట్టింగ్ ల జోలికి గానీ, ఇతరత్రా వేరే ఏమియునూ మార్చలేదు.  నిజం చెప్పాలంటే ఏమీ కదల్చలేదు.  మరెందుకు ఇలా ....????

తగిన పరిష్కార మార్గం తెలిపి ధన్యులం చేయగలరని ఆశిస్తూ....విన్నవించుకుంటున్నాము.

Quote this message in a replyReply

Post: #2

సుమణి వెంకట్ గారు

మీరు  Real Player లో Streaming Media ను రికార్డ్ చేయడమంటే దానిని మీ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకుంటున్నట్లే. మీ సమస్యకు ముఖ్యమైన కారణం తగినన్ని వనరులు లేకపోవటం గా Error Message  ద్వారా తెలుస్తుంది. నాకు అర్ధమైనంతవరకు ఆ Streaming Media మొక్క Buffering  ఆ సమయంలో తగిన వేగంతో జరుగకపోవడం. దీనికి కారణం మీరు అదే సమయంలో  మీ ఇంటర్నెట్ బాండ్ విడ్త్ మొత్తం వేరే విధంగా (ఉదాహరణకు మీ ISO ద్వారా మీకు కేటాయించబడిన Dedicated Bandwidth లో ఎక్కువ మొత్తం బాండ్ విడ్త్ వేరే డౌన్ లోడ్ కు ఉపయోగించడం, లేదా మీ ISO నుండి వచ్చే బాండ్ విడ్త్ లో Frequent/continuous Packet loss వంటి తాత్కాలిక సమస్య ఉండి ఉండటం) వినియోగంలో ఉంచడం వలన మీ రికార్డింగ్ ద్వారా జరిగే డౌన్ లోడ్ ప్రక్రియకు బాండ్ విడ్త్ మీకు Error వచ్చిన సమయంలో తగినంతగా  అందుబాటులొ లేకపోవటం అని నాకు అన్పిస్తుంది.

అదే విధంగా మరో కారణం ఆ Media ను Stream చేస్తున్న సైట్ నిర్వాహకులు ద్వారా ఆ  Streaming Media కు సంబంధించి Recording Restrictions ఏమైనా set చేయబడి ఉన్నా అలా జరిగే అవకాశం ఉంది.

‘‘ఇదివరలో చాలా బాగా డౌన్ లోడ్ అయ్యేది’’ అని తెలియచేశారు. ఇదివరలో అదే సమయంలో అదే మొతాదులో ఇతర డౌన్ లోడ్ ప్రక్రియలకు మీ బాండ్ విడ్త్ వినియోగంలో ఉండి ఉండకపోవచ్చు లేదా మీ ISO నుండి వచ్చే బాండ్ విడ్త్ లో ఎలాంటి సమస్య లేకపోవటం వల్ల ఆ Error రాలేదు అని నా అభిప్రాయం.

మీరు పైన వివరించిన సమస్యలను exclude చేసనా మీ సమస్య తీరకపోతే క్రింది సాఫ్ట్ వేర్ ఉపయోగించి చూడండి. వివరాలకు క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)