Post: #1

శార్వాణి వీణియపై మీటే అందియల రవళియే నా తెలుగు
ఆదికవి శరత్కాలపు వెన్నెలయే నా తెలుగు
పోతన భాగవతపు భాగ్యమే నా తెలుగు
మల్లినాధుడే వెలసిన దేశము నా తెలుగు
వాణీ నా రాణి యన్న వీరభద్రుని వీచికయే నా తెలుగు
వేములవాడ వేదికపై వెలసిన భీముని కావ్యమే నా తెలుగు
వేంకటపతిపై వేల గానముల అన్నమయ్య పదకేళియే నా తెలుగు
అష్టదిగ్గజముల సాహిత్య ధగధగలే నా తెలుగు
రామతత్త్వమును భోదించే గోపన్న గీతమే నా తెలుగు
శార్వాణి వీణియపై మీటే అందియల రవళియే నా తెలుగు
కత్తి లాంటి కలమును ధరించిన కాళోజి కవితయే నా తెలుగు
శ్రీశ్రీ కావ్యపు శ్రీమంతమే నా తెలుగు
విశ్వనాధుని కిన్నెరసానియే నా తెలుగు
సినారె సినీ గీత సౌరభం నా తెలుగు
గధ్ధర్ గర్జనల భూమియే నా తెలుగు
శార్వాణి వీణియపై మీటే అందియల రవళియే నా తెలుగు
సాక్షాత్ చండిక రుద్రమ్మ నడచిన నేలయే  నా తెలుగు
ఆంధ్రభోజుని ఆముక్తమాల్యదయే నా తెలుగు
మల్కిభరాముని మణిమయ రాజ్యమే నా తెలుగు
వేంగి చాళుక్య వైభవం నా తెలుగు
శార్వాణి వీణియపై మీటే అందియల రవళియే నా తెలుగు
ఏడుపాయల వనదుర్గ జాతరయే నా తెలుగు
గిరిజన సంస్కృతి భాసిల్లే మేడారం శోభయే నా తెలుగు
మెతుకుసీమకే మెరుగులు దిద్దిన చర్చి గంటల ధ్వనులే నా తెలుగు
లస్కరు భోనాల శోభయే నా తెలుగు
గౌరమ్మ రూపమై విలసిల్లే బతుకమ్మ తేజమే నా తెలుగు
షడ్రుచుల సంగమ ఫలితం నా తెలుగు
శార్వాణి వీణియపై మీటే అందియల రవళియే నా తెలుగు



Quote this message in a replyReply

Post: #2

శ్రీవాణీ గిరిజాక్ష సుతులు ఆశీర్వదింప
లనాభిమాన్య కవితా శ్రీ
లిప్త్యంతర లేఖినియైన
త్త్వజ్ఞాన పరాయణి
శర్వాణీ .......శ్రీ లలితా

నమోవాకములు

భేష్....భేష్...!!

దేశ భాషలందు తెలుగు లెస్స....!!

అలతి...అలతి...పదాలతో..
పొందికగా తెనుగించిన
మీ చాతుర్యమేమనవచ్చును.
ధన్యవాదములు....!!

కొసమెరుపు :  సోదరీ.....యుగమునకు ఆది....ది. 16.03.2010 నాడు యుగాది పర్వదినమున మీరొక మాంఛి కవితను సంధించగలరు.

Quote this message in a replyReply

Post: #3


మీ అభిమానానికి ధన్యురాలిని

మీరు అడిగినట్టు గానే ఉగాది రోజు కవిత అందించడానికి ప్రయత్నిస్తాను

Quote this message in a replyReply

Post: #4

సోదరీ శ్రీలలిత గారు,

మీరు అందించిన తెలుగు నిజముగానే సౌరభాలు వెదజల్లుతోంది. సమయము వెచ్చించి ఇలాంటి అద్భుత సౌరభాలను మాకందిస్తున్నందుకు ధన్యవాదములు.

మీరు ఇలాంటి సౌరభాలను మాకొరకు ఎన్నో ఇంకెన్నో అందించగలరని ఆశిస్తూ...

మీ సోదరసమానుడు,

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)