Post: #1

దీర్గంగా ఊపిరి తీస్తూ అటూ ఇటు చూస్తూ “ ప్చ్” అంటూ నిట్టూర్చాడు ఎంకటి.

పక్కనున్న కొలిగ్ గుర్నాదం పొద్దుట్నుండి గమనిస్తున్నాడు గురుడికేమైందా అని...

 

గడియారం వంక అలా చూస్తూ మళ్ళీ నిట్టూర్చాడు అదోలా అర్థం కాకుండా. షడన్ గా గుర్తొచ్చి తూర్పు వైపునున్న కిటికీలోచి ఆకాశాన్ని చూసాడు సూర్యుడు లేడక్కడ... వెనక్కొచ్చి పడమర వైపునున్న గోడవైపు నడుస్తుంటే అక్కడ కేవలం గోడనే ఉండి వెక్కిరించింది, మళ్ళీ పక్కకు తిరిగి ఈ సారి ఆగ్నేయం నుండి దక్షిణం వైపు ఉన్న కిటికీ వైపు అడుగులేస్తుంటే అప్పటి వరకు తమాషా చూశ్తున్న జానకి కి తిక్కరేగి “అక్కడ సూర్యుడుండడు” అంది.

ఉలిక్కి పడి బెదురు చూపుల్తో సీట్ళో కెళ్ళి కూచున్నాడు..

కాసేపయ్యాక మళ్ళీ తల పైకెత్తాలని ఎంకటి చేస్తున్న ప్రయత్నాలను చూసి,

 

“ఇదో ఎంకటి ఈయాల నీకేమైందయ్య ఇలా చేస్తున్నవు” అని అడిగాడు గుర్నాదం

అతనివైపు అదోలా చూస్తూ కిసుక్కున నవ్వి మళ్ళీ దక్షిణం వైపున్న కిటికీ వైపు అడుగులేసాడు...

 

అప్పటికే పక్క సీట్లో జానకి మూర్చపోయి ఉంది... గుర్నాదానికి అర్థం కాక పిచ్చెక్కి ఎంకటి వైపు చూస్తుంటే...

 

అక్కడ ఎంకటి కిటికీ చువ్వలు పట్టుకుని అటూ ఇటూ కాకుండా ఎటొ చూస్తున్నాడు ఆశగా...

 

 

అసలు మన ఎంకటికి ఏమి కావాలో ఎవరైనా ఊహించగలరా


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2

ప్రియమైన తమ్ముడు/హితుడు

శ్రీను రాగి

Ragees Entertainment వారికి మా ధన్యవాదాలు

ఎంకటి దక్షిణం వైపున్న కిటికీ లోంచి ఏం చూస్తున్నాడు అనే విషయానికి :
సమాధానం చెప్పాలంటే :
తర్క బద్ధంగా చెప్పాలంటే : బయటకు చూస్తున్నాడు
తర్క రహితంగా చెప్పాలంటే : గాలికోసం చూస్తున్నాడు


మిత్రులు అడిగిన దానికి సమాధానం చెప్పేముందు కొంచెం ఆలోచించాల్సిందే....ఎందుకంటే అడిగిన వారు సామాన్యులు కారు.  ‘మాన్యులు’ వారు.  అడిగిన దాంట్లో ఏదో కొంత సారాంశం ఉంటుంది.  కనుక అక్షరసుమాలను వెదజల్లి సమాధానం కోసం చూస్తున్నారు.
వారిలోని సృజనాత్మక భావానికి అక్షరశిల్పికి.....మా నివేదన
అక్షరమక్షరం కు సమర్పిస్తున్న చిన్న కానుక ఇది.
ఎందుకంటే ఎక్కడైతే అడిగారో....అక్కడే సమాధానం చెపుతున్నాను విశ్లేషించీ....!!  (ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోమన్నారు కాబట్టి....!!)
సవినయంగా మనవి చేస్తున్నాం.
అసలు మూలాల్లోకి వెళ్థాం :
దీర్ఘంగా ఊపిరి తీస్తూ అటూ ఇటూ చూస్తూ ‘‘ప్చ్’’ అంటూ నిట్టూర్చాడు ఎంకటి.
ఎవరైనా శ్వాసను సాఫీగా, సరళంగా హాయిగా తీస్తున్నారంటే దానర్థం అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడని అర్థం.  ఇక్కడ దీర్ఘంగా శ్వాస తీశాడంటే అర్ధం కొంచెం ఆరోగ్య పరంగానూ, యోగ ధారణా పరంగానూ, ఆలోచనా నిమగ్నులైనట్లు గానూ కవిగారు శ్రీను రాగి మనకు తెలియజేస్తున్న భావన అయి ఉండవచ్చును.
అంటే సహజకవిగారు మనల్ని ఆరోగ్యం పట్ల జాగ్రత్తను కనబర్చమని అన్యాపదేశంగా తెలియజేస్తున్నట్లు మనం భావించాలి.  ఇంత నిగూఢార్థం ఉంది దీంట్లో.
....పక్కనున్న కొలీగ్ గుర్నాథం పొద్దుట్నుండీ గమనిస్తున్నాడు గురుడికేమైందా అని.....!!
సహజంగా మనిషి సంఘజీవి.  పైగా ఆఫీసులో ఉన్న ఎంకటి కి మిత్రులు, సహచరులు, అనుచరులు, ఉండటంలో తప్పేమీ లేదు.  వారిలో ఒకరు గుర్నాథం అందులోని శిష్య పరమాణువు. 
ఎందుకంటే గుర్నాథం ఎంకటిని ‘‘గురువు’’ గారిలా భావిస్తూ చూసుకుంటున్నట్లు.....అతని సలహా సంప్రదింపులు తీసుకుంటున్నట్లు భావించమని, అలాగే జీవితంలో ప్రతి మనిషి పరస్పర స్నేహశీలురై స్నేహ మాధుర్యాన్ని ఆనందించమని అన్యాపదేశంగా తెలియజేస్తున్నట్లు మనల్ని భావించమని, అలాగే పాటించమని తెలియజేస్తున్నట్లు భావించాలి.
......గడియారం వంక అలా చూస్తూ మళ్ళీ నిట్టూర్చాడు అదోలా అర్థం కాకుండా.
ఆఫీసులో గోడమీద ఉన్న యాంత్రిక గడియారం వంక చూడటం అనేది సమయాన్ని తెలుసుకోవడం కోసం అయి ఉంటుంది అని సామాన్య అర్థం.  అయితే సహజ కవులు శ్రీను రాగి గారి ఉద్దేశ్యం ప్రకారం.....ఎంకటి అలా గడియారం వంక అలా చూస్టూ మళ్ళీ నిట్టూర్చడంలోని మర్మం ఏమిటంటే....
మనిషి కాలానుగుణంగా, కాలానికి కట్టుబడి బ్రతుకుతున్న జీవితం.  ప్రణాళికా బద్ధంగా, సమయానుకూలంగా సకాలంలో పనులన్నీ చక్కబెట్టుకోమని, సమయం ఎవరి కోసం ఆగదని.....మన కోసం ఆగని సమయాన్ని మన చేతిలోకి తీసుకోమని....కనీసం అలా చేయకపోయినా ప్రయత్నం అయినా చేయమని.....
మనలో ఉన్న జీవ గడియారాన్ని చాలా జాగ్రత్తగా పదిలంగా చూసుకోమని....అన్యాపదేశంగా చెపుతున్నట్లు భావించాలి.  అదే నూటికి నూరుపాళ్ళూ నిజం.  పరకాయ ప్రవేశం ద్వారా తన లోని సహజ పాండిత్య ప్రకాండాన్ని ఎంకటి ద్వారా మనకు అన్యాపదేశంగా ‘‘అమృతోపదేశం‘‘ ఇచ్చినట్లు భావించాలి.
.....సడన్ గా గుర్తొచ్చి తూర్పు వైపునున్న కిటికీ లోంచి ఆకాశాన్ని చూశాడు.  సూర్యుడు లేడక్కడ.....!!
అంటే...కవిగారు శ్రీను రాగి గారి భావమేమై ఉంటుందబ్బా....అని ఆలోచనెందుకు...??
మనం నివసించే ఈ అవని పై అనంత కాల చక్ర భ్రమణంలో దిశ, దశ కూడా చక్కగా చూసుకోమని, తెలుసుకోమని తద్వారా జీవితాన్ని ఆనంద మయం చేసుకోమని కవిగారి ఉవాచ.
....సూర్యుడు లేడక్కడ....!!
నిజంగా సూర్యుడు ఉండడా...?  ఉంటాడు.  కాకపోతే భూపరిభ్రమణంలో సగం పగలు, సగం రాత్రి గా వెలుగొందుతున్న భౌగోళిక విజ్ఞానం ప్రకారం మనకు రాత్రి సమయాలలో భూమికి ఆవల సూర్యుడుంటాడు.  ఇక్కడ చీకటి పడుతుంది.  భూమికి ఆవల చీకటి పడితే...ఇటు వైపు సూర్యోదయం అవుతుంది.
అనగా....సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు....అన్నీకూడానూ మన జీవితంలో పెనవేసుకు పోయిన అంశాలనీ....వీటిని ఆథ్యాత్మిక దృష్టితో చూసి
జీవితాన్ని ఉదయించుకోమని
జీవిత గరళాన్ని అస్తమయం చేసుకోమని
జీవితాన్ని ఆనంద మయం చేసుకోమని .....
అన్యాపదేశంగా చెపుతున్నట్లు భావించాలి.  ఏది ఏమైనా కవివర్యులు శ్రీను రాగి గారి ఆథ్మాత్మిక చింతనకు, పరోపకార పరాయణత్వానికి ఇదో మరో మచ్చు తునక.  అందరూ పాటించాలి ఏమరక.
అలాగే....అక్కడ సూర్యుడుండడు....అంటే మరెక్కడో ఉండి ఉంటాడు కదా....!! అంటే ఆశావాదం.  జీవితాన్ని ఆశావాదంతో ఆనందమయం చేసుకోమని....
అక్కడ లేడు అంటే...యదార్ధవాదం.
ఎక్కడో ఉన్నాడు అంటే....ఆశావాదం.
నిజంగా ఇక్కడ ఇపుడు లేకపోయినా ఎక్కడో ఖచ్చితంగా ఉంటాడు అంటే....నిర్మాణాత్మక యదార్ధవాదం.
ఆహా....!!  ఎంతటి నిగూఢార్ధం.
.....వెనక్కొచ్చి పడమర వైపున్న గోడ వైపు నడుస్తుంటే అక్కడ కేవలం గోడనే ఉండి వెక్కిరించింది.
అంటే దీనర్ధం....మనం ముందకు సాగుతున్నప్పుడు దారిలో ఎదురయ్యేది ఏదయితే ఉంటుందో అదే అక్కడుంటుంది తప్ప వేరేదీ ఉండదు.  అని లేని దానిని ఉన్నట్లు ఊహించుకుని గమ్యాన్ని చేరుకునే కంటే.....ఉన్న దానిని (అంటే అవరోధంగా ఉన్నదానిని) తొలగించుకుంటూ వెళితే గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చుని కవిగారు శ్రీను రాగి గారి ఆంతర్యం.
....మళ్ళీ ప్రక్కకు తిరిగి ఈసారి ఆగ్నేయం నుండి దక్షిణం వైపు ఉన్న కిటికీ వైపు అడుగులేస్తుంటే అప్పటి వరకు తమాషా చూస్తున్న జానకికి తిక్కరేగి ‘‘అక్కడ సూర్యుడుండడు’’ అంది.
అంటే...సదరు సహజకవిగారు శ్రీను రాగి గారి ఆంతర్యంలో.....దిక్కులు, విదిక్కులు తెలుసుకుంటే...మన దిశ, గమ్యం జాగ్రత్తగా చేరుకోవచ్చని అందుకే జాగరూకతతో మెలగాలని ఆయన నిశితంగా, సునిశితంగా వివరిస్తున్నట్లు జానకి అనే పాత్ర ద్వారా మనకు యదార్ధాన్ని తెలియజేస్తున్నట్లు భావించాలి. 
ఎలాగంటే....ఎంకటి ఆగ్నేయం నుండి దక్షిణం వైపు ఉన్న కిటికీ వైపు అడుగులేసి అక్కడకు చేరుకున్నప్పుడు...ఏ దిక్కు అయి ఉంటుంది.  దక్షిణం దిక్కుయే కదా.   మరి సూర్యోదయాలు గానీ, సూర్యాస్తమయాలు గానీ ఆ దిక్కున రావు కదా.  లేవు కదా. 
దిక్కులు ఏమిటో తెలుసుకోకుంటే....దిక్కు తోచకుండా పోయి...దిక్కులేకుండా పోతారు అనే నిగూఢార్థాన్ని జీవితానికి అన్వయించి జానకి పాత్ర ద్వారా మనందరికీ తెలియజేసినందుకు ఆయనలోని సమాజ హితాభిలాషకు చేతులెత్తి మొక్కాలని అనిపిస్తుంది కదూ.  ఏమయినా కవులు, కళాకారులు కళకళ లాడలేరు లేండి.  (ఎప్పుడూ ఏదో ఒకటి తాథ్మాత్మం చెందుతుంటారు లెండి.  అది నా బోటి సామాన్యులకర్థం కాదు లేండి.)
......ఉలిక్కి పడి బెదురు చూపుల్తో సీట్లో కెళ్ళి కూర్చున్నాడు
అంటే దీనర్థం : ఇప్పటి దాకా ఎంకటి నిలుచునే అటూ ఇటూ అన్యమనస్కంగా తిరుగుతున్నప్పుడు స్థిమితంగా, ప్రశాంతంగా ఆలోచించలేదు కదా. 
అందుకనే.....మన పెద్దలు చెప్పినట్లు...ఏదయినా ఆలోచన చేయాలన్నా, కార్యక్రమ రూపకల్పన చేయాలన్నా స్థిమితంగా, కుదురుగా కూర్చోమని చెప్పినట్లు వర్యులు, మాన్యులు శ్రీను రాగి గారి ఉవాచ.  అందరూ దీనిని పాటించాల్సిందే.
.....కాసేపయ్యాక మళ్ళీ తల పైకెత్తాలని ఎంకటి చేస్తున్న ప్రయత్నాలను చూసి....
అనగా : తాత్కాలికంగా సమస్యలతో పోరాడుతూ తల దించుకుని ఉండేది తల ఎత్తటానికేనని, అందరికీ తలమాణికంగా ఉండాలని (కొండొకచో....తలలో నాలుకలాగా ఉండాలని) .....అసలు ప్రయత్నమే చేయమని....తద్వారా గెలుపు అందునంత వరకు ప్రయత్నం చేయమని కవిగారి భావన.  అందుకే ఎంకటి తల పైకెత్తాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు తన రాతలలో....!!
.....’’ఇదో ఎంకటి ఈయాల నీకేమైందయ్య ఇలా చేస్తున్నవు’’ అని అడిగాడు గుర్నాధం.
అంటే : ఇక్కడ కవిగారు శ్రీను రాగి గారు ఉవాచ ఏమిటంటే.... ఇన్ని నాళ్ళు...ఏమి చేశావు.  ఏమి చేస్తున్నావు.  ఇపుడు ఏమి చేశావు.  ఏమి చేస్తున్నావు. ఏమి చేయబోయావు.  ఏమి చేయబోతావు.  ఏమి చేస్తావు అని జీవిత ప్రణాళిక రచించుకోమని అన్యాపదేశంగా, అంతర్లీనంగా చెపుతున్నట్లు భావించాలి.  మన జీవిత ప్రణాళిక మన చేతుల్లోనే ఉంటుంది. 
పైగా గుర్నాధం శిష్య పరమాణువు కదా ... ఎంకటి బాధలను చూడలేక, మనస్సు ఉండబట్ట లేక ‘‘ఇవాళ నీకేమైందయ్యా’’ అని ఆప్యాయంగా అడిగాడంటే...
సమాజంలో మనిషికి...మరో మనిషికి, సాటి మనిషి పట్ల ఉండవలసిన కనీస సాంఘిక స్నేహ సంబంధాల బాధ్యతను గుర్తెరగమని అన్యాపదేశంగా హితబోధ చేస్తున్నట్లు భావించాలి.  (ఇలా అందరూ ఉంటే ఎంత బాగుంటుంది....?  ఉండమనే సహజ కవులు, వర్యులు శ్రీయుతులు శ్రీను రాగి గారి హితోక్తి.  ఆయనకుంది కవితా శక్తి.)
........అతని వైపు అదోలా చూస్తూ కిసుక్కున నవ్వి మళ్ళీ దక్షిణం వైపున్న కిటికీ వైపు అడుగులేశాడు.
అనగా : మనం చూసే దృష్టిని బట్టి, దృక్పథాన్ని బట్టి ప్రపంచ తీరు తెన్నులు ఉంటాయని, మన జీవితం కూడా అలాగే ఉంటుందని, సంఘటనలు కూడా అలాగే కానపడతాయని.....ఎంకటి అదోలా కిసుక్కున నవ్వినట్లు చెప్పించారు.
అలాగే ఎంత బాధలున్నా హాయిగా నవ్వేయమని చెప్పినట్లు భావించాలి.
మళ్లీ దక్షిణం వైపున్న కిటికీ వైపు అడుగులేయటం అనే ప్రక్రియలో దాగున్న అంతరార్థం....ఒకసారి చేసిన పనిని మరలా పున: సమీక్షించుకోమని, తప్పులు పునరావృతం కాకూడదని జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లు భావించాలి.
.......అప్పటికే ప్రక్క సీట్లో జానకి మూర్చపోయి ఉంది. గుర్నాథానికి అర్థం కాక పిచ్చెక్కి ఎంకటి వైపు చూస్తుంటే...
దీనర్ధం : అర్థం కాని విషయాలని అర్థం చేసుకోవాలంటే వ్యర్థమైన విషయాలను వదిలేయాలన్న హితోక్తి ఇందులో జొప్పించి నిగూఢంగా తెలియజేసిన కవి వర్యులు శ్రీను రాగి ఆలోచనామృత తరంగిణి నుంచి జాలువారిన అమృత బిందువులు.  అమృతపానాన్ని మనకందించినందుకు కవివర్యులు శ్రీను రాగి గారికి ధన్యవాదాలు.
....అక్కడ ఎంకటి కిటికీ చువ్వలు పట్టుకుని అటూ ఇటూ కాకుండా ఎటో చూస్తున్నాడు ఆశగా....
దీని భావమేమి మహాశయులారా :   తను పట్టుకుంది కిటికీ చువ్వలనే స్పృహ ఉండాలని....కవులు, కళాకారులు సామాజిక, సృజనాత్మక స్పృహను కలిగి ఉండాలని, ఆయా రంగాలలో పనిచేసే వారందరూ వారి వారి నైపుణ్యాలపై అవసరమైన కాస్తంత స్పృహను కలిగి ఉండాలని చెపుతున్నట్లు భావన.
అటూ...ఇటూ కాకుండా ఎటో చూస్తున్నాడు ఆశగా....
అంటే :  చూసేది కూడా మనం ఎన్నుకున్నదానినే కరెక్టుగా ఎన్నుకోమని....అటూ ఇటూ అంటూ కాలయాపన చేయకుండా ఆశావాదంతో ఉండమని చెపుతున్నట్లు కవి వరేణ్యులు శ్రీయుతులు శ్రీను రాగి గారి ఉవాచ.
....అసలు మన ఎంకటికి ఏమి కావాలో ఎవరైనా ఊహించగలరా...?
అనగా : మన....అని చెప్పారంటే....అందరినీ ‘‘మన’’ అని భావించమని...అటులయినా సాంఘిక ధర్మాలు, స్నేహ ధర్మాలు నిలుస్తాయి శ్రీను రాగి గారి కవి ఉవాచ. 
ఎంకటికి ఏమి కావాలో ఎవరైనా ఊహించగలరా....?   అంటే :  ఎవరికి ఏదన్నా ఆపదొచ్చినా, అవసరమొచ్చినా మేమున్నామని అండగా నిల్చే వారే ఉత్తములు అని తెలియజేస్తూ....ఎంకటికి కావల్సిన అవసరాలేమిటో కనుక్కోమని చమత్కృతిని మనకందించిన కవిగారి సహృదయానికి ధన్యవాదాలు.

మరొక్కమారు సమాధానం చెపుతున్నాను :

Ragees Entertainment వారికి మా ధన్యవాదాలు
సమాధానం చెప్పాలంటే :
తర్క బద్ధంగా చెప్పాలంటే : బయటకు
తర్క రహితంగా చెప్పాలంటే : గాలికోసం
ఇక్కడ సందర్బానుసారంగా ఒక సంస్కృత శ్లోకాన్ని ఉటంకిస్తాను :  శ్రద్ధగా ఆలకించండి.
తద్విద్ధి ప్రణి పాతేన పరిప్రశ్నేన సేవయా,
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శిన :

అనగా అర్థం : తత్వ విదులైన గురువులు, సేవ చేసిన నీకు ఉపదేశం చేస్తారు.
వివరణ :  ఉపదేశమంటే....జ్ఞానం ఇవ్వటం కాదు.  ఏది అజ్ఞానమో చెప్పటం.  అంతే.  ఏది సత్యమో, ఏది జ్ఞానమో తెలుసుకోవలసిన బాధ్యత మాత్రం నీదే.
తాను చెప్పగలిగిన దానిని మనస్ఫూర్తిగా నమ్మగలిగితే...సహజ కవులు శ్రీను రాగి గారి లా ఉండాలి.  కారణం ఆయనొక సహజకవి.

పై విశ్లేషణలన్నీ శ్రీను రాగి గారు సంధించింన ప్రశ్నలలోనే సమాధానాలున్నాయి.  జాగ్రత్తగా పరికించినచో అక్షరమక్షరం మనకు ద్యోతకమవుతుంది.  ఇలాంటి మంచి ప్రశ్న వేసినందుకు ధన్యవాదాలు.  ఒకరి ఆలోచన, దృక్పథం మరొకరికి నచ్చకపోవచ్చు. 
ఎందుకంటే తన ఆలోచనా దృక్పథాన్ని బట్టి, ప్రతి మనిషీ తన గమ్యాన్నీ, జీవితాశయాన్నీ నిర్థేశించుకుంటాడు.  దానికి అనుగుణంగానే జీవిత విధానాన్ని, ఫిలాసఫీని నిర్మించుకుంటాడు.
అయితే కొంత మంది వ్యక్తులు మాత్రం ‘‘జీవిత విధానాన్ని ఒక విధంగానూ, తమ గమ్యాన్ని వేరే విధంగానూ’’ నిర్మించుకుని ఉంటారు.

ఈ సందర్భంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ గారిని తలుచుకుంటున్నాను.  ఆయన సిధ్దాంతీకరణను ఇక్కడ కొన్ని మనస్తత్వ్తా రూపంలో బహిరంగ పరుస్తున్నాను :

సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు : ఎంకటి అలా అటూ ఇటూ తిరుగుతున్నాడనేది మీరు నమ్మడం మీ యొక్క లైంగిక భయాందోళనల్ని సూచిస్తుంది.
ఐన్ స్టీన్ గారు : ఎంకటి అటూ ఇటూ ఆందోళనగా అన్ని దిక్కులు తిరగడం అనేది....ఎంకటి అటూ ఇటూ తిరుగుతున్నాడా లేక తనున్న చోటునే అతను నిలుచుంటే .... భూభ్రమణం వల్ల దిక్కులు అలా కదిలినట్లు ఉన్నదా అనేది మన దృక్పధం మీదా, చూసే చూపు మీదా ఆధార పడి ఉంటుంది.
కార్ల్ మార్క్ స్  గారి ప్రకారం : ఇటూ అటూ తిరగడం అదీ ఆందోళనతో ....బూర్జువాలచే అణిచి వేయబడిన వ్యక్తిగా పరిగణించాలి.  ఇటు నుండి అటు వెళ్ళడం చరిత్ర నిర్ధేశించిన వాస్తవం.
వాస్తు శాస్త్రజ్ఞుడు ప్రకారం : ఆఫీసు యొక్క ముఖ ద్వారం మరియు ఎంకటి కూర్చున్న సీటు అరేంజి చేసిన విధానం బాగులేకపోతేనే వాస్తు ప్రకారంగా లేకపోవటం వలననే ఇలా అశాంతితో గడుపుతున్నట్లు వ్యక్తమవుతుంది.  అర్జంటుగా వాస్తు ప్రకారం మార్చండి.
మత ప్రవక్త : మానవ జాతికి మంచి చేయడం కోసం, మన ప్రభువు ప్రతి మనిషిని ఆశావాదంతో పుట్టిస్తాడు.  అందుకు మనం ప్రభువుకు మోకరిల్లి మన జీవితాల్ని పవిత్రం చేసుకుని జీవితాన్ని ధన్యత చేసుకోవాలి. అందుకే ఎంకటి కి అశాంతితో కూడిన జీవితం ఉంది కాబట్టి దేవుణ్ని నమ్ముకోవాలి.
పౌర హక్కుల సంఘం :  ఎంకటికి ఆఫీసులో అంత పనులు పురమాయించకూడదు.  ఇది వ్యక్తియొక్క స్వేచ్ఛను హరించినట్లే....అందుకే ఎంకటి పనుల వత్తిడి వలన, ఆఫీసు నిర్వహణ, వ్యక్తిగత నిర్వహణ ను సమన్వయం చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు.....ఎంకటి అటూ ఇటూ తిరుగుతూ ఎటో చూస్తూ ఉన్నట్లు మా కమిటీ సభ్యుల పరిశీలనలో తేలింది కనుక.....తక్షణమే ఎంకటికి తగు రక్షణను ప్రభుత్వం వారు అందించాలి.
హిట్లర్ : ఎంకటి అంత ధైర్యంగా (ఎన్ని సమస్యలున్నా కూడానూ)  అటూ ఇటూ కాకుండా ఎటో చూస్తూ తిరుగుతున్నాడంటే అతనెంత ధైర్యవంతుడో తెలుస్తూనే ఉంది.  ధైర్యవంతులే దేశానికి అవసరం.  ఎంకటిని తక్షణం మన సైన్యంలో చేరమని నా ఆజ్ఞగా చెప్పి సైన్యంలో చేర్పించండి.
కమ్యూనిస్టులు : ఎంకటిని అటూ ఇటూ కాకుండా ఎటో తిరుగుతూ అశాంతిగా ఉండమని ప్రపంచ బ్యాంకు నిర్థేశించింది.
కాంగ్రెస్ నాయకులు : ఎంకటికి పనులు ఎక్కువ చెప్పటం వలన ప్రభుత్వ పాలన సక్రమంగా లేనట్లు, పరిపాలనా యంత్రాంగం విఫలమైనట్లు మా పరిశీలనలో తేలింది.  అందుకు ఎంకటి ప్రవర్తనే నిదర్శనం.  కనుక అధికార ప్రభుత్వం తక్షం కళ్ళు తెరిచి ఎంకటికి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం.
తెలుగుదేశం నాయకులు : ఎంకటికి పనులు ఎక్కువ చెప్పటం వలన ప్రభుత్వ పాలన సక్రమంగా లేనట్లు, పరిపాలనా యంత్రాంగం విఫలమైనట్లు మా పరిశీలనలో తేలింది.  అందుకు ఎంకటి ప్రవర్తనే నిదర్శనం.  కనుక అధికార ప్రభుత్వం తక్షం కళ్ళు తెరిచి ఎంకటికి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం.
ప్రజారాజ్యం నాయకులు : ఎంకటికి పనులు ఎక్కువ చెప్పటం వలన ప్రభుత్వ పాలన సక్రమంగా లేనట్లు, పరిపాలనా యంత్రాంగం విఫలమైనట్లు మా పరిశీలనలో తేలింది.  అందుకు ఎంకటి ప్రవర్తనే నిదర్శనం.  కనుక అధికార ప్రభుత్వం తక్షం కళ్ళు తెరిచి ఎంకటికి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం.

పై విశ్లేషణలన్నీ మానవ మనస్తత్త్వాన్ని ఏ విధంగా వారి వారి శైలిలో విశదీకరించవచ్చో తెలియజేస్తుంది అని సవినయంగా మనవి చేస్తున్నాను.

ఇక మన స్నేహితుల యొక్క శైలిలో భిన్నమైన పంథాను చూద్దాం :  (దయచేసి అర్థం చేసుకోగలరు.  కృతజ్ఞతలు.)

శ్రీయుతులు చిలకపాటి శివరామ ప్రసాదు గారు :
నమస్కారం సర్.  మీ కంటెంట్ చాలా బాగుందండీ.  మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానండీ శ్రీను రాగి గారు.  ఎంకటి అనే పాత్రకు కావలసిన విషయమేమంటే నేను రెండు విధాలుగా ఉంటుందని ఆశిస్తున్నానండీ :
ఒకటి : ఎంకటి అటూ ఇటూ కాకుండా ఎటో చూస్తూ చూస్తున్నాడు అశగా అన్నారు కదా తను చూసేది గాలి కోసం మరియు రెండవది : తను చూసేది బయటికి.
మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. మా ఆశీస్సులు.

శ్రీయుతులు mn48 గారు :
^ మాస్టారూ.  (శ్రీను రాగి గారు) మీరు ఇక్కడ.  మిమ్మల్ని ఇక్కడ చూసినందుకు చాలా
ఆనందంగా ఉంది.  ఇక విషయానికొస్తే : ఎంకటికి ఏమి కావాలో ఇక్కడ ఈ లింక్ ను క్లిక్ చేయండి.
మరింత సమాచారం కోసం నిపుణులైన వారి సూచనల కోసం వేచి యుండండి.

శ్రీయుతులు బోరెడ్డి మహేష్ రెడ్డి గారు :
మంచి పోస్టు చేశారు శ్రీను రాగి గారు.  కీపిటప్.  మీ నుంచి మరిన్ని ఎవర్ గ్రీన్ పోస్టులు ఆశిస్తున్నాము.
ఎంకటికి కావలసినది ఫోరమ్ లో ఈ రోజు ఏమేమి పోస్టులు వచ్చాయా అనేది కానీ లేకపోతే నానుండి గ్రాఫికల్ పోస్టులుగానీ వచ్చాయా అని అయ్యుండొచ్చు.

శ్రీయుతులు మహేష్ యస్సస్సార్ గారు :
వావ్.  థాంక్యూ అండీ రాగి శ్రీను గారు.  మంచి పంచాయతీ పెట్టినారు.  మీ పోస్టు చాలా బాగుందండీ నిజంగా నాక్కావలసిందిదే.  ధన్యవాదాలతో ఎంకటికి కావలసింది ..మ్...ఏమై ఉంటుందబ్బా ?  గాలి అనుకుంటున్నాను.

శ్రీయుతులు సుమణీ వెంకట్ గారు :
అత్యంత రసానుభూతిని చెందించే కవీంద్రులు మిత్రులు శ్రీను రాగి గారు మీ చాతుర్య చణుకులు వర్ణించడం చాలా కష్టం మిత్రమా.  ఎంకటికి కావలసింది ఏమిటో తర్క బద్ధంగా అయితే : బయటకు చూస్తున్నాడు.  తర్కరహితంగా అయితే : గాలి కోసం చూస్తున్నాడు.  ఇదే అతనికి కావలసింది.  మంచి విజ్ఞానదాయకమైన విషయాన్ని అడిగినందుకు ధన్యవాదాలు.  ప్రశ్నించండి.  తర్కించండి.  మల్లెలు మాలతోనే ప్రకాశిస్తాయి.  ప్రశ్నించటంతోనే విజ్ఞానం వికసిస్తుంది.

శ్రీయుతులు శ్రీనాథ్ గారు :
ధాంక్స్ అండీ శ్రీను రాగి గారు.  మంచి ఎఫర్ట్.  నాకనిపించేదేమిటంటే ఎంకటి గాలికోసం అక్కడ నుంచొని ఉండొచ్చు.

శ్రీయుతులు చందు గారు :
నిజంగా మీ ప్రశ్నకు సమాధానం చెప్పటం నా భాగ్యం అనుకుంటాను.  ఆథ్యాత్మికంగా చెప్పాలంటే ఎంకటి అక్కడ మలయ మారుతం కోసం నిలుచున్నాడని చెప్పొచ్చు.  సాంఘికంగా చెప్పాలంటే గాలి కోసం నిలుచున్నాడని చెప్పొచ్చు.
ఇంకా ఏమన్నా సమాచారం కావాలన్నా అడగండి.
మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తారని ఆశిస్తూ...
మీ
పసుమర్తి చంద్రమౌళి

శ్రీ జాహ్నవి గారు :
Good Morning one and All
Naaku Bhale istam ituvanti Hitokthulu ante.
Bhale adigaarandi Srinu Raagi garu
Samadhanam telisina vaallu evaraina Tondaraga cheppagalaru.
Naaku asale Suspence ante bhale interest.
Thanks in Advance.

శ్రీయుతులు త్రినాధ్ రెడ్డి గారు :
గుడ్ పోస్ట్ రాగి శ్రీను గారు.  ఫోరంలో చిన్నవాడిని కనుక నేను పెద్దలు ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను.

శ్రీయుతులు బ్రహ్మా రెడ్డి గారు :
మిత్రమా శ్రీను రాగి గారు నేనిప్పుడే మా ఊరి విచిత్రాలు అనే బ్లాగును ప్రారంభించాను.  చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. అంతకు ముందు ఆయుర్వేదం అనేవి పెట్టాను.  అయితే ఎంకటికి కావలసినవి ఏమిటంటే నాకు తెలిసి అతను ఊరకనే అక్కడ నిలుచున్నాడని తోస్తోంది.
ధన్యవాదాలతో
మీ బ్రహ్మారెడ్డి.

శ్రీయుతులు యం. శ్రీనివాస్ గుప్తా గారు :
మిత్రమా.  శ్రీను రాగి గారు మీలోని ప్రొఫెషనలిజంకు హాట్సాఫ్.  మంచి విషయం.  ధన్యవాదాలు.

శ్రీయుతులు నిక్కీ అలియాస్ కిరణ్ గారు :
Thank you very much Srinu Raagi garu.  We eagerly waiting for your query.  Its very Intellegent related matter.  I think Mr Enkati is wanting for Air or somebody (particularly I don’t know).   Thanks in Advance.

శ్రీయుతులు శ్రీను రాగి గారు :
మిత్రమా మంచి ప్రయత్నం. 
అజ్ఞాన తిమిరాన్ని చీల్చేస్తూ....
విజ్ఞాన వెలుగులు పంచుతూ...
ముందకు సాగుతున్న...
మీ కవిత
చాలా బాగుంది.
ఈ ప్రపంచం అంతో ఇంతో బాగున్నదంటే....స్నేహ మాధుర్యం పంచటం వల్లనే కదా.
నా ఈ ప్రశ్నకి సమాధానం అంతో ఇంతో దొరికిందంటే....ఫోరంలో అంతో ఇంతో స్నేహితులు ఉండబట్టే కదా.

మీరందరూ రిప్లయ్ ఇవ్వటం వల్లనే కదా.
అందరికీ నా కృతజ్ఞతలు.

Quote this message in a replyReply

Post: #3

srinu ragi garu meeradigina yenkati question chala bagundandi. Nenu prasthuthaniki daniki samadhanam ivvalekapoyinanduku chintistu .... ika sumani venkat garu - nijanga meeru chala baga vivarana icharandi. Mukhyanga mana members gurinchina vivaranakoste REALLY MEEKU NAA JOHAR .   Mana forum loni gouravaneeyulania members yokka post lano intha baga gamaninchi vari yokka style lo visadeekarinchinanduku nenu chala happy ga feel ayyanu.   Chala rojula tarvatha mana forum loni post chusi nenu manaspoorthiga navvukunnanu.  Nijagane meeru maa yokka styleslo correct ga deeniki relate chesaru.   Okkokka vivarana chadivi vari post lano gurthuchesukoga meeru cheppindi chala opt ani anipichindi.   Mari oka sari meeku johar .Tongue out

Quote this message in a replyReply

Post: #4

డియర్ సుమణివెంకట్ గారు,


రాత్రి ఒంటి గంటకు కూర్చుని ఓపికగా ఇంత పెద్ద వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.నేను రాసిన దానిలో ఇన్ని అర్థాలు ఉన్నాయా అని నాకే ఆశ్చర్యం కలిగింది.


ఇకపోతే జీవితం పట్ల మా ఎంకటికి మంచి దృక్పదాన్ని కలిగించిన మీకు ధన్యవాదాలు.


ఇక మన ఫోరమ్ సభ్యుల - మరియు మిగతా వివరాలను చదివి నేను ఎంతల నవ్వుకున్నానో మీకు తెలియదు..


వెల్ కమ్ బ్యాక్ టు ది వార్ గ్రవుండ్ సుమణి వెంకట్ గారు.

ఇక మీ చమత్కారాల్తో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ( అఫ్ కోర్స్ అది మీరు ఎప్పుడు చేస్తున్నదే అయినా )

ఉండాలని ఆశిస్తూ


మీ.....


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)