Post: #1

మిత్రులారా...!!

ఒకానొక రాజ్యానికి చక్రవర్తి మహేశ్వర సింగ్ దగ్గరకు ఒకానొక ఉద్దండ పండితుడు వచ్చి ‘‘మహారాజా.....!! నేను అనేక రకాల భాషలు నేర్చిన మహా పండితుడను.  అయితే నా యొక్క మాతృభాషను మీరెవరన్నా చెప్పగలరా...? లేని పక్షంలో అందరూ నాకు దాసానుదాసులు కావల్సిందే....నా పాండిత్యానికి’’ అని అహంకారంతో పలికిన పలుకులతో...కలత చెందిన మహాచక్రవర్తి మహేశ్వర సింగ్ ‘‘సభలో ఇంత మంది ఉన్నారు.  మన దేశ ప్రతిష్టను కాపాడే వారే లేదా...? అని మథన పడుతున్నంతలో....కవి దిగ్గజాలలో ఒకరైన శ్రీనివాసాచార్యులు వారే లేచి....సరియైన సమాధానంబు ఇచ్చిన తరుణంలో....అందరూ భేష్ ...భేష్ అని ప్రశంసించసాగారు.  వచ్చినటువంటి కవి యొక్క అహంకారాన్ని తీర్చివేయగలిగారు.

మరి ఇక్కడ శ్రీనివాసాచార్యులవారు ఏమని సమాధానం చెప్పారో ....ఎవరైనా చెప్పగలరా....????

Quote this message in a replyReply

Post: #2

మీకు అడ్డుపడుతున్నందుకు క్షమించండి. ఇటువంటి సంఘటన శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో భువన విజయంలో జరిగిందని తెనాలి రామకృష్ణ కధలలో చదివాను.

ఆ సమయంలో రామకృష్ణ కూడా సభలోనే వుంటాడు.

ఆ పండితుడిని నీ మాతృభాష రేపు చెబుతానని పంపివేసి, ఆ రాత్రి ఆ పండితుడు బసచేసిన గదిలోకి కొందరు వ్యక్తులను పంపించి ఆయన మంచి నిద్రలో వుండగా నెత్తి మీద నీళ్లు కుమ్మరిస్తాడు. ఆ పండితుడు భయంతో తన మాతృ భాషలో కేకలు పెడతాడు. అది చాటుగా విన్న రామకృష్ణ మరునాడు నీ మాతృబాష అది అని చెప్పగా రాయల వారు ఎలా కనుక్కున్నావని అడుగగా ఏ వ్యక్తి అయినా భయంలో కాని,  క్రోధంలో గాని, ఉన్నప్పుడు మాటలు వాటంతట అవే మాతృబాషలోంచే వస్తాయని రాత్రి తనుచేసిన పనిని వివరిస్తాడు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)