Post: #1
మిత్రులారా....!!

"మనిషి ధ్యేయం ఎప్పుడూ ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. కొందరు మాత్రమే అక్కడకు చేరుకుంటారు.....అడుగు వేసి అలసిపోని వాళ్ళు....!!

మంచి మానవ సంబంధాలు, సమయం మీద అధికారం, వారి వారి జీవిత ప్రణాళిక వారి చేతిలోనే ఉంటుంది కదా. ఏ వయసులో ఏ ఉత్పాదక శక్తి, ఆస్తి సంపాదనకు ప్రాముఖ్యత నివ్వాలో తెలుసుకుందాం.

1. చిన్న వయస్సులో సంపాదించవలసిన ఆస్తులు :
విద్య,
జ్ఞానం,
క్రమశిక్షణ,
ఆటల్లో ప్రావీణ్యత,
వినమ్రతతో కూడిన ఒద్దిక,
విశ్వాసం

2. యుక్తవయస్సులో సంపాదించవలసిన ఆస్తులు :
గుర్తింపు,
పోటీ తత్త్వం,
పని పట్ల మక్కువ,
ఆత్మ విశ్వాసం,
బద్ధకం మీద యుద్ధం,
సమయ నిబద్ధత

3. మధ్య వయసులో (ప్రౌఢ దశలో) సంపాదించవలసిన ఆస్తులు :
కీర్తి,
డబ్బు,
హోదా
సుఖం

4. వృద్ధాప్యం లో సంపాదించవలసిన ఆస్తులు :
సంతృప్తి,
వేదాంతం
శాశ్వత కీర్తి

ఏ వయసులో సంపాదించవలసిన ఆస్థి, ఆ వయసులో సంపాదించుకోగలిగేవాడు అదృష్టవంతుడు. ఒకవేళ అలా వయస్సుల వారీగా సంపాదించుకోకపోయినా, కాస్త జ్ఞానం కలిగిన తరువాత (ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తరువాత కలిగిన అనుభవం ద్వారా) వాటి గురించి వెతుకుతాడు.

అన్ని గుణాలు అలవరుచుకోవడం కష్టమే అయినా....మనం ‘ఇష్ట’పడితే ‘కష్టం’ అనేది పారిపోతుంది.

Logical (తార్కికంగా) ఆలోచించటమే ‘మెదడు’ చురుకుగా ఉంచుకోవటానికి మొదటి ఆధారం.
మంచి పుస్తకాలు చదవటం, సజ్జన సాంగత్యం లో ఫలవంతమైన చర్చలు మొదలైనవి మెదడును చురుగ్గా ఉంచుతాయి.

మనం జీవితం పట్ల ఇంట్రస్ట్ కోల్పోవడానికి ముఖ్య కారణం - మన జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నా, వాటిని వినియోగించుకోకుండా, ఇతరుల జ్ఞానాలను చూసి ఆనందించడం...!

మనం కూడా ఈ రొటీన్ నుంచి బయటపడి, ఏదో ఒక ఎత్తుకి ఎదగగలిగితే, మరొకరికి ఆనందదాయకమో, ఆదర్శప్రాయమో అవగలుగుతాము. ఈ చిన్న విషయం తెలుసుకున్నవాళ్ళే ఉన్నత స్థానాలకి ఎదగగలుగుతారు.

కావలసినదల్లా మనలో నిబిడీకృతమై ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవడమే.

అందుకే మిత్రులారా....!!

ఈ ఫోరమ్ ద్వారా మీ అందరి హృదయాలను జయించాలనేది మహి గ్రాఫిక్స్ బృందం యొక్క ధ్యేయం. మీరు అందరూ కలసికట్టుగా కదలిరండి. మీ భావాలను పంచుకోండి. విజ్ఞానాన్ని కలసి పంచుకుందాం. Collect and Share the Knowledge....Come to *your forum.

‘‘నిరాశ్రయంతో నశోభంతి పండిత, వనిత, లత’’ అన్నారు పెద్దలు. పండితుడికీ, స్త్రీకి, లతకీ ఒక ఆశ్రయం ఉంటేనే అవి శోభిస్తాయి’’ అని అర్థం.

మనం సమూహంగా ఈ ఫోరమ్ ద్వారా చర్చించుకునే విషయాలలో అగ్ర తాంబూలం నవీన సాంకేతిక పరిజ్ఞానమే.

మీలో ఉన్న పాండిత్యము, సృజనాత్మకత, విద్వత్తు - ఈ మూడు గుణాలను మీ మేధస్సులోంచే ఉద్భవిస్తాయి కాబట్టి.....

మీలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి పోస్టుల రూపంలో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కలసికట్టుగా పాల్గొనండి.

ఈ ఫోరమ్ ఒక శ్రమతో కూడిన పరి‘శ్రమ’. ఒక కర్మాగారం. ఒక ఆయుధం. ఒక శక్తి. ఒక నిత్య నూతనం. విజ్ఞాన వీచికల సమాహారం.

గుర్తుంచుకోండి మిత్రులారా....!!

నిజానికి - జ్ఞాన సముపార్జన కన్నా ఆనందకరమైన విషయం మరొకటి లేదు.(కొసమెరుపు : శ్రీయుతులు మాన్యులు చిలకపాటి శివరామ ప్రసాదుగారితో సంభాషణలో దొర్లిన మాటల స్ఫూర్తితో కలిగిన భావాల పరంపర.)
Quote this message in a replyReply

Post: #2
Really great anna garu దీనిని స్పూర్తిగా తీసుకుంట్టాను ఉదయం చక్కగా మీ భావాలు మమ్మల్ని కదిలించాయి ఇటువంటి విషయాలను తెలియచేస్తున్న మహి గ్రాఫిక్స్ వారికి ఇవే మా శుభాబినందనలు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)