Post: #1

మన జీవిత ప్రణాళిక మన చేతిలోనే ఉంటుంది కదా.

సంభాషణా చాతుర్యం - ఎదుటి వ్యక్తితో మంచి సంభాషణ జరపటానికి  విశేషణాలు కావాలి


ఏ ప్రణాళిక అయినా "....కోరికతో" ప్రారంభం అవుతుంది.


వాస్తవమైన కోరికతో ప్రణాళిక ను రచించి నిజమైన గెలుపుతో ‘‘విజేత’’ అవ్వవచ్చు.


మీకు - మీరు మంచి స్నేహితుడిని ‘‘మీలోనే’’ చూసుకోగలగటం.


మీలోని ఈ స్నేహితుడు మీకు సలహాదారుగా పనిచేయాలి.


మీకున్న ప్రలోభాలకి అతడు లొంగకూడదు.


నిస్పాక్షికంగా సలహా ఇవ్వగలిగి ఉండాలి.


మీ ప్రణాళిక గురించి అతడికి నిస్పక్షపాతమైన అవగాహన ఉండాలి.


మీ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఏ రేంజిలో ఉన్నాయో అతడికి కరెక్టుగా తెలిసి ఉండాలి.


మీలో ఉన్న ‘....అతడు’ నిరంతరం మిమ్మల్ని కరెక్టుగా గైడ్ చేస్తూ ఉండాలి.


కోరిక తీర్చుకోగలిగే నైపుణ్యం ప్రస్తుతం మీకు ఎంత వరకు ఉంది....?


ఆ నైపుణ్యాన్ని ఇంకా ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోగలరు - అన్నది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి.


కోరిక తీరాలంటే....మనిషికి విద్వత్తు ఉండాలి.


ఈ విద్వత్తు అనేది కొన్ని గుణాల (విశేషణాల) సముదాయం.


నేర్పు, కుశలత, ప్రావీణ్యత, ఉపాయం, లౌక్యం, జ్ఞానం, నిపుణత, యోగ్యత, చతురత మొదలైన విశేషణాలు.


ఎదుటి వ్యక్తితో మంచి సంభాషణ జరపటానికి ఈ క్రింది విశేషణాలు కావాలి.


పైకి ఇది చాలా చిన్న విషయంగా కనపడుతుంది.


కానీ ఇందులో ఇంత సైన్సు ఉన్నదా అని,


విశ్లేషించిన తరువాత తెలుస్తుంది.


ముందు చదవండి.


ముఖాముఖి : ఎదుటి వారివైపు కేవలం మొహమే కాకుండా, మొత్తం శరీరం తిప్పటం....‘‘నేను శ్రద్ధగా వింటున్నానన్న’’ భావన కలుగ చేస్తుంది.


కుతూహలం : ముందుకు కూర్చొని వినటం, ‘‘....శ్రద్దగా వినటమే కాదు, నేను అర్థం చేసుకుంటున్నాను’’ అన్న భావాన్ని కలుగచేస్తుంది.


కళ్ళు : అవతలి వ్యక్తి ముఖ్యమయిన విషయం చెపుతున్నప్పుడు, కళ్ళలోకి చూడటం, తాను చెప్పవలసి వచ్చినప్పుడు కూడా అలాగే చెయ్యటం. అప్పుడు ఆ విషయం మనసులోకి చొచ్చుకుపోతుంది.


ముఖ భంగిమ : అవతలివారు మాట్లాడే టాపిక్ లోఉన్న భావాన్ని బట్టి ముఖ భంగిమలు మారుస్తూ ఉండటం....!


రిజర్వ్ డ్ నెస్ : మాట్లాడవలసినప్పుడు మాట్లాడ లేకపోవటాన్ని ‘ఇంట్రావర్షన్ (ముభావితనం) అంటారు.


మాట్లాడవలసిన దాని కన్నా ఎక్కువ మాట్లాడే వారికి ఎక్స్ ట్రావర్ట్ (వదరుబోతులు లేదా వసపిట్టలు) అంటారు.


అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారిని రిజర్వ్ డ్ (ముక్తసరి) అంటారు.


అవతలివారి స్వభావాన్ని బట్టి, మన పద్దతి మార్చుకోవలసి ఉంటుంది.


తల వూపటం : అవసరమైనప్పుడు తలూపుతూ, ‘‘....ఔనా ?’’, ‘‘....నిజమే’’, ‘‘....మీరు చెప్పింది కరెక్ట్’’, ‘‘....నాకు అర్థం కావటం లేదు’’ లాంటి మాటలు అవతలి వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి.


ప్రతిస్పందన : పైన చెప్పినదంతా వినటం గురించి....!!


ఇక మాట్లాడటం గురించి వస్తే,


అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రతిస్పందన.


ఎప్పటి వరకూ మౌనంగా ఉండాలి ?


ఎప్పుడు మాట్లాడాలి ?


ఎంత మాట్లాడాలి ? అన్న విషయాలు ఈ విభాగంలోకి వస్తాయి.


అనవసరమైన విషయాలకి ప్రతిస్పందించటం, ఖండించటం, వాదించటం అనవసరం.


అంతర్గత భావం : అవతలి వారి మునసులో ఏముందో కరెక్టుగా తెలుసుకొని, దానికి సంబంధించిన విషయమే మాట్లాడటం మంచిది.


స్వరం : అన్నిటికన్నా ఇది ముఖ్యం. ఎప్పుడు మోనోటోన్ (ఒకే లెవల్) లో మాట్లాడాలి ? ఎప్పుడు స్వరం పెంచాలి ? ఎప్పుడు డ్రమటికి గా మాట్లాడాలి ? అన్నది కరెక్ట్ గా తెలుసుకోవాలి.


అలాగే వాక్య నిర్మాణం.... ఉదా : ‘‘.....నాకు సరీగ్గా అర్థం కావటం లేదు’’ అన్న వాక్యం, ‘‘....మీరు సరీగ్గా చెప్పటం లేదు’’ అన్న దానికన్నా మంచి పద ప్రయోగం.


సాంద్రత : ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఎంత సాంద్రతతో మాట్లాడాలి - అన్నది రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. 1) అవతలి వ్యక్తి యొక్క విజ్ఞత, అర్హత. 2) విషయం యొక్క ప్రాముఖ్యత.


చొచ్చుబాటు : అవతలివారిని ఎంతసేపు మాట్లాడనిచ్చి, తాను ప్రారంభించాలి అన్న విషయం కరెక్టుగా తెలుసుకోగలిగి ఉండాలి. లేకపోతే సంభాషణ అతివృష్టి, అనావృష్టిగా ఉంటుంది.


భాష : అవతలి వారికి అర్థమయ్యే రీతిలో, మనమీద గౌరవం కలిగేలా భాష ఉపయోగించాలి.


జ్ఞాన సముపార్జన కన్నా గొప్ప ఆహ్లాదం మరొకటి లేదు.


పుస్తకాలు చదవటం, తెలివైన వారితో సంభాషించటం, సజ్జన సాంగత్యం, స్నేహంలోని మాధుర్యాన్ని చవి చూడటం....


అందుకే మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం మంచిది.


‘‘విజయం’’ ముందు కష్టపెడుతుంది.


తరువాత సంతృప్తినిస్తుంది.

Quote this message in a replyReply

Post: #2

chaala manchi vishayanni savivaranga teliyajeyadamlo meeku meere saati SV garu.

thanks

Quote this message in a replyReply

Post: #3
ilaanti manchi vishayalu andistunanduku danya vaadaalu.. Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)