Post: #1
ఎప్పుడు చదవాలి ?
కొంతమంది పెద్ద పుస్తకాన్ని కూడా ఒక్క రోజులో చదివేస్తారు.
మరికొందరికి నెలల తరబడి చదివినా పూర్తి కాదు.
కొందరు, ‘అక్కడక్కడా’ చదువుతారు.
మరికొందరు అక్షరమక్షరం చదువుతారు.
అన్నిటికన్నా మంచి పద్ధతి - అవసరమైన దాన్ని పూర్తిగా చదివి, అనవసరమైన దాన్ని అక్కడక్కడ చదవటం.
కానీ దీంట్లో ఒక చిక్కుంది.
ఏది అవసరమో ఏది అనవసరమో ఎలా తెలుస్తుంది ?
అది కూడా ఒక కళ.
అభ్యాసం వల్ల వస్తుంది.
పోతే....చదివింది అర్థమై, మెదడులో స్థిరపడాలంటే, మెదడు చురుగ్గా ఉండాలి.
ఈ క్రింది విషయాలను గమనించండి.
మెదడు ఏయే వేళల్లో ఎంత చురుగ్గా ఉంటుందో తెలుపుతుంది.
ఇది కేవలం ‘చదువు’కే కాదు.
ఏ పనికయినా వర్తిస్తుంది.


A : 4 PM TO 7 PM (40%)


B : 7 PM TO 10 PM (80%)


C : 10 PM TO 12 MIDNIGHT (60%)


D : 12 MIDNIGHT TO 5 AM (20%)


E : 5 AM TO 9 AM (100%)


F : 9 AM TO 1 PM (60%)


G : 1 PM TO 4 PM (20%)


సమయాన్ని సూచిస్తూ....ఆయా సమయాలలో మెదడు యొక్క చురుకుదనం పాలు తెలుపు సంఖ్య బ్రాకెట్ లో ఇవ్వబడినది.

మొత్తానికి విశ్లేషించి చూస్తే.... E : 5 AM TO 9 AM (100%) - ఈ పాయింట్ ఒక్కటే బాగా కనపడుతోంది.
శాస్త్రజ్ఞుల పరిశోథనలో తేలిన విషయం కూడా ఇదే.
పూర్వం వేదకాలంలో కూడా గురుకుల విద్యా బోధన, గురు ముఖత: తెలియజేసిన విషయం కూడా ఇదే. కనుక ప్రియమైన విద్యార్ధినీ విద్యార్థులారా....
స్నేహితులారా....!
గమనించండి.
ఇది కేవలం చదువుకే కాదు అన్ని వ్యవహారాలలోనూ వర్తిస్తుంది.
ఆలోచించండి. ఆచరించండి. ఆచరింపచేయండి.
Quote this message in a replyReply

Post: #2

Good Post for reader lovers n all.

Quote this message in a replyReply

Post: #3

Sumani venkat garu thank you for your valuable post .

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)