Post: #1

‘ఆల్ర్ఫెడ్ పీ-స్లోన్’ అన్న వ్యక్తి జనరల్ మోటార్స్ కార్ల కంపెనీకి ఛీఫ్.

అతడికి వచ్చిన ఒక ఆలోచన మొత్తం ప్రపంచపు వ్యాపార రంగాన్నే ఒక మలుపు తిప్పింది.

అతడి పోటీదార్లని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇంతకీ అతడు కనుక్కొన్నది గొప్ప విషయమేం కాదు.

చాలా చిన్న విషయం.

కానీ ఇన్ని వందల సంవత్సరా పాటు ఇంత చిన్న విషయం ఎవరికీ తట్టనందుకు మనకి ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈ ప్రపంచంలో ఎవరైనా,

ఒక కారుకి సొంతదారుడై దాంట్లో తిరగాలి అంటే,

దాని ధర చెల్లించి కొనుక్కోవాలి.

ఇది అందరికీ తెలిసిందే..!

‘ఆల్ర్ఫెడ్ పీ-స్లోన్’ తన కార్ల కంపెనీ తరపున ఒక కొత్త నినాదాన్ని సృష్టించి మార్కెట్ లోకి వదిలాడు.

ఆ నినాదం ఈ విథంగా సాగుతుంది.

‘‘డబ్బు చెల్లించకుండానే మీ సొంత కారు డ్రయివు చెయ్యండి’’.

ఆశ్చర్యంగా ఉందా ?

అవును.

నేను చెప్తోంది వాయిదా పద్ధతి గురించి.

కంపెనీయే ఇన్ స్టాల్ మెంట్ సిస్టంలో కార్లకి రుణాలు సమకూర్చటం అన్న పద్ధతి అప్పటి నుంచే ప్రారంభమయ్యింది.

వాహనాన్ని, ముందు స్వంతం చేసుకుని, తరువాత వాయిదాలు కట్టటం అనేది మనకి తెల్సిందే కదా....!!

మిగతా కార్ల కంపెనీలన్నీ దీన్ని అమలులోపెట్టే లోపులోనే

జనరల్ మోటార్స్ కొన్ని మిలియన్ డాలర్ల లాభాల్ని సంపాదించింది.

సమర్థుడి ఆలోచన ఎప్పుడూ ఆ విధంగానే ఉంటుంది.


Source : Telugu Translation from one of the leading Business Magazine

Quote this message in a replyReply

Post: #2
GOOD ONE SIR
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)