Post: #1

మిత్రులందరికీ ధన్యవాదములు.

గత సంవత్సరం ఇదే రోజున ఈ ఫోరమ్ ను ప్రారంభించడం జరిగినది. అందరి మిత్రుల సహకారంతో, ఎటువంటి సమస్యలు లేకుండా ఒక సంవత్సరాన్ని పూర్తి చేయగలిగినందుకు సంతోషంగా ఉంది.

ఫోరమ్ ప్రారంభించిన మొదటి నుండి ఇప్పటిదాకా సుమణీ వెంకట్ గారు కొత్తగా జాయిన్ అయిన ప్రతి మెంబర్ ను, ఫోన్ కాల్ ద్వారా ఉత్సాహపరిచి, వారితో పోస్టులు చేయించడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, ఫోరమ్ అభివృద్ధిలో ఎంతో కృషి చేశారు.

గౌరవనీయులైన ప్రసాద్ గారు ఎంత సమయం వెచ్చించి ఒక పోస్టును చేస్తారో మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన పోస్టులకు చాలా మంది సభ్యులు అభిమానులుగా మారారు. లేటెస్ట్ థ్రెడ్స్ లో ప్రసాద్ గారు పోస్టు కనిపిస్తే వెంటనే లాగిన్ అయి చదివే మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి సులభంగా అర్థమయ్యే రీతిలో పోస్టును ప్రజెంట్ చేయటంలో తన ప్రతిభను చాటుకున్నారు.

శ్రీనురాగి గారి పరిచయం కొంచెం లేట్ గా జరిగినప్పటికీ, తన కవితలతో అందరి హృదయాలలో ఒక గొప్ప స్థానాన్ని సాధించగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఫోరమ్ లో కవితలకు కూడా స్థానాన్ని ఏర్పరచాలి అన్న ప్రతిపాదన తనదే. తర్వాత కొన్ని రోజులకు కుమార్ వర్మ గారు మరియు చింటూ, లల్లి ఇలా ఎంతో మందిసభ్యులు ఆ కేటగిరీలో తాము కూడా పాలు పంచుకోవడం ఆనందదాయకం!! ఏది ఏమైనా శ్రీను రాగి గారి ఐడియా సక్సెస్ అయింది.

శ్రీనాథ్ గారు, మొదట్లో ఫోరమ్ మీద సరియైన అవగాహన లేకపోయినప్పటికి, ఓపికతో అన్నీ తెలుసుకొని పోస్టు లు చేసేవారు. కేవలం ఫోరమ్ లో పోస్టు చేయడం కోసమే ఒక గంటలో తెలుగు ప్రాక్టీస్ చేసి, తెలుగులో పోస్టులు చేయగలిగారు. మంచి తెలివితేటలు, ఏ విషయాన్నైనా సులభంగా అర్థం చేస్కోవడంలో శ్రీనాథ్ గారు ముందుంటారు. ఎక్కువగా లభించని unigraphics NX6   తెలుగు ట్యుటోరియల్స్ ను శ్రీనాథ్ గారు మన ఫోరమ్ లో పోస్టు చేయడం విశేషం. 

నాకు క్లోజ్ ఫ్రెండ్ అంతే కాకుండా నేనుండే ఏరియాకు 10 కిమీ దూరంలోని శ్రీశైలం లో ఉంటున్న Mahesh_SSR మీ అందరికీ సుపరిచితమే. చాలామంది సభ్యులు ఆయనే నేను అనుకుంటుంటారు. Smile మహేష్ కు మొబైల్స్ విషయంలో మంచి టెక్నికల్ నాలెడ్జి ఉంది. ఫోరమ్ లో జాయిన్ అయిన తర్వాత అన్నీ విషయాలపై మంచి మంచి పోస్టులు చేస్తూ ఫోరమ్ అభివృద్ధిలో తన పాత్రను పోషించారు.

ఇక చందు గారు డెవోషనల్ పోస్టింగ్ లకు కావలసిన అన్నీ పుస్తకాలను కలెక్ట్ చేసి, ఓపికతో సొంతంగా స్కాన్ చేసి, పోస్టు చేయడం ప్రసంశనీయం. మన ఫోరంలో ఈ రోజు అన్నీ రకాల డెవోషనల్ మెటీరియల్ లభిస్తుందంటే అది చందుగారి కృషే అని చెప్పవచ్చు. 

త్రినాథ్ రెడ్డి గారి పోస్టులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా వివరంగా స్టెప్ వైజ్ స్క్రీన్ షాట్స్ ఉపయోగిస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో మంచి టెక్నికల్ పోస్టు చేయడంలో త్రినాధ్ రెడ్డి గారు తన వంతు కృషి చేశారు.


Mn48 అనే ఐడీ మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువ సమయం ఫోరమ్ లో ఉండి, సభ్యులు వేసే ఎలాంటి ప్రశ్నకైనా ఓపికతో సెర్చ్ చేసి, సరియైన సమాధాన్ని లింక్ లతో సహా ఆన్సర్ చేయడంలో Mn48 గారు ముందుంటారు. అంతే కాకుండా ప్రతిపోస్టును చదివి, అందులో ఏమైనా తప్పులుంటే వెంటనే ఎడిట్ చేసి, మంచి మోడరేటర్ గా ఇతను పేరు సంపాదించుకున్నారు. Mn48 గారు మోడరేషన్, ఆన్సరింగ్ ఒక క్రమ పద్ధతిలో మెయిన్ టైన్ చేస్తూ, ఫోరమ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.


అలాగే సాయికృష్ణ, అనంత్, హఫీ, నాగరాజు, కిరణ్(Nicky), నాగఅరవ, వొడ్నాల శ్రీనివాస్(late), సతీష్, జాహ్నవి, ప్రసాద్(KWT) ఇలా ఎంతమంది సభ్యలు ఫోరమ్ లో మంచి మంచి పోస్టులు చేసి ఫోరమ్ అభివృద్ధిలో తోడ్పడ్డారు. వారందరికీ ఇంకా ఫోరమ్ లో తమ నాలెడ్జిని షేర్ చేయడానికి ముందుకు వస్తున్న అందరు సభ్యులకు ధన్యవాదములు.

ఇలాగే మీ సహకారంతో ఫోరమ్ నిరంతరం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగగలదని ఆశిస్తున్నాను.

ఈ సందర్భంగా కొన్ని నెలలలో "మహిగ్రాఫిక్స్ మల్టీమీడియా" అనే మంత్లీ మ్యాగజైన్ ను ప్రారంభిస్తున్నాం అని తెలియజేస్తున్నాము.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

అప్పుడే ఒక సంవత్సరం గడిచిందా అనిపిస్తోంది.....


స్నేహ పూర్వకమైన వాతావరణం

సాంకేతికంగా వ్యక్తి అభివృద్ధి నిర్ధేశకం

నూతన ఒరవడి

జ్ణానార్జానకై అవసరమయ్యే

అన్నిటి సముదాయం

మన ఫోరం..

ఇది ఇంకా ఇంకా ఒదిగి ఎదిగి

తెలుగు ఫోరంలలో

అన్ని రకాలా కంటెంట్స్ ఉన్న

ఒక తేనే తుట్టెలా ఉండాలని కోరుతూ


మహిగ్రాఫిక్స్ ఫోరం కు మొదటి జన్మ దిన శుభాకాంక్షలు..

అలాగే

మల్టీమీడియా మంత్లీ మ్యాగజైన్ కు స్వాగతం - శుభాభినందనలు.....


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

మహిగ్రాఫిక్స్ గారు నా పై వ్యక్తపరచిన అమూల్యమైన అభిప్రాయానికి ధన్యవాదములు.

ఎలాంటి స్వార్ధాపేక్ష లేకుండా మనకు తెలిసినది నలుగురికి పంచాలనే సదుద్దేశ్యంతో ఈ ఫోరం ను ప్రారంభించి, నిర్వహిస్తున్న మహి గ్రాఫిక్స్ (బోరెడ్డి మహేష్ రెడ్డి) గారికి, వారి ఫోరం ద్వారా ఈ సదుపాయాన్ని అందిపుచ్చుకుని అనేక మంది మరెంతో మందికి అందిస్తున్న ఈ సాంకేతిక భాండాగారానికి నా వంతు చేయూతనిస్తున్నాను. ఇందులొ నా గొప్పతనం ఏమీ లేదు, అందరం శ్రమిస్తున్నాం అనేదానికంటే శ్రమిస్తూ అందులొని ఆనందాన్ని చవిచూస్తున్నాం అనటం బాగుంటుందేమో. ఒకరు తమ సమస్యను మనసలహా తో పరిష్కరించుకోగలిగారు అని తెలిసినపుడు కలిగే  అనుభూతి సంతోషం నిజంగా వ్యక్తపరచలేనిది.

ఈ సదవకాశం ఇచ్చిన మహి గ్రాఫిక్స్ గారికే మనందరం "ధన్యవాదాలు" తెలియచేసుకోవలసి ఉంది.

మహిగ్రాఫిక్స్ (బోరెడ్డి మహేష్ రెడ్డి) గారికి మన:పూర్వక ధన్యవాదములతొ మరియు "మహిగ్రాఫిక్స్ మల్టీమీడియా" మంత్లీ మ్యాగజైన్ సూపర్ డ్యూపర్ హిట్ కావాలని కోరుకుంటూ . . . . .

చిలకపాటి శివరామ ప్రసాద్

Quote this message in a replyReply

Post: #4

మిత్రమా

మహిగారూ

అంకితం...

పునరంకితం.

గో ఎ హెడ్.

గమ్యం చేరుకుంటున్నప్పుడూ మరియు

ఆ గమ్యాన్ని చేరుకునే సమయంలో ఎదురైన ఫలితాలను అనుభవిస్తూ ,

ప్రతిక్షణం ఆనందమయంగా ఉండటమే విజేతల లక్షణం.

మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ.....

పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ....!!

మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)