Post: #1

మిత్రులారా....!

నా మొబైల్ కు ఈ క్రింది మెసేజ్ వచ్చింది.

Dont attend calls from

9888308001,

9316048121,

9876266211,

9888854137,

9876715587,

these numbers come in red colour, causes brain Haemarage due to very high frequency. 27 person died just receiving on the cal. Save dis numbers Watch Raj TV or DDNews. Plz inform all u r friends n relatives soon...!

ఇందులో ఎంత తార్కికంగా ఆలోచించినా నాకేమీ అంతు బట్టలేదు.  అప్పటికీ ప్రయోగం చేశాను.  బట్ నో రెస్పాన్స్.  అయితే స్పీకర్ ఫోన్ తో చేశాను.  ఎటువంటి ధ్వని రాలేదు. అసలు ఇలా ఎందుకు జరిగినది ?  పర్టిక్యులర్ గా ఈ నెంబర్లకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది....?

మా ఆఫీసు పరిథిలోనే ఓ పది పదిహేను దాకా సెల్ టవర్లు ఆవరించి ఉన్నాయి.  అసలు సెల్ అంటేనే....సెల్ (తరంగాలు) ద్వారా పనిచేసేది అని అర్థం.  అయితే నేను అంత లోతుగా వెళ్ళను.  బట్... ఇది ఎంత హేతుబద్ధమా లేక మూఢ నమ్మకమా....పుకార్లు షికార్లు చేయడమా అని ప్రశ్నిస్తున్నాను.

విశేషించి మీడియా వారు ఎందుకు అంత ప్రాముఖ్యత కల్పిస్తున్నారు.  టీవీ ఛానెళ్ళలో కూడా చూడటం తటస్ఠించింది.  ABN ఆంధ్రజ్యోతి ఛానెళ్ళలో కూడా స్వయంగా నేను చూశాను.  బట్ వారు ఎడ్యుకేట్ చేసే విధంగానే ప్రోగ్రామ్ రూపొందించి శాస్త్రీయంగా ఆలోచించమని తెలియజేస్తూ.....జాగ్రత్తగా ఉండమని కోరారు.

అస్సలు ఇందులో సాంకేతికంగా శాస్త్రీయంగా ఆలోచిస్తే....ఏముంటుంది.  ఏమై ఉంటుంది విషయం.

చర్చకు ఆహ్వానం.

ఇది తిరోగమనమా...పురోగమనమా...

అసంబద్ధమా...సంపూర్ణ అంగీకార యోగ్యమైన విషయమా...

ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించవచ్చా....!!

ఇందులోని నిజానిజాలు తెలుసుకుందామా...?

Quote this message in a replyReply

Post: #2
హేతుబద్దంగా ఆలోచించటానికి ఇందులో ఎమన్న తర్కం ఉందంటారా ..? నిజంగా మీరనట్టు ఇది పూర్తిగా మూడనమ్మకమే కాక మరి ఎంటి ఇక మీడియా మిత్రులు అంటారా వారికి ఎది దొరికినా పండగే కదా. ఇవే కాదు సుమా ! దేవుడుకి సంబందించ్చినవి " ఇది తిరుపతి వెంకన్న సన్నిదానం నుంచి వచ్చిన మెసేజ్ ఓం నమె వెంకటేషాయ నమ: దీనిని మీరు 21 మందికి పంప్పిచ్చిన యెడల మీకు సుకసంతోషాలు కలుగుతాయి లేకపోతే.......? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కనీసం ఇప్పటికి అయినా ఆలోచిద్దాం..
ఇది తిరోగమనమా...పురోగమనమా...

అసంబద్ధమా...సంపూర్ణ అంగీకార యోగ్యమైన విషయమా...

ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించవచ్చా....!!

ఇందులోని నిజానిజాలు తెలుసుకుందామా...? ధన్యవాదాలు మిత్రమా మీ వలన మా మనసులొ భావాలు తెలియచేయగలిగాము
మహిగ్రాఫిక్స్ వారికి వారి టీమ్ కి ధన్యవాదాలు
Quote this message in a replyReply

Post: #3
నేను కూడా ఇటువంటి వార్తలను గురించి విన్నాను కానీ పెద్దగా పట్టించుకోలేదు.ఇటువంటి మెసేజ్ లను ఏ ఉద్దేశ్యంతో పంపుతారో ఏమో!
Quote this message in a replyReply

Post: #4

హేతువాదం గురించి నాకు పెద్ద అవగాహన లేదు గాని..

తార్కికంగా ఆలోచిస్తే ఇది మనుషుల్లో ఉన్న ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను బయటపెడుతుంది.గుర్తింపు ను సహజంగా ప్రతీ వారు కోరుకుంటారు,ఐతే అది ఒక పాజిటివ్ సక్సెస్ వలన వచ్చింది ఐతే పర్లేదు అందరికీ బాగుంటుంది.
కాని విలువలు లేని జీవితాన్ని గడుపుతూ గుర్తింపును కోరుకునే వాళ్ళు మన సమాజంలో చాలా ఉన్నారు. ఉదాహరణలు తీసుకుంటే : మనతో సహజీవనం చేస్తున్నా ఈ ఉగ్రవాదులు – హంతకులు – సాడిస్టులు ఇలా చాలానే ఉన్నారు. తాత్కాలికమైన మానసిక సుఖం కోసం తనను తాను తృప్తి పర్చుకోడం కోసం వీళ్ళు ఇలా చేస్తారు ( వాళ్ళు ఇలాగే ఎందుకు చేస్తారు అనే దానికి కారణాలు ఏమిటీ అని కొచ్చెన్స్ వద్దు ఇక్కడ )

ఊరి బయట మంటలొచ్చాయి అనే పుకార్లు - తిరుపతి వెంకన్న మెసేజీలు ఈ కోవకు చెందినవే.ఐతే దీని వలన ఎవరికీ ఎలాంటి ఉపయోగాలు – నష్టాలు ఉండవు. ఐతే టెక్నాలజీ పెరిగి వీరి ఆలోచనల్లో కూడా కొద్దిగా మార్పు వచ్చి వారిలో ఉన్న ఈ కాంప్లెక్స్ ను కప్పి పుచ్చుకోడానికి ( అన్ఫార్చునేట్లి వీళ్ళ మెదడుల్లో కొద్దో గొప్పో టెక్నికల్ నాలెడ్జీ ఉండటం మూలానా “ నిజమే కాబోలు అనేలా” చేస్తున్నారు ) ఐతే ఆ పర్టిక్యులర్ నంబర్ల మాటేమిటీ మరీ? ఏమో.....


ఐతే వీటిని కొట్టి పారేయటానికీ వీలు లేదు...

సృష్టిలో అతి వేగంగా ప్రయాణించేది కాంతి అని మనం చదువుకున్నది కొంత కాలం వరకు మనం నమ్ముతూ వచ్చాం, కాని దాని కంటే కూటా వేగంగా ప్రయాణం చేసేది విశ్వం లో మరో కణం ఉందని శాస్త్రజ్ణులు కనుగొన్నారని వార్తలు వచ్చయ్. సో వీటి గురించి సరైన ఇన్ & అవుట్ ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు బయటకొచ్చేవరకు మనకు అసలు నిజాలు తెలిసే అవకాశం లేదేమో అనిపిస్తోంది...

లెట్ అజ్ వేయిట్ & సీ...


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)