Post: #1

ఎక్కడినుండో సూటిగా వచ్చి తగిలిందొక రాయి

చివ్వున చిమ్మిన నెత్తురు

చేతిలో వున్న శిశువును మరింతగా

హత్తుకొని పరుగు…

ఎవరు చేసిన పొరపాటుకు

ఎవరికీ శిక్ష?

ఎందుకీ పొరపొచ్చాలు?

ఎవరి అధికార దాహం తీర్చడానికి?

నిశ్శభ్ధం  పెను నిశ్శభ్దం కమ్ముకున్న

చీకటిలో కేక పెట్టలేని గాయం!

ఝెండా ఎవరిదో చేతిలో పెట్టి పారిపోయిన

ఆకతాయి.. కడుపులో దిగిన కత్తి పేగులను

కుప్పగా పోసి పోయిన కర్కశం!

తను రోజూ  ఆడుకునే గల్లీలో

ఘజనీల దాడితో భీతిల్లిన కుఱాడి కళ్ళలోని

భయంపట్టదా మీకు?

రోజూ అలాయి బలాయి చెప్పుకునే చేతులు

నేడు అనుమానంగా బిగుసుకుంటున్న వైనం..

మొన్నటి హలీం తీపి, నిన్నటి ఉగాది పచ్చడి చేదు

యింకా నాలిక ముందు రుచిగా జ్నప్తికి వస్తున్నాయి!

ఈ అనుమానపు గీతలు గీసిన వాడి

గీత చెరిపెయ్య కలుద్దాం కలుద్దాం

(ఈ నా వాక్యాలు నా బ్లాగు You are not allowed to view links. Register or Login to view. లో కూడా చదవచ్చు)

Quote this message in a replyReply

Post: #2
great really great yar
Quote this message in a replyReply

Post: #3
Good poetry
Quote this message in a replyReply

Post: #4
స్పందించిన హృదయాలకు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)