Post: #1

ఖాళీ
గుండె గది మూలల్లో
మెదడు జ్ఞాపకాల పొరల్లో
అలా తెరలు తెరలుగా
తేలియాడుతూ వస్తున్నా గబా గబా
గాభరాగా ఎవరో తరుముతున్నట్లుగా
గాలి ఏదో తోసుకుపోతున్న మబ్బుల మల్లె
ఏదీ ఆగకు౦డా పయనమవుతూ
ఒంటరిగా ఈ గది మూలన నన్ను
వదిలి...

రాజుకుంటున్న జ్వాల పైకెగిరినట్లే
ఎగిరి మాయమవుతున్నది
తర౦గాలుగా లేస్తున్న ఆలోచనలు
ఒక్కమారు కుప్పకూలి
నన్నీ అగాధంలో తోసివేస్తూ...

మూతలు పడుతున్న రెప్పలు
ఎంతకీ తెగని సుదీర్ఘ అసంపూర్ణ
స్వప్నాన్ని తె౦చలేక
అలసిన దేహాన్ని ఇలా
ఈ గదిమూలలో ఒ౦టరిగా ...

(నా యీ కవితతో పాటు మరిన్ని నా భావాలను ఇక్కడ కూడా చూడొచ్చు You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)