Post: #1

Batch Water Mark - Tutorial

మీ లోగోను కానీ, టెక్స్ట్ ను కానీ వివిధ ఫోల్డర్ లలోని అన్నీ ఇమేజ్ లకు ఒకే సారి వాటర్ మార్క్ గా అప్లై చేయడం ఎలాగో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. బ్యాచ్ వాటర్ మార్క్ క్రియేషన్ కు వివిధ రకాల సాఫ్ట్వేర్ లు అందుబాటులో ఉన్నప్పటికీ, సులభంగా వాటర్ మార్క్ అప్లై చేయడానికి Batch Watermark Creator అనే సాఫ్ట్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ సాఫ్ట్వేర్ యొక్క డౌన్లోడ్ లింక్:

You are not allowed to view links. Register or Login to view.

ఈ సాఫ్ట్వేర్ నుపయోగించి బ్యాచ్ వాటర్ మార్క్ ను అప్లై చేయడానికి క్రింది స్టెప్స్ ను అనుసరించండి.

1. ముందుగా మీకు నచ్చిన టెంప్లేట్ ను తయారు చేయడానికి Batch Watermark Creator ను ఓపెన్ చేసి Templates Editor ను క్లిక్ చేయండి.
Batch Water Mark Creation - Templates Editor

2. Create a New Template Batch Water Mark Creation - Create a New TemplateButton ను క్లిక్ చేయండి.

3. ఇపుడు మీరు క్రియేట్ చేయబోయే కొత్త టెంప్లేట్ నేమ్ టైప్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.
Batch Water Mark Creation - Template Name

4. క్రింద చూపిన విధంగా New Text Item బటన్ ను క్లిక్ చేయండి.
Batch Water Mark Creation - New Text Item


5. కొత్తగా ఏర్పడిన టెక్స్ట్ లేయర్ ను సెలెక్ట్ చేసి, Type Text బాక్స్ లో మీకు కావలసిన టెక్స్ట్ ను టైప్ చేయండి.
Batch Water Mark Creation - Type Text

6. టెక్స్ట్ ను మీకు నచ్చిన విధంగా మోడిఫై చేయడానికి క్రింది ఎఫెక్ట్స్ ను గమనించండి.
Batch Water Mark Creation - Effects
Batch Water Mark Creation - Effects

Batch Water Mark Creation - Effects

Batch Water Mark Creation - Effects

Batch Water Mark Creation - Effects

Batch Water Mark Creation - Effects

7. ఇపుడు లోగో ఇమేజ్ ను ఎలా ఇన్సెర్ట్ చేయాలో తెలుసుకుందాం. క్రింద చూపిన విధంగా New Image Item బటన్ ను క్లిక్ చేయండి.
Batch Water Mark Creation - New Image Item

8. ఆల్రెడీ సాఫ్ట్వేర్ తో పాటు లైబ్రెరీలో లోడ్ అయిన ఇమేజ్ లను  ఇన్సెర్ట్ చేయడానికి, Load from library బటన్ ను క్లిక్ చేయండి.
Batch Water Mark Creation - Load from library


9. మీ కంప్యూటర్ లోని సొంత లోగోను ఇన్సెర్ట్ చేయడానికి, క్రింద చూపిన విధంగా Browse బటన్ ను క్లిక్ చేయండి.
Batch Water Mark Creation - Browse

10. మీకు నచ్చిన విధంగా టెంప్లేట్ రెడీ చేసిన తర్వాత Save Batch Water Mark Creation - Saving Button ను క్లిక్ చేసి, ఆ విండో (Templates Editor ) ను క్లోజ్ చేయండి.


11. క్రింద చూపిన విధంగా Open బటన్ ను క్లిక్ చేసి మీ కంప్యూటర్లోని అన్నీ ఇమేజ్ లను ఒకే సారి ఓపెన్ చేయండి.
 Batch Water Mark Creation - Open all images

12. మీరు ఇంతకు ముందు సేవ్ చేసిన టెంప్లేట్ ను క్లిక్ చేయండి.
 Batch Water Mark Creation - Template

13. Options బటన్ ను క్లిక్ చేసి Output Folder ను సెలెక్ట్ చేయండి.
 Batch Water Mark Creation - Output Folder

14. ఫైనల్ స్టెప్ గా Process బటన్ ను క్లిక్ చేయండి. Process కంప్లీట్ అయిన వెంటనే Output Folder ను ఓపెన్ చేసి చూడండి. అన్నీ ఇమేజ్ లకు మీరు తయారు చేసిన టెంప్లేట్ వాటర్ మార్క్ గా అప్లై చేయబడి ఉంటుంది.
 Batch Water Mark Creation - Process


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)