Post: #1

ఆ మూసుకుపోని కనురెప్పల
ఆవల దాగిన విషాదం
ఇన్నినాళ్ళ తరువాత కూడా
వెంటాడుతూనే వుంది..

రాబందుల నోట చిక్కి విలవిలలాడిన
ఆ క్షణం,
ఊపిరి సలపలేని
గుండెలపై పడిన భారం
బిగబట్టి వదలలేని శ్వాస
చివరి నిట్టూర్పై కళ్ళలోంచి
నిష్క్రమించిన క్షణం..

ఆ కళ్ళు కొన్ని వేల
ప్రశ్నలకు గురుతుగా
సమాధి చేయబడ్డా
తిరిగి లేచిన
మోసెస్ వలే నిన్ను
వెంటాడుతూనే వుంటాయి..

తప్పించుకున్న హంతకులను
వేటాడుతూనే వుంటాయి..

(ఈ నా కవితను  ఈ బ్లాగులో కూడా చదవొచ్చు You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #2
Kumar Varma garu
Good poetic manner
Chala Bhaava yuktham ga cheppaaru.

Good. Chala baagunnnadandi.
Santhosam mee sailiki.
go a head.
Quote this message in a replyReply

Post: #3

Thanks for your kind response


idi nenu bhopal durghatana photo pai raasinadi. ikkada photo pedite inka arthavantanga vundedi. photo nu ela post cheyalo teliyaka cheyalekapoyanu. suman garu cheptara..
Quote this message in a replyReply

Post: #4
నా అంతరంగంలోని భావసంఘర్షణను అక్షరీకరించే ప్రయత్నం..
అని మీరు చెప్పిన దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
మీరు చాలా సామాజిక బాధ్యత కలిగిన కలిగిన కళాకారుడుగా కనిపించారు.
అందుకే ....
కళాకారులెప్పుడూ కళకళ లాడలేరనేది నిజం.
మీరు ఆవిష్కరించిన చిత్కళ ఆలోచింపజేసేదిగా ఉంది.
గో ఎ హెడ్.
Quote this message in a replyReply

Post: #5

Thank you Sir.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)