Post: #1
మనలో కొందరికి కంప్యూటరు అనేది నిత్య జీవనంలో ఒక తప్పనిసరి వాడుక సాధనంగా అయ్యింది కదూ.
ఇక ఇంటరునెట్ బ్రాడ్బాండ్ అందుబాట్లో ఉంటే - అన్ని పనులకీ కంప్యూటరు మీదే ఆధారపడ్తున్నాము ...
ఇలాంటి కంప్యూటరు గురించి కొన్ని సంవత్సరాల క్రితం రచయిత్రి టి.జ్ఞాన ప్రసూన గారు రూపొందించిన
దండకాన్ని మనం ఓ సారి చూద్దాం. దీనిని You are not allowed to view links. Register or Login to view. అనే జ్ఞాన ప్రసూన గారి బ్లాగు నుండి సేకరించడం జరిగింది

దండకం అనేది మనం మామూలుగా దేవుళ్లకి లేదా దేవతలకి చేసే స్తుతి. మరి కంప్యూటరు స్తుతి ఇది :

Quote:కంప్యూటరాయ నమో నమ:

కలికాల జీవన విధారణ తారణొపాయనమ: ఉచ్చ,నీచ,బీద,గొప్ప తారతమ్య రహిత తారణ మంత్రాయ నమ;
యువ మానసరాజ హంసాయనమ: ఇంటింటీ దేవతాయై నమ: చదువుకున్, పాటకున్, మాటకున్, ఆటకున్,
తపాలాపనికిన్, పద్దులకున్, హద్దులు దాటీంచే విహారాలకున్, ప్రచురణలకు, ప్రణయాలకు, పరిణయాలకు,
విపణికిని, కవితానిపుణులకు, అర్ధాలకు, ఆరొగ్యానికి, విమర్శలకు, వినొదానికి, పంచాంగానికి, ప్రయాణాలకు,
టీక్కెట్ళకి, దారిచూపడానికి,టైము తెపడానికి,వాత్రలకి,ఇంకా వేవేల సలహాలకి,సహాయానికి, నీకన్న మాకెవ్వరే దిక్కు?

అన్నదాతా! ఉద్యొగ దాతా! అనర్గళ పాండీతీపటీమ పొట్టలొ దాచిన నేతా! బడెందుకు, కాలేజీ ఎందుకు, సినిమా
హాలెందుకు, చింత లేక నీ చెంత కూర్చుని పొందరే హాయినీ, శాంతిని, ఆనందాన్ని, అద్భుతాన్ని.

నేను లేనిదే నువ్వుందలేవు మానవా! అంటావుకాని, నేనులేందే నీఅంతట నువ్వు ముందుకెళ్ళగలవా?
దారితెలియని బాటసారిలా నిలబడిపొతావు. లేకపొతే తుర్రుమనీ ఇంటికి పొతావు, ఆవలించి నిద్ర పొతావు
ఒక్క అక్షరం అటూ ఇటూ అయితే కామా, ఫుల్స్టాప్ లేకపొతే దిద్దు కొలేని దద్దమ్మవు కదా? నేనే సరిదిద్దాలి.
చిన్న తప్పునే భరించవు! మొదటీనుంచీ మంగళం పాడీ చెరిపేస్తావు. జాలిలేదు, కరుణ లేదు,
కొత్తవారని లేదు, పెద్దవారని లేదు, కరకు గుండే కంపూటరూ ఎన్ని గుండేల్లొ తిష్ట వేసావే!

ఇంట్లొ నువ్వొక అలంకారం,అవుసరం అయిపొయావే! ఇంటర్నెట్ను వెంటేసుకొని ఎన్ని హొయలు పొతున్నావే!
మధ్య మధ్య యాడ్ లని డెస్క్ టాప్ మీద గెంతించి మమ్మల్ని విసిగిస్తావ్ నువ్వు సంపాదిస్తావ్ . బల్లలమీంచి
ఒళ్ళొకి జారావే లాప్ టాప్ పేరుతొ! పిల్లల్ని ఎత్తుకొడానికి ఓపిక లేని తల్లులు లాప్ తాప్ని పాపాయిల వలే ఒడిలొన
లాలిస్తున్నారే! రొజులొ సగ భాగం దాని మొజులొనే గడిపేస్తున్నారే! మనిషి జీవితం లాప్ తాప్ లొ ఇరుక్కు పొతొందే!
ఏది ఏమయినానీ సేవ గొప్పదినీ రూపుచక్కనిది.జొహారు కంప్యూటరూ జొహారు లాప్ టాపు వర్ధిల్లు, వర్ధిల్లు,
చిరకాలం వర్ధిల్లు.

రచన: టి జ్ఞాన ప్రసూన


జ్ఞాన ప్రసూన గారు బ్లాగు రచనలని మొదలుపెట్టిన తొలి రోజులలో తెలుగులో టైపు చేయడం వల్ల అక్షర దోషాలని,
వ్యాకరణాన్ని సరి చూడలేదు . అయినా భావం అందరికీ అర్ధమయ్యేలా ఉంది కనుక సవరణలు చేసే ప్రయత్నం
చేయకుండా పోస్టు చేయడం జరిగింది. ఈ దండకాన్ని చదివిన మనకందరికీ కంప్యూటరు దీవెనలు అందును గాక !
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)