Post: #1

కాలిపోయే

కొవ్వొత్తి మీద

ఎవరు చూపుతారు జాలి....?

తను నిలువునా కాలుతూ...

వెలుగులు నింపుతున్నది....!!

అది చాలేమో మరి.

చుట్టూ ఉన్న

చీకటిని తిడుతూ

కూర్చునే కన్నా....

కనీసం

చిన్న వెలుగును

ప్రసరింపజేయటం కోసం...

ఒక

చిన్న

క్రొవ్వొత్తిని

వెలిగించొచ్చు కదా...!!

కానీ...

చాలామంది

ఇదే జీవితమని

అనుకుంటూ....

పొరపడుతూ

రజ్జు సర్పభ్రాంతి లో

బ్రతుకుతున్నారు...?

ప్ఛ్....

వాళ్ళ మీద

కలిగేది కోపం కాదు కదా...

కేవలం జాలి మాత్రమే.

జాలి...

మరి కరిగిపోయే

వెలుగులు పంచే...

క్రొవ్వొత్తి మీద

జాలి చూపేదెవరు ?

Quote this message in a replyReply

Post: #2
కొవ్వొత్తికి కావలసినది జాలి కాదనుకుంటా.. తను కరిగిపోయేలోపు మరో కొవ్వొత్తి కాగల మిత్రుడు.. కాదంటారా?
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)