Post: #1

అందరికీ నమస్కారములు

నాకు మల్టీమీడియాలో కొన్ని సందేహాలు ఉన్నాయి. తెలిసివాళ్ళు ఎవరైనా తీర్చగలలరు.

  1.  సీడీ / డీవిడి తేడా తెలుసుకోవడం ఎలా?
  2. నా దగ్గర హ్యాండీకామ్ తో తీసిన కొన్ని వీడియోలు ఉన్నాయి. అవి కంప్యూటర్ లో ప్లే అవుతున్నాయి. వాటిని  సీడీ / డీవిడి ల్లో కాపీ చేస్తే సీడీ / డీవిడి ప్లేయర్ లో ప్లే కావటం లేదు. అలా ప్లే అవ్వాలంటే ఏమిచెయ్యాలి?
  3. అ వీడియోలను వీడియో  సీడీ / డీవిడి లుగా చేసే మార్గం ఏమిటి?
  4. ఒక మిత్రుడిని అడిగితే  సీడీ / డీవిడి బర్న్ చెయ్యాలి అన్నాడు. అంటే ఏమిటి అని అడిగాను. Nero సాఫ్ట్ వేర్ వాడు తెలుస్తుంది అన్నాడు. దాని గురించి అంతర్జాలంలో వెతికితే ఉచిత వెర్షన్ ఉన్నట్టు కనబడలేదు. అసలు Nero ఉచిత వెర్షన్ దొరుకుతుందా?
  5. Nero ఉచిత వెర్షన్ లేకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా?
  6. సీడీ / డీవిడి ల్లో కాపీ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? మనం ఈ పని ఎవరికైనా చేసిపెడితే ఎంత చార్జ్ చెయ్యవచ్చు?
  7. అలాగే రిప్పింగ్ అనేది కూడా ఉంటుందని విన్నాను. దాని గురించి కూడా వివరంగా తెలుపగలరు?
  8. నాదగ్గర వివిధ సందర్భాలలో తీసిస ఫొటోలు ఉన్నాయి. వాటిని ఒక అందమైన ఆల్బంగా చేసి వాటిని కంప్యూటర్ లోను,  సీడీ / డీవిడి ప్లేయర్ లోను చూడటానికి తగిన ఉచిత సాఫ్ట్ వేర్ ఏదైనా ఉందా? ఆల్బం చేసిన తరువాత అవసరమైతే ప్రింట్ కూడా చెయ్యగలగాలి.
  9. ఈమధ్య ఒకమిత్రుని పెళ్ళి ఆల్బం చూసాను. అది అంతా కంప్యూటర్ లో డిజైన్ చేసి ప్రింట్ చేసినది.  మాఇంట్టో పెళ్ళి ఆల్బం మాత్రం ఫోటోలు ప్రింట్ చేసి, బోర్డర్స్, డిజైన్న్ అన్నీ పేపర్ డిజైన్స్ కట్ చేసి అరేంజ్ చేసినది. దీనికన్నా కంప్యూటర్ లో డిజైన్ చేసినదే బాగుంది. అలా కంప్యూటర్ లో పెళ్ళి లాంటి ఏ కార్యక్రమానికైనా ఆల్బం సులువుగా తయారుచేయడానికి తగిన ఉచిత సాఫ్ట్ వేర్ దొరుకుతుందా? అంత అందంగా ప్రింట్ వెయ్యాలంటే ఎటువంటి ప్రింటర్ వాడాలి? ఒక ప్రింట్ కి ఎంత ఖర్చు అవుతుంది?

ఈ విషయాలు తెలిపినవారికి కృతజ్ఞతలు.

 

రామకృష్ణ


Post: #2
* ఈ సందేహాలకి ఒక క్రమంలో సమాధానాల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాము . [subscribe=4588]Subscribe to this thread[/subscribe]

1
వస్తువు రూపంలో చూస్తే సిడి , డివిడి లు మనకు ఒకే రకంగా కనిపిస్తాయి. మెమరీ సైజు పరంగా అయితే సాధారణ సిడి లో
సుమారు 700MB నిడివిగల ఫైళ్లని భద్రపరచవచ్చును. అదే డివిడి లో అయితే మామూలుగా 4.7GB నిడివి లభిస్తుంది ..

భౌతికంగా గుర్తించడానికి సిడి & డివిడి వివరాలు చక్రం పైన ముద్రించబడి ఉంటాయి. అలాగే కంప్యూటరులో చక్రాన్ని పెడితే
అది సిడినా లేక డివిడినా అనేది కంప్యూటరు గుర్తించి మనకి చూపుతుంది. సాధారణంగా డివిడి డ్రైవులో సిడి & డివిడి లని
పెట్టినప్పుడు విండోసు ఆపరేటింగు సిస్టమ్ ఉన్న కంప్యూటరు అయి ఉంటే సంబంధిత చక్రంలోని ఫైళ్లని మనకి చూపుతాయి.

ఒక వేళ ఆ చక్రంలో ఏ ఫైళ్ళూ లేకుండా ఖాళీ గా ఉన్నా ఆ విషయాన్ని మనకి కంప్యూటరు తెలియచేస్తుంది / సూచిస్తుంది.

2
హాండీ కామ్ తో తీసిన వీడియోలు avi ఫార్మాట్ అయి ఉంటే కంప్యూటరు వాటిని చూపగలుగుతుంది. mov లేదా ఇతర
ఫార్మాట్ అయితే సంబంధిత మూవీ ప్లేయరు (eg. You are not allowed to view links. Register or Login to view.) కంప్యూటరులో ఉంటేనే చూపగలుగుతుంది.

హాండీ కామ్ డ్రైవర్లు ఉన్న సిడి (డివిడి) లో సంబంధిత వీడియోలని కంప్యూటరులో చూపడానికి అవసరమయ్యే సాఫ్టువేరు
సాధారణంగా జతపరచబడి ఉంటుంది . అయితే అది కేవలం బేసిక్ వర్షను (అడ్వాన్సు ఫీచర్లు లేనిది) అయి ఉండవచ్చును

ఒక సిడి లేదా డివిడిలో ఉన్న విషయాన్ని వీడియో / ఆడియో గా గుర్తించే పద్ధతిలో కంప్యూటరుకి & సిడి/డివిడి ప్లేయరుకి
సాంకేతికపరమైన తేడాలు ఉంటాయి. కంప్యూటరులో అయితే మనం ఉపయోగించే సాఫ్టువేరు ( మీడియా/మూవీ ప్లేయరు )
సిడి / డివిడి లోని విషయాన్ని గుర్తిస్తుంది. అవసరాన్ని బట్టి మనం మరో మీడియా ప్లేయరుని కంప్యూటరులో ఇనుస్టాలు
చేసుకోగలం. మరి డివిడి ప్లేయరులో అలాంటి సౌకర్యమైతే ఉండదు కదా...

---------- to be continued ----------

Post: #3

mn48 గారికి

            అడిగిన వెంటనే సమాధానం ఇస్తున్నందుకు ధన్యవాదములు.

 

రామకృష్ణ


Post: #4

Dear friend,

                          Nero basic * ikkada You are not allowed to view links. Register or Login to view. chesukogalaru . Mee minimum avasaralaku idi saripotundani naa abhipraayam .

Nero kakunda migatha top 5 dvd and cd burning softwares You are not allowed to view links. Register or Login to view. ikkada ichanu . Meeru check chesukoni sariyina software download chesukogalaru .

Already mana forum lo post cheyabadina nero download link koraku ikkada You are not allowed to view links. Register or Login to view. cheyyandi . Meeru koddiga samayam vecchinchi mana forum loni downloads section loni all software downloads lo search cheyagaligithe mee anni avasaraalaku saripada download links ikkade pondavachu .

Ika mee rendava mariyu yenimidava prashnalaku ee You are not allowed to view links. Register or Login to view. nu okasaari pariseelinchagalaru .

Mee yedo prashnaku ee You are not allowed to view links. Register or Login to view. chudandi . Dvd ripper yokka download link koraku You are not allowed to view links. Register or Login to view. click cheyyandi .


Post: #5
---- continued from previous response ----

2 [contd..]
ఇటీవలి కాలంలో లభిస్తున్న dvd player లలో వీడియోకి సంబంధించిన రకరకాల ఫార్మాట్ల ఫైళ్లని గుర్తించి చూపగలిగే
సామర్థ్యం ఉంటున్నది. అయితే బేసికల్ గా ఒక సాధారణ డివిడి ప్లేయరులో - dat అనే ఫార్మాట్ గల వీడియోలను &
vob అనే ఫార్మాట్ గల వీడియో , ఇంకా wav & mp3 ఫార్మాట్ల ఆడియోని గుర్తించగలిగే ఏర్పాటు మాత్రమే ఉంటుంది.

2 & 3
పైన పేర్కొన్న ఫార్మాట్లలో మనం సిడిలు & డివిడిలు రూపొందించుకుంటే అవి బేసికల్ డివిడి ప్లేయరు ద్వారా పనిచేస్తాయి.

2 , 3 & 4
ఒక సిడి లేదా డివిడి లో మనకి అవసరమున్న సమాచారాన్ని భద్రపరుచుకునే విధానాన్ని burning అని వ్యవహరిస్తారు.
ఈ ప్రక్రియలో సిడి / డివిడి రైటరు ద్వారా ఓ శక్తివంతమైన కాంతిపుంజంతో సిడి / డివిడి మీడియా చక్రం పొరలపై ఒక క్రమ
పద్ధతిలో burn చేయడం జరుగుతుంది !! ఇలా చేయడాన్ని సులభతరం చేయడానికి Nero ( Nero burning ROM )
వంటి సాఫ్టువేర్లని మనం ఉపయోగిస్తాము.

4 & 5
నీరో ఉచిత వర్షను లభిస్తుంది. అలాగే ఇతర వర్షనులూ లభిస్తున్నాయి ( Nicky గారు ఇచ్చిన లింకులు చూడండి )

నీరో బర్నింగు సాఫ్టువేరుకి బదులుగా ఉచితంగా లభించే ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి ( ఉదా. You are not allowed to view links. Register or Login to view. )

6
ఒక వీడియో సిడి / డివిడి ని సాధారణ డివిడి ప్లేయర్లలో పని చేసేట్లుగా బర్ను చేయడానికి సుమారు గంట నుండి
ఆరు గంటల సమయం పట్టవచ్చును. ఇందులో బర్నింగు సమయం కంటే ప్రాసెసింగు సమయం ఎక్కువగా ఉంటుంది.
సాధారణ డివిడి ప్లేయరు ద్వారా చూడటానికి అనుగుణంగా వీడియో ఫైళ్లని మార్చడానికి పట్టే సమయం ఎక్కువ ...

ఇలా వీడియో సిడి / డివిడి ని రూపొందించడానికి అవసరమైన విద్యుత్తు వినియోగాన్ని , సమయాన్ని & కనీస
లాభాన్ని పరిగణన లోకి తీసుకుని తగిన చార్జిని వసూలు చేయవలసి వస్తుంది. ( గమనిక : మనకి సంపూర్ణ
హక్కులు ఉన్న వీడియోలనే మనం సిడి / డివిడి గా రూపొందించి అమ్మకానికి పెట్టవచ్చును. మామూలుగా
మార్కెట్లో లభించే సిడి & డివిడిలని , ఇతరులకి హక్కులున్నవి కాపీ చేసి అమ్మడం కాపీ రైట్స్ చట్టరీత్యా నేరం )

---- to be continued ----

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)