Post: #1

మిత్రులారా....!!

ఒక వాక్యంలో ఒక కథను పూర్తిగా చెప్పగలరా...?

(ధృఢసంకల్పం ఉంటే అంతా సాధ్యమే కదా)

ప్రయత్నించి చూడండి.

కథ అన్నాను కదా అని తెలుగు భాషే అక్కరలేదు.

ఏ భాష అయినా సరే.

ఛాలెంజే మరి

ముందస్తు ధన్యవాదాలతో సరి.

Quote this message in a replyReply

Post: #2
ఎంకటి నెక్లెస్ కష్టాలు..


============షట్ ఏంటిలా జరిగిందని ఆరోసారి వచ్చిరాని  హింగ్లిష్ లో తిట్టుకుంటూ ATM నుండి బయటికొస్తూ చేతిలో కీస్ ను అలా జేబులోకి తోసేసరికి తట్టిన నోట్ల కట్టను అదేపనిగా తడుముకుంటు షాపింగ్ మాల్ కెల్లి అక్కడి జువెలరీ షాపులో నెక్లెస్ కొనుగోలు చేసి ఇంటికెల్తూ ఏదో ఆలోచన్లో

గమనించక-

దారితోచక-

దిక్కుతెలియక-

బెక్కుమంటూ-

బండి నడుపుతుంటే
"ఏరా తింగరెదవా వన్ వే  రోడ్డులో ఎదురుగా వస్తూ ఎవరిని చంపలనే" ట్రాఫిక్ కానిస్టేబుల్ కు వంద కొట్టి మళ్ళీ యూ టర్న్ తీసుకుని పొద్దున నెక్లెస్ తీస్కోక పోతే కొంపలో తిండి ఉండదని వార్నింగ్ ఇచ్చిన భార్యను, ఆవిడను కన్న అత్తా-మామలను కసిగా తిడుతూ
ఇంటికెళ్ళిపోయాడు ఎంకటి..

=============================================

థ చాలా చిన్నది కదా యెస్ వీ గారు . ఐనా పర్లేదేమో కధ పెద్దది కావాలని అడగలేదుగా మీరు.

ఇది నచ్చితే చెప్పండి. నెక్లెస్ తో కొంపలోకెల్లిన ఎంకటికి ఎదురైన సంఘటనలను నేను రెండో భాగంలో మరో కధగా చెప్పగలను.


ఎనీ టైమ్ ఎనీ సెంటర్.. Smile ( కామెడీ కామెంటండి నవ్వుకోండి బాబులు )


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
కథ బాగుంది కానీ
మన సినిమా రచయితలు గానీ, టివి రచయితలు (గోస్ట్ రైటర్ లు కూడా (వరస్ట్ రైటర్ లు కూడా)) సింగిల్ లైన్ లో చెప్పినట్లు చెప్పాలి మరి.
అపుడే మీతో ఒక డాక్యుమెంటరీగానీ, సినిమా గానీ, టివి సీరియల్ గానీ తీయగలను. ఇదే మాంఛి కథ చెప్పిన వాళ్ళకు నేనిచ్చే బహుమతి అన్నమాట.

ప్రయత్నించి చూడండి మిత్రులారా....!!

చూద్దాం మన స్టోరీ బోర్డు డిస్కషన్ లో ఒక్క మంచి కథ అన్నా రాకపోతుందా....(అన్న ఒక చిన్న ఆశ)
Quote this message in a replyReply

Post: #4

మన సినిమా రచయితలు గానీ, టివి రచయితలు (గోస్ట్ రైటర్ లు కూడా (వరస్ట్ రైటర్ లు కూడా)) సింగిల్ లైన్ లో చెప్పినట్లు చెప్పాలి మరి.
అపుడే మీతో ఒక డాక్యుమెంటరీగానీ, సినిమా గానీ, టివి సీరియల్ గానీ తీయగలను. ఇదే మాంఛి కథ చెప్పిన వాళ్ళకు నేనిచ్చే బహుమతి అన్నమాట.

------------------------------------------------------------------------------------------------------------------------మీరు పై విశయాన్ని మీ మొదటి పోస్టులోనే తెలియజేస్తే బహుశ మీరు ఆశించే రైటర్లు స్పందించే వారేమో అనుకుంటున్నాను యస్వీ గారు..

సరే ! మీరేదో చాలెంజ్ అదీ అన్నరు కదా అని మామూలు జనలకొరకేమో అనుకుని స్పందించాను.

ఏదేమైనా మీకు అలాంటి కధ తొందర్లో దొరికి దానిని మీరు అంటున్న/అనుకుంటున్న డాక్యుమెంటరీ-సినిమా-టీవి సీరియల్ లాగా తీయాలని కోరుకుంటున్నాను.


ఇంత మంచి
ఆశయంతో  విశయాన్ని మొదలు పెట్టిన మీకు విజయం చేకూరు గాక మీ ఆశ నెరవేరు గాక.....

కీపిటప్... Smile


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)