Post: #1

రూ.40,000 పెట్టి ఒక మంచి కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ సిస్టమ్ ను కొనుగోలు చేసి

రూ.1000 పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని

ఒక కామన్ మేన్ ....

కంప్యూటర్ నుండి గానీ, ఇంటర్నెట్ నుండి గానీ..ఎటువంటి గరిష్ట ప్రయోజనాన్ని ఆశించవచ్చు ?

ఫోరంలోని గౌరవనీయులైన సభ్యులందరికీ పేరు పేరునా నమస్కారాలు...^ ^ ^ ^ ^

నాకు ఎప్పటి నుండో ఉన్న సందేహాన్ని మీరందరూ వీలయినంతగా మీ మీ శైలిలో తెలియజేయగలరు

అస్సలు.... కంప్యూటర్ నుండి గానీ.... ఇంటర్నెట్ నుండి గానీ..... ఎటువంటి గరిష్ట ప్రయోజనాన్ని ఆశించవచ్చు.

కంప్యూటర్ తో గానీ, ఇంటర్నెట్ తో గానీ నేను సాధించగలిగే ప్రయోజనాలు ఏమేమి ఉండవచ్చు.....

లేదా ఎటువంటి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు.

అస్సలు ఏమేమి పనులను నేను దైనందిన జీవితంలో ఈ సాంకేతికత నుండి పొందవచ్చు.

జీవన శైలిలో ఏ విధమైన మార్పులు సంభవించొచ్చు లేదా సంభవింపజేసుకోవచ్చు.

ఎటువంటి సాంకేతిక ప్రగతిని సాధించవచ్చునో...

ఎప్పటి నుండో ఉన్న ఈ సందేహానికి మీరందరూ దయచేసి చక్కని పరిష్కార మార్గాన్ని సూచించగలరని భావిస్తున్నాను.

క్లుప్తంగా వద్దు.

ఆకాశమే హద్దు.

మీ అందరికీ నా కృతజ్ఞతలు.

ఫోరం అనేది ఒక చర్చా వేదిక....... కనుక సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో వివరించగలరని ఆశిస్తున్నాను.

సుదీర్థమైన వ్యాస శైలిలో (ఆర్టికల్ శైలిలో) తెలియజేయండి.

(ఎందుకంటే నాకు అర్థం కావటం చాలా కష్టం కనుక)

కొసమెరుపు : నేనేదో ఆన్ లైన్ డేటా ఎంట్రీ లేదా ఆన్ లైన్ ఎర్నింగ్ ల స్కీమ్ ల గురించి అడగటం లేదు. గమనించగలరు.  సాధారణ జీవితంలో పొందగల సదుపాయాలను తెలియజేయగలరు.  ఈ ప్రశ్నను నేను చాలారోజుల క్రితం అడగటం జరిగింది.  బట్ ఇంత వరకూ ఎవరూ రెస్పాండ్ కాలేదు. ????

Quote this message in a replyReply

Post: #2

సుమణి గారు

రూ.40,000/- లేదా రూ.1,000/- అనేదానిని సామాన్యం గా తీసుకోలేము. అంతకంటే చాలా చాలా తక్కువ ధరలో కూడా కంప్యూటర్ అనే వస్తువు దొరుకుతుంది, అంతకంటే తక్కువలోనే ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయా మొత్తాల గురించి చర్చించనవసరం లేదు, ఇది వారి వారి అభిరుచులు, అవసరాలను, కొనుగోలు శక్తి పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో అది సామాన్యుడి విషయం క్రింద పరిగణించలేం.


ఒక కామన్ మేన్ ....

కంప్యూటర్ నుండి గానీ, ఇంటర్నెట్ నుండి గానీ..ఎటువంటి గరిష్ట ప్రయోజనాన్ని ఆశించవచ్చు ?


ఒక సామాన్యుడిని అసామాన్యుడిగా చేయగల గరిష్ట ప్రయోజనం పొందవచ్చు ఆశించనక్కరలేదు. తగిన పట్టుదల, తృష్ణ ఉంటే ఇది సాధ్యం.

 

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)