Post: #1

ఫ్లాష్ సాఫ్ట్వేర్ నుపయోగించి క్రింద చూపిన విధంగా ఫ్లైట్ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం.



(ఈ ట్యుటోరియల్ Macromedia Flash 8 వర్షన్ లో తయారు చేయడం జరిగింది. Macromedia Flash 8 Download Link: You are not allowed to view links. Register or Login to view.

ఈ యానిమేషన్ తయారు చేయడానికి మొత్తం 4 ఇమేజ్ ఫైల్స్ ముందుగా రెడీ చేస్కున్నాను.

1. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్

2. ఫ్లైట్ ఇమేజ్

3. క్లౌడ్స్ ఇమేజ్ (కేవలం విమానం మేఘాలలో నుండి వెళ్తున్నట్లు రియాలిటీకి దగ్గరగా ఉండడం కోసం మాత్రమే ఈ లేయర్ ఉపయోగించాను)

4. బెలూన్ ఇమేజ్

ముందుగా ఈ నాలుగు ఫైల్స్ ను ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కోండి.

You are not allowed to view links. Register or Login to view.

ఇక క్రింది స్టెప్స్ ను ఫాలో అవండి.

1. Flash 8 సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేసి File >> New ను క్లిక్ చేయండి.

2. Modify >> Document.. ను క్లిక్ చేయండి. Document Properties లో Width=250px, Height=190px గా సెట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

Flight Animation - Flash Tutorial

3. File >> Import >> Import to Library ని క్లిక్ చేయండి.

Flight Animation - Flash Tutorial

4. పైన మీరు డౌన్లోడ్ చేస్కున్న సోర్స్ ఫోల్డర్ లోని 4 ఫైల్స్ ను సెలెక్ట్ చేసి Open క్లిక్ చేయండి.

Flight Animation - Flash Tutorial

5. Library ప్యానెల్ లో (పైన ఇంపోర్ట్ చేసిన) bg.jpg ని stage మీదకు డ్రాగ్ చేసి వదిలేయండి.

Flight Animation - Flash Tutorial

6. Window >> Align ను క్లిక్ చేయండి.

Flight Animation - Flash Tutorial

7. Align ప్యానెల్ లో క్రింద చూపిన విధంగా వరుసగా 3 బటన్ లను క్లిక్ చేయండి. ( స్టేజ్ మీదికి డ్రాగ్ చేసిన bg ఇమేజ్ ను అలైన్ చేయడం కోసం)

1). To stage button

2). Align right edge button

3). Distribute vertical center button

Flight Animation - Flash Tutorial

8. Timeline విండోలో Insert Layer బటన్ ను క్లిక్ చేయండి. (ఇపుడు యాడ్ చేయబోయే flight.psd కొరకు ఈ కొత్త లేయర్ ను ఏర్పాటు చేస్తున్నాము)

Flight Animation - Flash Tutorial

9. ఇపుడు 5 వ స్టెప్ లో చూపిన విధంగా  flight.psd ని స్టేజ్ మీదకు డ్రాగ్ చేసి, 7వ స్టెప్ లో చెప్పిన విధంగా అలైన్ చేయండి. ఇలాగే మిగిలిన రెండు ఇమేజ్ (clouds.psd మరియు balloon.psd) లకు కూడా రెండు కొత్త లేయర్లను ఏర్పరిచి సేమ్ స్టెప్స్ రిపీట్ చేయండి.

ఇపుడు Timeline విండోలో ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

Flight Animation - Flash Tutorial

10. Layer 1 కీ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి Create Motion Tween ను క్లిక్ చేయండి. ఇలాగే Layer 2,3,4 లకు కూడా Motion Tween create చేయండి.

Flight Animation - Flash Tutorial

11. ఇపుడు Layer 1 లో 100 వ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి Insert keyframe ను క్లిక్ చేయండి. వెంటనే Align ప్యానెల్ లో Left edge బటన్ ను క్లిక్ చేయండి. ఇపుడు బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ రైట్ నుండి లెఫ్ట్ కు మూవ్ అవుతుంది. Layer 3 లో ఉన్న clouds కు కూడా సేమ్ స్టెప్స్ రిపీట్ చేయండి.

Flight Animation - Flash Tutorial

12. Layer 2 కు కూడా పై స్టెప్ లో చెప్పిన విధంగానే 100 ఫ్రేమ్ వద్ద కీఫ్రేమ్ ఇన్సెర్ట్ చేయండి. ఈ లేయర్ కు అలైన్ చేయనవసరంలేదు.

ఇపుడు Ctrl+Enter Press చేసి మీరు చేసిన యానిమేషన్ ను చూడండి.

బెలూన్ ను కూడా యానిమేట్ చేయాలనుకుంటే Layer 4 లో bottom to top యానిమేట్ చేయండి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Source file link not working reupload it.
Quote this message in a replyReply

Post: #3
Thankssssssssssssssssssssssssssssssssss
Quote this message in a replyReply

Post: #4
You are not allowed to view links. Register or Login to view.)

పైన ఉన్న లింకు నుండి
Macromedia Flash Professional 8 DOWNLOAD అవడంలేదు కారణం
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)